కచుడు -దేవయాని కథ..
మా కళాశాలలో తెలుగు ఉపాధ్యాయుడు పాఠం చెప్తూ మహాభారతంలో లేనిది లోకం లో లేదు లోకంలో ఉన్నది అంత మహాభారతంలో ఉంటుంది అన్నారు కానీ నాకు అర్థం కాలేదు .కానీ నిజంగా ఒక్కొక్క కథ చదువుతుంటే అప్పుడప్పుడు నిజమే అనిపిస్తుంది. ఈ కథ మహాభారతంలో ఒక ప్రేమకథ, కానీ ఇద్దరు ప్రేమించుకోలేదు ఒక్కరు మాత్రమే ప్రేమించారు ,అసలు ఏంటో ఈ కథ తెలుసుకుందాం.
హిందూ పురాణాల ప్రకారం దేవతలకు,రాక్షసులకు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో దేవతలు రాక్షసులని ఎంతమందిని చంపినా రాక్షసులు చనిపోకుండా మళ్ళీ మృత సంజీవని విద్య ద్వారా బ్రతుకుతున్నారు.ఈ విద్య కేవలం రాక్షసుల గురువైన శుక్రాచార్యుడుకి మాత్రమే తెలుసు.
దేవతలు అంతా కూర్చొని ఆలోచించసాగారు.
దేవతల గురువు బృహస్పతి అతని కుమారుడు కచుడు, దేవతలు అందరూ కచుడిని శుక్రాచార్యుడి దగ్గరకు శిష్యరికానికి పంపించారు. కచుడు శుక్రాచార్యుడికి జరిగిన విషయం చెప్పి అతని దగ్గర శిష్యుడిగా చేరాడు .కచుడు మంచి ప్రవర్తనతో అతని మనసు గెలుచుకున్నాడు, శిష్యులందరిలో ఉత్తముడిగా పేరు సంపాదించాడు.
శుక్రాచార్యుడుకి దేవయాని అనే కూతురు ఉంది ఆమె కచుడి అందానికి మోహితురాలు అయింది ,అతని ప్రవర్తన కూడా ఆమెకు చాలా నచ్చింది దాంతో ఆమె కచుడిని ప్రేమించడం మొదలు పెట్టింది.
కచుడు మాత్రం గురువు గారి పుత్రిక అయినందున తనను సోదరి సమానురాలిగా భావించాడు.ఇలా అయిదు సంవత్సరాల కాలం గడిచిపోయింది.
కచుడు శుక్రాచార్యుడుకి,దేవయానికి దగ్గరగా ఉండడం తన తోటి సహచరులకు నచ్చలేదు.అందువల్ల కచుడు ఒక్కడే ఆవులను తొలుకొని వెళ్లిన సమయంలో అతన్ని వెంబడించి చంపి ముక్కలుగా చేసి తోడేళ్లకు ఆహారంగా వేశారు.చీకటి పడుతున్న కచుడు ఇంకా ఆశ్రమానికి తిరిగి రాలేదని కంగారు పడి తండ్రిని ప్రాధేయపడింది.శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని మృత సంజీవని విద్య ద్వారా అతనిని బ్రతికించాడు.
మరల కొన్ని రోజులకు కచుడు ఒంటరిగా ఉన్న సమయం చూసి అతనిని హత్య చేసి ఈ సారి బూడిద చేశారు .ఆ బూడిదను ఏమి చేసినా మళ్ళీ గురువు గారు బ్రతికిస్తారు అని అనుకోని ఆ రాక్షసులు శుక్రాచార్యుడి సురా పానంలో కలిపారు.ఆ విషయం తెలియక శుక్రాచార్యుడు ఆ సురను తాగేసాడు.
మద్యం మత్తులో అతను దేవయాని ఏడుస్తున్న కూడా పట్టించుకోలేదు, తెల్లవారిన తర్వాత జరిగిన విషయం తెలుసుకొని చాలా బాధ పడ్డాడు.దేవయాని ఎలాగైనా కచుడిని బ్రతికించమని బ్రతిమలాడింది , నేను అతనిని బ్రతికిస్తే నా ప్రాణాలు ప్రమాదంలో పడతాయి అని ఆలోచించాడు.
అందరూ గురువు గారు ఎం చేస్తారు అని ఆలోచించసాగారు.దేవయాని నువ్వు నీ కడుపులో ఉన్న కచుడికి మృతసంజీవని విద్య నేర్పించు దాని వల్ల అతను నువ్వు చనిపోయినా నిన్ను అతను బ్రతికిస్తాడు అన్నది.
ఇక తప్పదు అనుకోని శుక్రాచార్యుడు తన కడుపులో ఉన్న కచుడికి మృతసంజీవని విద్య నేర్పించి అతనిని బయటకు తీసి మరణించాడు.కచుడు శుక్రాచార్యుడిని బ్రతికించాడు. ఆ తర్వాత తను వచ్చిన పని అయిపోయింది అని అందరి దగ్గర సెలవు తీసుకున్నాడు.
గురుపుత్రిక దేవయాని కచుడిని నువ్వు నన్ను పెళ్లి చేసుకో , అన్నది కచుడు నేను ఎప్పుడూ నిన్ను అలాంటి ఉద్దేశ్యంతో చూడలేదు నువ్వు నన్ను వదిలేయ్ అన్నాడు.దేవయానికి కోపం వచ్చింది తను విచక్షణ కోల్పోయి నువ్వు నేర్చుకున్న విద్య నీకు పనికి రాకుండా పోతుంది అని శపిస్తుంది.కచుడు మాత్రం పోనీ లే నాకు కాకుండా ఎవరికైనా పనికి వస్తుందిలే అని ఆనందపడ్డాడు.
ఈ కథలో నీతి ఎల్లవేళలా నిజం చెప్పాలి కచుడు నిజాయితీగా తన గురుంచి ,తను వచ్చిన పని గురుంచి చెప్పాడు.
మద్యం తాగవద్దు,దాని వల్ల అనర్థాలు వస్తాయి అని తెలుసుకోవాలి .
దేవయాని శాపం పెట్టినా కూడా నా విద్య నాకు పనికి రాకున్నా సరే వేరే వాళ్లకు పనికివస్తుంది అన్న ఉద్దేశ్యం సరైనది.
Comments
Post a Comment