Posts

Showing posts from April, 2026

తండ్రి కొడుకు గాడిద కథ(telugu moral story)

Image
అనగనగా ఒక ఊరిలో  చంద్రయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు .అతనికి రుద్ర అనే కొడుకు ఉండేవాడు  . వాళ్ళు  ఒకరోజు బజారుకు వెళ్ళి ఒక గాడిదను కొన్నారు దానిని తీసుకొని నడుచుకుంటూ వెళుతున్నారు . అలా వెళ్తుండగా అతనికి తెలిసినవాళ్ళు వచ్చి చిన్న పిల్లాడిని ఎందుకు  నడిపిస్తున్నావు , గాడిద మీద ఎక్కించి తీసుకెళ్ళవచ్చు కదా ! అని అన్నారు . ఆ మాటలు విన్న చంద్రయ్య రుద్రను ఎక్కించి నడుచుకుంటూ వెళుతున్నారు. అలా కొంత సేపటికి మరల ఒక వ్యక్తి కనిపించి అరేయ్ రుద్రా నువ్వు దిగు  మీ నాన్నకు కాళ్ళు నొప్పులు వస్తాయి , నువ్వు చిన్న పిల్లాడివి  నీకు ఏం కాదు అన్నాడు. అప్పుడు రుద్ర దిగి తండ్రి చంద్రయ్య ను ఎక్కించాడు. కొంత దూరం వెళ్ళాక   రమణయ్య అనే పాత స్నేహితుడు కలిసి పిల్లాడిని నడిపించి నువ్వు హాయిగా కూర్చున్నావు అని అన్నాడు  చంద్రయ్య ఆలోచించి రుద్రను కూడా పైకి ఎక్కించాడు . కొద్దిసేపటికి బ్రాహ్మణుల గుంపు ఎదురయింది వారు ,గాడిదపైన ఇద్దరు కూర్చున్నారు ఎలా వెళ్తదీ అది  మీరు జీవహింస చేస్తున్నారు అని అన్నారు.అప్పుడు బ్రాహ్మణుల మాటలు విన్న చంద్రయ్య,...

nala damayanthi story in telugu(Mahabharatham stories)

Image
మీకు ముందే చెప్పాను కదా , మహాభారతంలో కథలు చాలా బాగుంటాయి అవి మన నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి .ఇది ఒక  అందమైన ప్రేమకథ .చాలా ప్రేమకథలు తెలుసు కానీ ఎన్నో ట్విస్టులు వున్న కథ ఇది. అయిపోయింది అనుకున్నప్పుడే మళ్ళీ మలుపు వుంటుంది అందుకే ఈ కథ ప్రేక్షకులు చదువుతున్నంత సేపు ఏం జరుగుతుందో అన్న ఆసక్తి  కలుగుతుంది.జీవితంలో ఎన్నో కష్టాలను ఓర్చుకొని  ప్రేమను గెలిపించుకున్న  నల దమయంతుల ప్రేమకథ. అనగనగా నిషధ దేశాన్ని వీరసేనుడు   అనే రాజు   పాలిస్తుండేవాడు అతనికి నలుడు  , పుష్కరుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. నలుడు  ధర్మపరుడు , సత్యవంతుడు, ప్రజలకు ఎంతో ఇష్టమైనవాడు .  తండ్రి  వీరసేనుడుకు కూడా నలుడు అంటే ఇష్టం వల్ల అతన్ని రాజుగా ప్రకటించాడు నలుడు రాజు అవ్వడం పుష్కరుడికి ఇష్టం లేదు. ఇదిలా ఉండగా విదర్భ దేశాన్ని భీముడు అనే రాజు పాలిస్తున్నాడు. అతనికి సంతానం లేదు,అతనికి ధమనుడు అనే ముని ఇచ్చిన వరం వలన దమయంతి అనే కూతురు దముడు ,ధమనుడు,దంతుడు అనే కుమారులు కలిగారు.    దమయంతి అపూర్వ సౌందర్యం, వినయం కలిగినది . ఈ విషయం నలుడు  ...

