పీత-కొంగ కథ .🦀🦢.
ఈ రోజు పంచతంత్రం కథలలో పీత-కొంగ కథ తెలుసుకుందాం. అనగనగా ఒక కొలను ఆ కొలనులో ఒక పీత నివాసం ఉంటుంది. ఒకసారి ఆ కొలను దగ్గరకు ఒక కొంగ వచ్చింది.అది ఆ కొలనులో దిగి ఒంటి కాలు మీద తపస్సు చేస్తున్నట్టు నటించుతుంది రోజు ! అది రోజూ పీత, కొలనులో చేపలు చూస్తున్నాయి.అయితే ఆ చేపలు కానీ పీత కానీ కొంగది దొంగ జపం అని గుర్తించ లేకపోయినాయి.ఒకరోజు పీత కొంగ దగ్గరకు వచ్చి మహాత్మా! ఇక్కడ ఇన్ని చేపలు మీ కళ్ళ ముందు తిరుగుతున్న కూడా మీరు వాటిని పట్టి తినకుండా ఇలా జపం చేసుకుంటున్నారు దీనికి కారణం ఏమిటి అన్నది. అప్పుడు ఆ కొంగ మరింత ధ్యానంలో ఉన్నట్టు నటించింది.కొంగగారు మిమ్మల్ని నేను అడుగుతున్న అయిన సమాధానం చెప్పడం లేదు కారణం ఏమైనా ఉందా అని అడిగింది మళ్లి పీత. కొంగ మెల్లిగా కళ్ళు తెరిచి మీరు భక్తి శ్రద్ధలతో అడిగారు కాబట్టి చెబుతున్న విను,నువ్వు చెప్పినట్టు ఆ మధ్యదాక నేను కూడా చేపలనే కాదు భగవంతుడు మాకు ఇచ్చిన నేను తినదగిన అన్ని జంతువులను తినేవాడిని.ఆ మధ్య కాలంలో నేను నివసించే చెట్టు కిందకు ఒక యోగి వచ్చాడు.ఆయనతో చాలా మంది శిష్యులు కూడా ఉన్నారు.ఆ శిష్యులకు ఉపదేశం చేసేటపుడు నేను ఆ చెట్టు పైన...