Posts

Showing posts with the label chinna neethi kathalu in telugu

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

Image
  ఫిబ్రవరి  21 రోజు  అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం  అని  ఎంతమందికి తెలుసు .  మాతృభాష అంటే మనము  మాట్లాడే భాష కానీ మనం ఎంతవరకు ఆ తల్లి భాషకు దగ్గరగా ఉన్నాము ఎవరికి తెలియదు, తెలిసినా కూడా దానిని పట్టించుకోరు.   భాష అనేది భావ వ్యక్తీకరణ ప్రక్రియ , మనము మన మనసులో వున్న భావాలను ఎదుటి వారికి అర్థం అయ్యేలా చెప్పడం . ప్రపంచవ్యాప్తంగా రకరకాల భాషలు అందుబాటులో ఉన్నాయి ఓ ఇంగ్లీష్ అనే భాష ప్రపంచ భాషగా ప్రసిద్ధి చెందింది ఇంగ్లీష్ , హిందీ , తర్వాత అత్యధిక సంఖ్యలో మాట్లాడే భాష తెలుగు . మాతృభాషలో మాట్లాడితే వచ్చే ఆనందం గురించి ఒక చిన్న ఉదాహరణ. మా అమ్మమ్మ తాత వాళ్ళు మహారాష్ట్రలో రైల్వే ఉద్యోగం చేసేవాళ్ళు  ప్రతి సంవత్సరం సెలవులకు నేను అక్కడికి వెళ్లేదాన్ని .అక్కడ మార్కెట్ కి గాని, గుడికి గానీ వెళ్ళినప్పుడు అక్కడ మన భాష మాట్లాడే వాళ్ళు ఒక్కరు కనిపించినా మనకు చాలా సంతోషంగా దగ్గరకు వెళ్ళి కొద్ది సేపు మాట్లాడి వచ్చేది.నిజంగా వేరే ప్రాంతానికి వెళ్లినపుడు మన బాషలో మాట్లాడితే ఆ ఆనందమే వేరు. మాతృభాష ప్రతి చిన్న భావాన్ని చాలా స్పష్టంగా వ్యక్తపరచగలిగే సాధనం. ప...

valentine's day❤️❤️❤️

Image
Valentine's day అనగానే ముందు మనకు గుర్తుకు వచ్చే విషయం ఏంటి. ?   అదే ఏంటి అని ఆలోచిస్తున్నారా! చెప్తా ఉండండి అసలు విషయం భజరంగ్ దళ వాళ్ళు . అవును కొన్ని రోజుల క్రితం వరకు వాళ్ళు వాలెంటైన్ డే రోజు రోడ్డు మీద ఎవరైనా ప్రేమికులు లేదా జంటగా కనబడినా కూడా వాళ్ళ చేతికి బలవంతంగా తాళి ఇచ్చి కట్టమనేవారు .అందులో కొందరు ఇష్టం ఉండి ,ఇష్టం లేక ,కొందరైతే స్నేహితులుగా ఉండేవాళ్ళు కూడా ఉండేది .కానీ ఇప్పుడు పరిస్థితి మారింది లెండి.ఇది మాకు ఎందుకు అనుకోకండి రీడర్స్  valentine's day special blog.   Valentine's day ఎలా మొదలైంది అంటే , మూడవ శతాబ్దంలో  రోమ్ ను పరిపాలిస్తున్న చక్రవర్తి క్లాడియాస్ 2 తన నగరంలో ప్రేమ వివాహాలను నిషేధించాడు ,పెద్దల మాట వినకుండా చేసుకున్న పెళ్ళిళ్ళ వల్ల వారు జీవితంలో నష్ట పోతారు అని భావించి అతను అలా చేశాడు.కానీ తాడిని తన్నేవాడు ఒకడైతే  వాడి   తల తన్నేవాడు ఇంకొకడు వుంటారు అని అంటారు కదా! అలా ఈయన నిషేధిస్తే మనం ఎందుకు పాటించాలి అనుకున్న సెయింట్ వాలెంటైన్ అనే వ్యక్తి అదే ప్రేమ వివాహాలకు మద్దతు తెలిపాడు .అతన్ని  చక్రవర్తి ఎన్నో సార్ల...