హోలీ ఎందుకు జరుపుకుంటారు? - రంగుల పండుగ ప్రాముఖ్యత

Image
హోళీ పండుగ శుభాకాంక్షలు మై డియర్ బ్లాగు రీడర్స్ .  భారతదేశంలో జరిగే ప్రతి పండగకు ఒక ప్రాధాన్యత ఉంటుంది .హోళీ రంగుల పండగ చిన్న పెద్ద తేడా  లేకుండా  అందరు ఈ పండగను రంగులు చల్లుకుంటూ , మిఠాయిలు తినిపించుకుంటూ చాలా సంబరాలు చేసుకుంటారు.  హోళీ పండగ జరుపుకోవడానికి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రతి పండగలో అంతరార్థం చెడుపై మంచి సాధించిన విజయం లేక ఆధ్యాత్మికత ఇమిడి ఉంటాయి. విష్ణుపురాణం ప్రకారం హిరణ్యకశిపుడు చాలా కాలం తపస్సు చేసి బ్రహ్మ దగ్గర ఒక వరం పొందాడు.అతను ఎలాగైనా చావకుండా ఉండాలని దేవతలతో గానీ,రాక్షసులతో గాని,అస్త్రము,శస్త్రము లతో గానీ ,పగలు కానీ , రాత్రి కానీ, నేలమీద కానీ ఆకాశం మీద కానీ ,ఇంటిలోపల ,బయట కానీ జంతువులతో కానీ ,మనుషులతో కానీ ఇలా ఎవరి వల్ల చావులేకుండా వరాన్ని పొందాడు.ఈ వర గర్వంతో హిరణ్యకశిపుడు లోకాలను బాధపెట్ట సాగాడు. అతనికి ఒక కొడుకు పుట్టాడు ఆ బాలుడికి ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు.అతను గురుకులంలో చదువుకుంటున్నప్పుడు విష్ణువు మీద భక్తి కలిగింది శ్రీ మహావిష్ణువు లీలలు తెలుసుకున్న ప్రహ్లాదుడు విష్ణువు తప్ప ఎవరు గొప్ప కాదు అని అంటుండేవ...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

Image
అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

శని - శివ - హనుమంతుడు కథ

Image
ఒకరోజు పరమశివుడికి ఉదయాన్నే ఒక కల వచ్చింది. ఆ కలలో శని భగవానుడు నేను నిన్ను ముప్ప తిప్పలు పెడతా   ఈ  రోజు సాయంత్రం వరకు కనీసం 4 నుండి 5 గంటలు అని చెప్పాడు . శని భగవానుడు ఎంతటి వారినైనా ముప్ప తిప్పలు పెడతారు అని తెలిసిన మహా శివుడు ఎలాగైనా తప్పించుకోవాలని అనుకున్నాడు . ఆ రోజు తొందరగా స్నానం చేసి కూర్చొని ఆలోచించసాగాడు ఎలాగైనా శని నుండి  తప్పించుకోవాలి అని , సమయం గడుస్తుంది . వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది , శివుడు పార్వతిని వాళ్ళ బంధువుల ఇంటికి , పిల్లలను స్నేహితులతో ఆడుకోవడానికి పంపించి వేశాడు. ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు అతను కూడా అలా కూర్చోకుండా ఒక గుంత తీసి దానిలో కూర్చుని మూత పెట్టుకున్నాడు.ఆ గుంతలో మొత్తం తడిగా ఉండి  ఒకటే వాసన  అయినా కూడా  ఆ గుంతలోనే సాయంత్రం వరకు కూర్చున్నాడు . సాయంత్రం 6 దాటింది అని నిర్ధారించుకున్న తర్వాత బయటికి  వచ్చాడు .బయటకు వచ్చి హమ్మయ్య శనికి నేను దొరకలేదు అతడు నన్ను పట్టుకోలేదు అని తనకు తానే గర్వంగా కూర్చున్నాడు.అతనికి ఎదురుగా శని దేవుడు కూర్చొని ఉండడం చూసి , మహాశివుడు గట్టిగా నవ్వాడు ఏమయ్యా  శని నన్ను పట...

శ్రవణకుమారుడి కథ..

