valentine's day❤️❤️❤️
Valentine's day అనగానే ముందు మనకు గుర్తుకు వచ్చే విషయం ఏంటి. ? అదే ఏంటి అని ఆలోచిస్తున్నారా! చెప్తా ఉండండి అసలు విషయం భజరంగ్ దళ వాళ్ళు . అవును కొన్ని రోజుల క్రితం వరకు వాళ్ళు వాలెంటైన్ డే రోజు రోడ్డు మీద ఎవరైనా ప్రేమికులు లేదా జంటగా కనబడినా కూడా వాళ్ళ చేతికి బలవంతంగా తాళి ఇచ్చి కట్టమనేవారు .అందులో కొందరు ఇష్టం ఉండి ,ఇష్టం లేక ,కొందరైతే స్నేహితులుగా ఉండేవాళ్ళు కూడా ఉండేది .కానీ ఇప్పుడు పరిస్థితి మారింది లెండి.ఇది మాకు ఎందుకు అనుకోకండి రీడర్స్ valentine's day special blog. Valentine's day ఎలా మొదలైంది అంటే , మూడవ శతాబ్దంలో రోమ్ ను పరిపాలిస్తున్న చక్రవర్తి క్లాడియాస్ 2 తన నగరంలో ప్రేమ వివాహాలను నిషేధించాడు ,పెద్దల మాట వినకుండా చేసుకున్న పెళ్ళిళ్ళ వల్ల వారు జీవితంలో నష్ట పోతారు అని భావించి అతను అలా చేశాడు.కానీ తాడిని తన్నేవాడు ఒకడైతే వాడి తల తన్నేవాడు ఇంకొకడు వుంటారు అని అంటారు కదా! అలా ఈయన నిషేధిస్తే మనం ఎందుకు పాటించాలి అనుకున్న సెయింట్ వాలెంటైన్ అనే వ్యక్తి అదే ప్రేమ వివాహాలకు మద్దతు తెలిపాడు .అతన్ని చక్రవర్తి ఎన్నో సార్ల...