గోదా కల్యాణం

Image
గోదాదేవి వచ్చెనమ్మా మన ఆండాళ్ వచ్చెనమ్మా శ్రీ విల్లిపుత్తూర్ నుండి గోదాదేవి వచ్చెనమ్మా మన కృష్ణుణ్ణి పెళ్లాడ  వచ్చెనమ్మా.  ఈ పాట నిజంగా వినని వారు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. ఎందుకు అంటే ఈ పాట అందరికి తెలుసు .మన గోదాదేవి కల్యాణం పాట కాబట్టి . ఈ రోజు మన కథ గోదా కల్యాణం కథ.ఆమె ఎవరు ?ఆమె కృష్ణుడిని ఎందుకు పెళ్లి చేసుకుంది ? అని ఆమెని గురించి తెలుసుకుందాం. శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే విష్ణు భక్తుడు ఉండేవాడు.అతని చిత్తం ఎల్లప్పుడూ విష్ణువు మీదనే ఉండడం వల్ల అతనికి విష్ణుచిత్తుడు అనే పేరు వచ్చింది ఇతను ఆళ్వార్ లలో ఒకరు మరియు పెద్ద ఆళ్వార్ . విష్ణుచిత్తుడు ఒక తోట పెంచేవాడు ఆ తోటలో మొక్కలకు పాదులు తీసే సమయంలో తులసి మొక్కల దగ్గర ఒక చిన్న పాప దొరికింది. ఆమెకు కోదై అనే పేరు పెట్టాడు  కోదై అంటే పూలమాల అని అర్థం అది  క్రమంగా గోద గా మారింది.   ఆమెను విష్ణుచిత్తుడు అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.గోదకు ప్రతిరోజు చిన్ని కృష్ణుడి లీలలు చెప్పేవాడు ఆమె ఎంతో శ్రద్ధతో వినేది .ఆమె కృష్ణుడి కథ లేకుండా నిద్రపోయేది కాదు .అలా అలా పెరిగి పెద్దది అయింది .చిన్నతనం ను...

శ్రీకృష్ణ రాయబారం .

Image
మహాభారతంలో అన్ని కథలు మనకు చాలా దగ్గరగా ఉంటాయి అని గతంలో చెప్పుకున్నట్లే ఈ శ్రీకృష్ణ రాయబారం కూడా అలాంటిదే. రాయబారం అంటే ఒకరి తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడడం కాదు ఇరువురి మధ్య ఉన్న సమస్య గురించి లోతైన అవగాహన ఉండాలి.సమస్య తెలిస్తేనే కదా ! దారి తెలుస్తుంది.మహాభారతం ఒక కథ మాత్రమే కాదు మనందరి జీవితాలకు ఒక అర్థవంతమైన పుస్తకం. పాండవులను కౌరవులు అడుగడుగునా హింసిస్తున్నా కూడా చెక్కు చెదరకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళుతున్నారు.ఈ క్రమంలో వారు కొత్తగా నిర్మించిన ఇంద్రప్రస్తాన్ని చూడడానికి ఒకరోజు దుర్యోధనుడు వెళ్తాడు అతను ఆ భవనాన్ని చూసి చాలా ఆశ్చర్యం పొందాడు,దానితో అసూయ చెందాడు.ఎలాగైనా ఇంద్రప్రస్తాన్ని కూడా చేజిక్కించుకోవాలి అని పన్నాగాలు పన్నాడు.శకుని మామ సహాయంతో మాయ పాచికలు తయారు చేసాడు.ధర్మరాజు జూదానికి బానిస కాదు కాని అతనికి జూదం అంటే ప్రాణం.   ధర్మరాజును కౌరవులు జూదానికి ఆహ్వానించారు ,వారి మనస్తత్వం తెలిసి కూడా ధర్మరాజు ఒప్పుకున్నాడు.వారు ఆహ్వానించనందువల్ల మనం వెళ్ళాలి అని అందరిని కూడా గట్టుకొని హస్తీనాపురానికి వచ్చాడు.శకుని తన చాకచక్యంతో పండిత పామర జనాలను మభ్య పెడుతూ ధర...

పర్యావరణం-జంతువులు.

Image
అమ్మా ఇక్కడ నీళ్లు ఏంటి ఇలా ఉన్నాయి చాలా మురికిగా ఎలా తాగాలి అని అడిగింది పిల్లకోతి ,ఎం చేస్తాం బిడ్డా దాహం వేసినప్పుడు ఏదో ఒకటి తాగి మన దాహాన్ని తీర్చుకోవాలి అన్నది .ఎందుకమ్మా ఇలా ? మన తాత ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు పచ్చని చెట్లు , చల్లని గాలి ,సెలయర్ల గలగలలు ,పక్షుల కీలకిలలు ,కోయిల కూని రాగాలు, చెట్ల నిండా పండ్లు, ఫలాలు,కూరగాయలు ఇలా ఒక్కటేమిటి అన్ని అంటుండేవాడు . ఎవమ్మా ఇప్పుడు అవన్నీ అన్నది మాకు కనపడవా?.   పాపం ఆ తల్లి కోతికి కూడా బాగా బాధ అనిపించింది.అవునమ్మా ఒకప్పుడు ఈ పర్యావరణం అలాగే ఉండేది.కానీ ఇప్పుడు అలా లేదు అంటుంటే కుందేలు వచ్చింది, ఎందుకు కోతి బావా అలా అంటున్నావు అన్నది, సరే విను చెప్తా అని చెప్పడం మొదలుపెట్టింది .ఒక్కొక్కటిగా అన్ని జంతువులు అక్కడ గుమి గుడాయి.  ప్రకృతి అంటే గాలి, నీరు ,నింగి,నేల,నిప్పు ఇవన్నీ  పంచభూతాలు . భూమి మీద మనుషులు ,జంతువులు జీవిస్తాయి జంతువులు అన్నీ అడవులలోనే జీవనం సాగించేవి ,మనుషులు పరిణామ క్రమంలో మొదట అడవుల నుండి క్రమంగా నీరు ఉన్న ప్రదేశాలలలో ఆవాసాలు  ఏర్పరచుకున్నారు.నీటి చుట్టూ వున్న ఆవాసాలు మెల్లిగా గ...