Image
 ఈ కథ అందరికీ తెలుసు కానీ  ఇంకా తెలియని వాళ్ళ కోసం మాత్రమే. గాంధీజీ తన ఆశ్రమంలో జనులందరితో ముచ్చటిస్తూ వున్నారు.అక్కడ ఉన్నవారు తల్లిదండ్రుల సేవ ఎలా చేయాలి అని అడిగారు దానికి గాంధీజీ ఒక కథ చెప్తాను అన్నాడు ఎందుకంటే ఆ కథ అంటే గాంధీజీకి చాలా ఇష్టం.అది తల్లిదండ్రులను గౌరవించే శ్రవణకుమారుడి కథ.శ్రవనకుమారుడి తల్లిదండ్రులకు కళ్ళు లేవు ఐతే వారి బాగోగులు మొత్తం ఆయనే చూస్తూ ఉండేవాడు .వారు వయసు మీరడంతో మాకు తీర్థయాత్రలు చేయలని ఉంది అని అన్నారు దానికి శ్రవనకుమారుడు సరే అన్నాడు.వారిద్దరిని ఒక కావడి తయారు చేసి దానిలో కూర్చో బెట్టాడు.వారిని అలా తీసుకొని వెళుతుండగా దారిలో వారికి దాహం వేసింది ,నీళ్ల కోసం వారిని అక్కడే ఉంచి వెళ్ళాడు.ఇంతలో వేటకు వచ్చిన దశరథ మహారాజు జింక అనుకోని బాణం వేసాడు అది శ్రవనకుమారుడికి గుచ్చుకుంది .దశరథుడు వచ్చి చూసి అయ్యె?నేను ఎంత పాపం చేసాను అని బాణం తీయడానికి ప్రయత్నించాడు,శ్రవనకుమారుడు వద్దు మహారాజ న తల్లిదండ్రులకు దాహం తీర్చి ఈ విషయాన్ని చెప్పండి అని కన్ను ముసాడు.దశరథుడు తీవ్రమైన దుఃఖంతో వచ్చి వారి దాహం తీర్చి నా  వల్ల మీ కుమారుడు మరణించాడు అని చెప్...

శ్రీనివాస కళ్యాణం

Image
కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర  స్వామిని దర్శించడానికి భక్తులు దూర ప్రాంతాలనుండి ఎన్నో వ్యయ ప్రయాసలను ఓర్చుకొని వస్తారు. ఆనందనిలయంలో ఉన్న ఆ శ్రీనివాసుడి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించినంతనే ఎంతో ఆనందం కలుగుతుందని  అంటారు.ఇది నిజంగా  అనుభూతి చెందిన వారికే అనిపిస్తుంది. ఈ రోజు మన కథ శ్రీ వెంకటేశ్వర స్వామి కథ ,ఎన్నో కథలు గాథలు ఉన్నాయి కానీ అందులో ఒకటి మీకోసం . ఒకనాడు మహర్షులు అందరూ కలసి లోకకళ్యాణం కొరకు యజ్ఞం చేయాలని భావించారు ఆ యజ్ఞానికి ముఖ్య అతిథిగా త్రిమూర్తులలో ఒకరిని పిలవాలని అనుకున్నారు . ఎవరు గొప్ప అయితే వారిని పిలవాలని అనుకున్నారు.ఈ ఎవరు గొప్ప అని నిర్ణయం చేయవలసిందిగా బృగు మహర్షిని పంపారు.మొదట బృగు మహర్షి సత్య లోకానికి వెళ్ళారు అక్కడ బ్రహ్మ దేవుడు సరస్వతి మాత వీణ వాయిస్తుండగా అతను లీనమై పోయాడు. ఆశ్చర్యం అసలు బ్రహ్మ బృగు మహర్షి రాకను గమనించలేదు దానికి ఆ మహర్షి కోపంతో నీకు భూలోకంలో ఆలయాలు ఉండవని శపించాడు. బ్రహ్మ దేవుడు బాధ పడ్డాడు అందుకే బ్రహ్మ దేవుడికి గుడులు చాలా తక్కువ ఉంటాయి.   కైలాసానికి బయలుదేరాడు ఈ సారి ఏం జరుగుతుందో చూద్దాం .కైలాసంలో శివపార్వతులు ఇద్దరూ నాట...