కచుడు -దేవయాని కథ..

Image
మా కళాశాలలో తెలుగు ఉపాధ్యాయుడు పాఠం చెప్తూ మహాభారతంలో లేనిది లోకం లో లేదు లోకంలో ఉన్నది అంత మహాభారతంలో  ఉంటుంది అన్నారు కానీ నాకు అర్థం కాలేదు .కానీ నిజంగా ఒక్కొక్క కథ చదువుతుంటే అప్పుడప్పుడు నిజమే అనిపిస్తుంది. ఈ కథ మహాభారతంలో ఒక ప్రేమకథ, కానీ ఇద్దరు ప్రేమించుకోలేదు ఒక్కరు మాత్రమే ప్రేమించారు ,అసలు ఏంటో ఈ కథ తెలుసుకుందాం.             హిందూ పురాణాల ప్రకారం దేవతలకు,రాక్షసులకు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో దేవతలు రాక్షసులని ఎంతమందిని చంపినా రాక్షసులు చనిపోకుండా  మళ్ళీ మృత సంజీవని విద్య ద్వారా  బ్రతుకుతున్నారు.ఈ విద్య కేవలం రాక్షసుల గురువైన శుక్రాచార్యుడుకి మాత్రమే తెలుసు. దేవతలు అంతా కూర్చొని ఆలోచించసాగారు.      దేవతల గురువు బృహస్పతి అతని కుమారుడు కచుడు, దేవతలు అందరూ కచుడిని శుక్రాచార్యుడి  దగ్గరకు శిష్యరికానికి పంపించారు. కచుడు శుక్రాచార్యుడికి జరిగిన విషయం చెప్పి అతని దగ్గర శిష్యుడిగా చేరాడు .కచుడు మంచి ప్రవర్తనతో అతని మనసు గెలుచుకున్నాడు, శిష్యులందరిలో ఉత్తముడిగా పేరు సంపాదించాడు. శుక్రాచార్యుడుకి దేవయాని...

లాభమా? -నష్టమా?

Image
అనగనగా ఒక పెద్ద అడవి దాని పేరు సుందరవనము.అది అతి సుందరంగా వుండడం చేతదానిని సుందరవనము అంటారు.ప్రతి అడవికి రాజు సింహమే కదా ఇక్కడ కూడా సింహమే రాజు ,కుందేలు మాత్రం మంత్రి . అడవిలో అన్నీ జంతువులు చాలా సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి.ఒకరోజు సింహం వేటకు వెళ్ళింది అక్క కొన్ని వృద్ధ జంతువులు కూర్చొని తమ తమ సమస్యల గురుంచి మాట్లాడుకుంటున్నాయి.        దూరం నుంచి ఆ మాటలు వింటుంది సింహం వారికి కనపడకుండా .ఆ జంతువులు మనము ఇప్పుడు ముసలి వాళ్ళము మనకు వేటాడే శక్తి లేదు కాబట్టి మన పిల్లలను బాధ పెట్టకుండా మనలో మనం ఆహారం ఐపోయి చనిపోదాం అని అంటున్నాయి.ఆ మాట విన్న సింహం కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సింహం తన స్థావరనికి వచ్చి కుందేలును పిలిచి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది .జంతువులు అన్ని భయం భయంగా వచ్చాయి.అప్పుడు అక్కడ ఉన్న జంతువులను ఉద్దేశించి మన అడవిలో ఎవరికైనా అత్యవసరంగా సాయం చేయవలసి ఉందా అని అడిగింది, అన్ని ఆలోచించసాగాయి.కుందేలు టక్కున లేచి సాయం కోసం ఎదురు చూసేది కేవలం వృద్ధ ప్రాణులే అంది కుందేలు.ఐతే మీరందరు వృద్ధ జంతువుల సంరక్షణ కోసం సలహాలు,సూచనలు చేయవలసిందిగా ఆదేశించింది. రాజా మన...

పాజిటివ్ థింకింగ్.

Image
  సెప్టెంబర్ నెలలో 13 వ తేదీని పాజిటివ్ థింకింగ్ డే గా నిర్వహిస్తారు.సానుకూల ఆలోచనలు మనిషిని మంచి మార్గం వైపుకు మళ్లిస్తాయి.ఒక వ్యక్తి ఎంత బాధలో ఉన్నా తనయొక్క ఆలోచనలు నియంత్రించుకోకపోతే అవి వ్యతిరేక ఆలోచనలుగా మారతాయి,దానివల్ల మనం లేక ఇతరులు భాదపడవలసి వస్తుంది.సానుకూల ఆలోచనలు మన మెదడును ప్రభావితం చేస్తాయి.మనం చేసే ప్రతి పని ఒక పద్దతిలో చేయాలి,ప్రతికూల ఆలోచనల ధోరణిని విడిచిపెట్టాలి.కాదు అని అనుకున్న పనులు కూడా మన ప్రయత్నంతో పూర్తి అవుతాయి.ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ప్రణాళిక రచన చాలా ప్రధానం,ప్రణాలికను చక్కగా ఆచరణలో పెడితే తొంబై శాతం పూర్తి అవుతుంది.మిగిలిన 10 శాతం పని చేయడం వల్ల ఐపోతుంది.సానుకూల ఆలోచనల వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది,సృజనాత్మకత బయట పడుతుంది. ప్రతికూల ఆలోచనల వల్ల అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది.రక్తపోటు, ఆందోళన,డిప్రెషన్ వంటివి చేరతాయి.ఆటగ్యాన్ని దెబ్బతీసే ప్రతికూల ఆలోచనలు చేయవద్దు. ఒక విషయాన్ని ఎంత ఆలోచించిన మారదు, కాన్ని దాని నుండి బయట పడే మార్గాన్ని వెతికితే సులువుగా ఆ పని మనం చేయవచ్చు. మీకు పాజిటివ్ థింకింగ్ గురించి ఒక కథ చెప్తాను.రామాపురంలో సుగుణమ్మ అనే ఒక ముసలి అవ్...

చెడపకురా చెడేవు.....

Image
రామకృష్ణాపురంలో సాంబయ్య అనే రైతు ఉండేవాడు అతను చాలా కష్టపడి పని చేసేవాడు .అతనికి  నలుగురు కొడుకులు రంగయ్య,రాజయ్య,రుద్రయ్య మరియు రాఘవయ్య.రాజయ్య, రంగయ్య, రుద్రయ్య బాగా తెలివినవాళ్ళు,రాఘవయ్య పాపం వట్టి అమాయకుడు.ఎవరు ఏమి చెప్పిన నమ్ముతాడు.రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలకు పెళ్లిళ్లు చేసాడు సాంబయ్య. అతని దిగులు అంత చిన్న కొడుకు గురించే, అతని అమాయకత్వానికి ఎవరూ పిల్లను ఎవరు ఇవ్వలేదు.అలాగే ఉండిపోయాడు.కొన్ని రోజులకు సాంబయ్యకు జబ్బు చేసింది రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలు వారి పిల్లలను భార్యలను చూసుకుంటూ సాంబయ్యను పట్టించుకునేవారు కాదు.రాఘవయ్య తండ్రిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు .పూర్తిగా అతని ఆరోగ్యం క్షీణించి అతను చనిపోయాడు.అతను చనిపోయాక అన్ని కార్యక్రమాలు ముగిసిన తరువాత లాయరు వీలునామా తెచ్చి ఇచ్చాడు ఆస్థులన్ని సమంగా పంచుకోవడానికి.సాంబయ్య వీలునామాలో రాఘవయ్యకు కొంచెం ఎక్కువగా ఆస్తి రాసాడు అది చూసి మిగిలిన అన్నలు ఓర్వలేక ఇది మేము చూసుకుంటాం అని లాయరును పంపించి వేశారు. రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలు మంచి తరి పొలాన్ని తీసుకొని ఊరు అవతల పనికిరాని మెట్టభూమి ఇచ్చారు.ఇంకా అతని దగ్గర ఒక కుంటి పిల్ల...

అప్పయ్య ,కొండయ్య, కొరడా దెబ్బలు

Image
రంగాపురంలో అప్పయ్య,కొండయ్య అనే ఇద్దరు స్నేహితులు వుండేవారు.వారు దేశ సంచారం చేసేవారు రాజ్యంలోని పరిస్థితులను రాజుకు వివరించేవారు.అలా తిరుగుతూ తిరుగుతూ వుండేవారు. కోటిలింగాల రాజ్యంలో రాజు మా రాజ్యంలో ప్రజలు అంతా చాలా మంచివారు స్వార్థం లేని వారు అధికారులు లంచం తీసుకోరు అని బాగా గొప్పలు చెప్పుకునేవారు. కోటిలింగాల ప్రజల గురుంచి,అధికారుల గురించి తెలుసుకోవడానికి అప్పయ్య, కొండయ్య బయలుదేరారు.గ్రామాల్లో పర్యటిస్తున్నారు ఇద్దరు ఆట పాటలతో అందరిని ఆకట్టుకొని డబ్బులు పొగుచేస్తున్నారు.వాళ్ళు దారిలో వెళుతుంటే ఆగంతకులు వచ్చి వాళ్ళ సంచిని ఎత్తుకొని వెళ్లారు వీరు వాళ్ళను వెంబడించి దొంగలను పట్టుకున్నారు ఎందుకు ఇలా చేసారు అని అడగగా మాకు పని దొరకక ఆకలికి దొంగతనం చేసాము ఈ రాజ్యంలో ఏదయినా లోటు ఉంది అని చెప్తే మంత్రి వర్గం అంత మమ్ములను బ్రతనివ్వరు అందుకే మేము సంతోషంగా ఉన్నట్లు రాజు గారిని నమ్మిస్తున్నాము అని అన్నారు.అలా అన్ని గ్రామాలు పూర్తి అయిన తర్వాత అనోటా ఈనోట అప్పయ్య ,కొండయ్యల ఆట పాటల వినోదాలు రాజు గారికి తెలిసింది .వారికి రాజభవనం నుండి ఆహ్వానం లభించింది. వారు వస్తుంటే ఇద్దరు కాపలాదారులు మిమ్మ...

దీపావళి కథ...

Image
దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం .ఈ పండగను భారతదేశం అంతటా పిల్లలు పెద్దలు టపాసులు,మిఠాయిలు, పిండివంటలతో  చాలా సంతోషంగా జరుపుకుంటారు. దీపావళి జరుపుకోవడానికి రకరకాల కధలు ప్రచారంలో ఉన్నాయి.పూర్వ కాలంలో నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు.అతను భూదేవి వరహస్వామికి అసుర సమయంలో జన్మించాడు.ఇతను రాక్షస ప్రవృత్తి చేత మరణించబడతాడు అని బాధ పడిన భూదేవి విష్ణుమూర్తిని ఒక వరం అడిగింది.అతనికి చావు లేకుండా చేయమని అన్నది,  అలా జరగదు కాబట్టి తల్లి చేత మాత్రమే చంపబడతాడు అనే వరాన్ని పొంది ఉన్నాడు. తన తల్లి నేను నా కొడుకును చంపలేను కాబట్టి సరే అంది భూదేవి.ఆమె తన కొడుకు మంచి లక్షణాలు పొందడానికి జనక మహారాజుకి అప్పగించి వెళ్ళింది.జనక మహారాజు దగ్గర విద్య నేర్చుకొని అతను మంచి బుద్ధులు అలవాటు చేసుకున్నాడు.అతను కామాఖ్య అమ్మవారిని చాలా నిష్ఠగా పూజ చేసేవాడు. కొన్ని రోజులకు అతను పక్క రాజ్యం రాజైన బాణాసురుడుతో స్నేహం చేసాడు. అతను స్త్రీలను కేవలం భోగ వస్తువుగా మాత్రమే చూసేవాడు. అతని ప్రభావం చేత నరకాసురుడు కూడా మారిపోయాడు.స్త్రీలను ఆటబొమ్మలుగా చూడడం మొదలు పెట్టాడు,క్రమంగా పూజ చేయడం మానేశాడు.నరకాసురుడు...

రుక్మయ్య-వడ్డీ..

Image
అనగనగా అవంతిపురం అనే రాజ్యం ఉంది ఆ రాజ్యానికి రాజు సులోచనడు.సులోచనడు అంటే మంచి ఆలోచనలు కలిగిన వాడు అని అర్థం .ఆ రాజ్యంలో రుక్మయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు అతను నగలు తాకట్టు పెట్టుకొని సొమ్ము ఇచ్చేవాడు,కానీ ఎక్కువ వడ్డీ లాగేవాడు.కలలో కూడా వడ్డీ వడ్డీ అని ఆలోచించేవాడు. సులోచనడు అతనిని చాలా సార్లు మందలించాడు. అయిన అతని పద్దతి మార్చుకోలేదు. రుక్మయ్య దగ్గరికి చెన్నయ్య దంపతులు వచ్చారు వారి కూతురి వివాహం కోసం సొమ్ము అవసరం అయ్యింది. చెన్నయ్య దంపతులు వారి దగ్గర ఉన్న బంగారాన్ని ఇచ్చి ధనాన్ని తీసుకెళ్లారు అందరికంటే నీకు తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తాను అనేసరికి నోటు రాసుకోలేదు.చెన్నయ్య దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు , కూతురి వివాహం జరిగిపోయింది.      కొన్ని రోజుల తరువాత చెన్నయ్య దంపతులు పంట అమ్ముడుపోగా మిగిలిన ధనాన్ని ,దాచి ఉంచారు .అలా కూడబెట్టిన ధనాన్ని తీసుకొని పోయి రుక్మయ్య దగ్గరకు వెళ్లారు ,ఆయన నువ్వు నా దగ్గర ఎప్పుడు తాకట్టు పెట్టవు ? నేను నీకు ఎప్పుడు డబ్బులు ఇచ్చాను అని అన్నాడు.చెన్నయ్య దంపతులు కంగారుపడి తర్వాత తేరుకొని అలా మాట్లాడతారు ఏంటి రుక్మయ్య గారు మేము మా క...

నమ్మకం

Image
అనగనగా ఒక ఊరిలో  సుబ్బయ్య అనే అతను వున్నాడు.అతను ఒక గొర్రెలకాపరి .అతనికి ఒక కొడుకు సోము ఉండేవాడు.అతను తుంటరి ,ఒకరోజు తండ్రితో పాటు గొర్రెలు మేపడనికి వెళ్ళాడు.సుబ్బయ్య మధ్యాహ్నం భోజనం చేసి ఒక చెట్టు కింద కునుకు తీయడానికి వెళ్ళాడు .వెళ్తూ వెళ్తూ ఇక్కడికి పులి వస్తుంది జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళాడు .సోము సరే అన్నాడు, కాసేపటి తర్వాత సోము తండ్రిని ఆటపట్టించడానికి పులి పులి అని అరిచాడు.వెంటనే తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు.ఎక్కడ ?ఎక్కడ? అని అంటాడు.వురికే అన్నాను నువ్వు వస్తావా లేదా అని అన్నాడు.ఆ తర్వాత కొద్దిసేపటికి  మళ్ళీ ఆలాగే అన్నాడు సోము.సుబ్బయ్య వచ్చాడు ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదు అని హెచ్చరించి వెళ్ళాడు.ఒక గంట తర్వాత నిజంగానే పులి వచ్చింది .నాన్న నాన్న అని పిలిచాడు సుబ్బయ్య మాత్రం చెట్టుకిందనుండి రాలేదు పులి వచ్చి మంద లో ఉన్న గొర్రెలను తిన్నది.సోముని గాయపరిచింది. సోము పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్నకు  చెప్పి క్షమాపణ వేడుకున్నాడు. మనుషులకు ఒక్కసారి నమ్మకం పోతే దానిని తిరిగి నిలబెట్టుకోవడం చాలా కష్టం అందువల్ల నమ్మకం కోల్పోయే పనులు ఎప్పుడు చేయవద్దు. దాన...

నక్క తెలివి

Image
అనగనగా ఒక అడవి ఆ అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి.ఆ అడవికి రాజు మృగరాజు సింహం .సింహం మంచిదే కానీ దాని దగ్గర ఉన్న సైన్యంలో తోడేలు, నక్క,రాబందు ఉండేవి.సింహం సైన్యంలో నక్క అసలు మంచిది కాదు ఎప్పుడు తన స్వార్థం కోసమే ఇతరులను బలి చేసేది.ఒకరోజు సింహం పర్యటనకు వెళ్ళింది అన్ని జంతువులు ఈ అడవిలో ఎలా ఉన్నాయి నేను అంటే  అసలు బయపడుతున్నాయా లేదా!అని అంతటా తిరిగింది. ఏనుగు దగ్గరకు వచ్చింది మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నది అది చెప్పే లోపే నక్క కల్పించుకొని వాళ్లకు ఏమి సమస్యలు లేవు రాజు గారు అవి ఇంకా ఇష్టారాజ్యంగా తిరిగి అడవులను పాడు చేస్తున్నాయి వెంటనే ఏనుగులు ఎం చెప్పాలో అర్థం కాక తల దించుకున్నాయి.మృగరాజు ఏనుగులను మంద లించాడు. ఆ తర్వాత పక్షులను అడిగాడు ,వారు అన్ని కలిపి ఒకటే గొంతుతో నక్కను మాట్లాడనియక మాకు చాలా సమస్యలు ఉన్నాయి.అడవిలో మేము గూడు కట్టిన చోట ఇంకొకరిని రానివ్వకండి .మాకు చాలా కష్టం అవుతుంది లేకపోతే మాకు అందరికి ఒక దగ్గర మంచి గూళ్లు కట్టించండి అన్నాయి.వెంటనే నక్క మీకు గుళ్ళు కట్టడానికి డబ్బులు ప్రస్తుతం ఖాజానలో లేవు అవి సర్దిబాటు ఐతే కడతాం అన్నది సింహం పేరుకు రాజు అయిన నక్క మా...

రంగడు-సింగడు-ఉద్యోగం

Image
అనగనగా ఒక రాజ్యంలో సింగడు,రంగడు  అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు.వారి ఇంట్లో వాళ్ళు మీరు ఏ పని చేయడం లేదు అని తిట్టి ఇంట్లో నుండి గెంటేశారు.సింగడు ఏదిఅయినా మన మంచికే అని అనుకుంటాడు అందరికి అలాగే చెప్తాడు.రంగడిని తీసుకుని ఉద్యోగం కోసం బయలుదేరి వెళ్లారు. వారు అలా వెళుతుండగా వారికి సింహాగర్జన వినిపించింది ఇద్దరూ వెంటనే చెట్టు ఎక్కి కోమ్మల్లో దాక్కున్నారు. రంగడు అరేయ్ సింగా మనం ఎంత  ప్రమాదంలో ఉన్నామో తెలుసా మనం ఈ దారిన వద్దు అంటే నువ్వు తెచ్చావు అంటాడు ఎమీ కాదులే నువ్వు గబరపడకు అన్నాడు.మెల్లిగా చెట్టు దిగి చుట్టూ చూసి వేరే దిక్కుగా నడవడం మొదలు పెట్టారు.వెళుతుంటే దారిలో వారికి ఒక ఉంగరం కనిపించింది.దానిని రంగడు వేలికి పెట్టుకున్నాడు. కొంతదూరంలో వారికి భటులు ఎదురుపడ్డారు. రంగడి చేతికి ఉన్న ఉంగరాన్ని చూసి వాళ్ళను రాజు గర్ దగ్గరికి తీసుకెళ్ళారు. రంగడు భయపడుతున్నాడు, సింగడు ఎమి పర్లేదు మిత్రమా అంత మన మంచికే ఎక్కడ నుండో ప్రయాణం చేసి వచ్చి రాజు గారిని నేరుగా చూసే అవకాశం వచ్చింది అంటాడు.రాజు గారు వారిని గురించి అడిగాడు,వారు జరిగింది అంతా చెప్పారు..నాకు నమ్మకం కలగడం లేదు అప్పటిద...

సహవాస దోషం

Image
అనగనగా ఒక ఊరిలో ఒక గ్రామాధికారి,పూజారి,జూదరి అనుకోకుండా ఒక విహారయాత్రకు బయలుదేరారు.వారు పడవ ప్రయాణం చేస్తున్నారు,ఇంతలో ఒక భయంకరమైన తుఫాను వచ్చింది .దాని వల్ల వారు ఒక ద్వీపంలో చిక్కుకుపోయారు.అటునుంది వారు బయటపడే మార్గం కొరకు చాలా వెతికారు,కానీ వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. చివరకు ఇది ఐతే అది జరుగుతుందని భావించి అలా ఉండిపోయారు. అలా రెండు నెలలు గడిచిపోయాయి ,ఒకరోజు జూదరి రండి ఎంతకాలం ఇలాగే ఉంటారు సరదాగా పేకాట ఆడుకుందాం అంటాడు. గ్రామాధికారి ఈ విషయం మా ఊరిలో తెలిస్తే గ్రామస్తులు నాకు మర్యాద ఇవ్వరు నేను ఆడను అంటాడు.పూజారి జూదం అనేది ఒక వ్యసనం అది మహాపాపం ,నేను ఆడను అంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత గ్రామాధికారి జూదరి దగ్గరగా వచ్చి పోనీలే నేను ఇక్కడ ఆడితే అక్కడ మా గ్రామంలో ప్రజలకు ఎలా తెలుస్తుంది రా నాకు ఆట నేర్పించు అన్నాడు.ఆ తర్వాత పూజారి వచ్చి ఏవైనా దోష పరిహారాలు ఉంటే చేసుకుంటా,ఖాళీగా ఉండి ఏమి లాభం అన్నాడు.అలా ముగ్గురు కలిసి ఆడటం మొదలుపెట్టారు.పని ఏమి లేకపోవడంతో వారు ఒక వారంలొనే ఆట నేర్చుకున్నారు.అలా ఆడుకుంటూ కొన్ని నెలలు గడిచాయి.ఒకరోజు ఆ ద్వీపంలో ఒక సీసా కనిపించింది దానికి మూత పెట్టి వుంది వారు ...

స్నేహమేరా జీవితం.

Image
అనగనగా ఒక ఊరిలో ఒక చెరువు ఉండేది,ఆ చెరువు పక్కన ఒక చెట్టు ఉండేది .ఆ చెట్టు మీద ఒక పావురాల గుంపు ,ఎలుక ,చీమలు ఉండేవి.చెరువులో ఒక బాతు ఉండేది .అవన్నీ మంచి స్నేహంతో కలిసి మెలిసి ఉండేవి. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక వేటగాడు వచ్చాడు.ఈ చెట్టు మీద ఎక్కువ పావురాలు ఉన్నాయని వల విసిరి పట్టుకున్నాడు.పావురాలు ఎడుస్తున్నాయి, ఐతే చీమ ,ఎలుక,బాతు అన్ని కలిసి ప్లాన్ చేసాయి ,ఆ పావురాలను ఎలా అయినా విడిపించాలని వెంటనే అమలు చేసాయి. బాతు అరవడం మొదలు పెట్టింది వేటగాడు ఈ శబ్దం ఏంటి అని అటు వెళ్ళాడు,వెంటనే చీమ అతనిని కుట్టింది.అమ్మా నొప్పి అని విలవిల్లాడడు. ఎలుక పరుగున వెళ్లి వలను కొరికింది,పావురాలు అన్ని పారిపోయాయి.వేటగాడు వెంటనే అరవడం మొదలుపెట్టాడు .అన్ని ఎక్కడివి అక్కడకు వెళ్లిపోయాయి ఇంతలో చీమ చెరువులో పడిపోయింది పావురాలు ఒక ఆకును తుంచి నీటిలో వేసింది.చీమ ఆకుపైకి ఎక్కింది ,బాతు దానిని ఒడ్డుకు చేర్చింది.ఇలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవనం సాగించాయి.  మన చుట్టు పక్కల వారితో ఎల్లవేళలా స్నేహంతో ఉండాలి ఒకరికి మంచి చేస్తే మళ్ళీ అదే తిరిగి వస్తుంది.

చిన్న చేప కథ

Image
అనగనగా కథలు చాలా విచిత్రంగా ఉంటాయి, ఇది ఒక చేప పిల్ల కథ. ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది,అందులో ఒక చేపల కుటుంబం నివసిస్తూ ఉండేది.అందులో అందరికన్నా చిన్నది అయిన చేప ఒకరోజు బయటకు వచ్చి ఈదడం నేర్చుకుంటుంది.అక్కడే ఒక  కోమ్మ పైన ఉన్న పక్షిని చూసి అది అంతలా ఎలా ఎగురుతుంది అని ఆలోచించింది దానితో   దగ్గరగా వెళ్లి నేను ఈదుతున్న మొత్తం నీటిలోనే ఉంటాను కానీ నువ్వు మాత్రం రెక్కలతొ ఎంత దూరం అయిన ప్రయాణం చేయగలవు అని బాధ  పడుతుంది .ఆ పక్షి అలా కాదు అమ్మ నువ్వు జల జీవివి నీకు రెక్కలు ఉండవు .నువ్వు ఈదుతున్నావు నేను ఈదలేను అని బాధ పడుతున్నాన అని అంటుంది . ఆ చిన్న చేప తన తల్లి దగ్గరకు వెళ్లి అమ్మా మనకు రెక్కలు ఎందుకు లేవు అని ప్రశ్నిస్తుంది, అప్పుడు ఆ తల్లి చేప భగవంతుడు ఒక్కో ప్రాణిని ఒక్కో లాగా సృష్టించాడు అని చెపుతుంది అయిన వినకుండా మారం చేస్తుంది. తెల్లవారుజామున ఆ తల్లి చేప  అడవిలో ఉన్న జంతువులు అన్నింటినీ సమావేశం కావాలిసిందిగా కోరింది, కోరిన విధంగా అన్ని జంతువులు చెరువు చుట్టూ మూగారు .తల్లి చేప పిల్ల చేపను తీసుకొని వచ్చి చూడు ఇవన్ని అడవిలోని రకరకాల జంతువులు కోతి ,నక్...

ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు...

సెప్టెంబర్ 5 న భారతదేశం అంతటా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు ,ఏ రోజు ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి కనుక. గురువు అంటే అజ్ఞానం తొలగించి జ్ఞానం అనే వెలుగులోకి నడిపే మార్గాన్ని చూపే వ్యక్తి. అది ఎవరైనా కావచ్చు మనను మంచి వైపు నడిపించేవాడు ఎల్లప్పుడూ గురువే అయి ఉంటాడు. సూర్యుడు లేకుండా వెలుగు లేదు, ఔషదం సేవించకుండా రోగం నశించదు అలాగే గురువు లేకుండా  జ్ఞానం లభించదు అని పెద్దల మాట. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు కు అత్యంత విలువైన ప్రాముఖ్యత వుంటుది.మన తల్లిదండ్రులు మనకు జన్మ ఇస్తే గురువు పునర్జన్మ ఇస్తాడు. ఈ సందర్భంగా ఒకచిన్న కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో స్వేచ్ఛ అని ఒక అల్లరి పిల్ల ఉండేది తన తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు అవడం వల్ల అల్లారు ముద్దుగా పెంచారు .ఆమెను పాఠశాలలో చేరిస్తే అల్లరి తగ్గుతుంది అని భావించి తల్లిదండ్రులు పాఠశాలకు పంపించారు, కానీ తీరు మారలేదు,ఆమె ఒకరోజు అటుగా వెళుతున్న గురువు పంచె ను లాగింది దాని వల్ల అతడు కింద పడిపోయారు  తలకు గాయం అయింది అది చూసి పరుగెత్తింది స్వేచ్ఛ, భయంతో వణికిపోతోంది ఆమెను చూసి గురువు చూసావా నువు చేసిన అల్లరి పని వల్ల నాకు రక్తం వస్తుంది ...