చెడపకురా చెడేవు.....

రామకృష్ణాపురంలో సాంబయ్య అనే రైతు ఉండేవాడు అతను చాలా కష్టపడి పని చేసేవాడు .అతనికి  నలుగురు కొడుకులు రంగయ్య,రాజయ్య,రుద్రయ్య మరియు రాఘవయ్య.రాజయ్య, రంగయ్య, రుద్రయ్య బాగా తెలివినవాళ్ళు,రాఘవయ్య పాపం వట్టి అమాయకుడు.ఎవరు ఏమి చెప్పిన నమ్ముతాడు.రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలకు పెళ్లిళ్లు చేసాడు సాంబయ్య. అతని దిగులు అంత చిన్న కొడుకు గురించే, అతని అమాయకత్వానికి ఎవరూ పిల్లను ఎవరు ఇవ్వలేదు.అలాగే ఉండిపోయాడు.కొన్ని రోజులకు సాంబయ్యకు జబ్బు చేసింది రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలు వారి పిల్లలను భార్యలను చూసుకుంటూ సాంబయ్యను పట్టించుకునేవారు కాదు.రాఘవయ్య తండ్రిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు .పూర్తిగా అతని ఆరోగ్యం క్షీణించి అతను చనిపోయాడు.అతను చనిపోయాక అన్ని కార్యక్రమాలు ముగిసిన తరువాత లాయరు వీలునామా తెచ్చి ఇచ్చాడు ఆస్థులన్ని సమంగా పంచుకోవడానికి.సాంబయ్య వీలునామాలో రాఘవయ్యకు కొంచెం ఎక్కువగా ఆస్తి రాసాడు అది చూసి మిగిలిన అన్నలు ఓర్వలేక ఇది మేము చూసుకుంటాం అని లాయరును పంపించి వేశారు.
రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలు మంచి తరి పొలాన్ని తీసుకొని ఊరు అవతల పనికిరాని మెట్టభూమి ఇచ్చారు.ఇంకా అతని దగ్గర ఒక కుంటి పిల్లి ఉండేది అది అదృష్టదేవత అని సాంబయ్య ఎప్పుడూ అంటుండేవాడు .ఆ పిల్లి నాకు కావాలి నాకు కావాలి అని అందరూ కొట్టుకున్నారు తర్వాత ఆలోచించి ఒక్కొక్కరు ఒక్కొక్క కాలు చొప్పున నాలుగు కాళ్ళు పంచుకున్నారు.కుంటికాలు రాఘవయ్యకు ఇచ్చారు .అన్నలు ముగ్గురూ వాళ్ళ వాళ్ళ  పిల్లి కాళ్లకు బంగారు ,వెండి పట్టీలువేశారు రాఘవయ్య మాత్రం కుంటి కాలును బాగు చేయడానికి పట్టి కట్టాడు దానిని బాగా చూసుకునేవాడు. రాఘవయ్య మెట్టభూమిని తరిభూమి చేసాడు ఆ పొలంలో వరి పంట వేశాడు.రాజయ్య,రంగయ్య,రుద్రయ్యలు పొలంలో పత్తి పంట వేశారు.వీళ్లు తమ్ముడిని చూసి ఓర్వలేకపోయారు ఎదో ఒక ఆటంకాలు కలిగించేవారు అయిన ఇబ్బందులు దాటి పంట చేతికి వచ్చింది. ఆ ధాన్యాన్ని ఇంట్లో నిల్వ చేసి పిల్లికి చెప్పి కాపలా ఉంచి బయటకు వెళ్ళాడు రాఘవయ్య. మెల్లిగా వచ్చి అన్నలు ముగ్గురు ఆ ధాన్యాన్ని తగులపెట్టారు అందులో ఉన్న పిల్లికి మంట అంటుకుంది అది పారిపోతూ పత్తిని నిలువ చేసిన రూములోకి వెళ్ళింది నిప్పురవ్వలు పడి పత్తి అంటుకుంది మంటలు వ్యాపించాయి.ధాన్యం తగులబడడం చూసిన రాఘవయ్య మంటలు ఆర్పి నష్టాన్ని నివారించాడు, పత్తి మాత్రం ఏమి మిగలకుండా కాలిపోయింది రాఘవయ్య ను దెబ్బతీయలని చూసి రంగయ్య, రాజయ్య,రుద్రయ్యలు గోతిలో పడ్డారు.అందుకే పెద్దలు అంటారు"చెడపకురా చెడేవు "అని ఎవరినైనా చెడగొట్టాలని చూస్తే వాళ్ళే చెడిపోతారు.మంచి వాళ్లకు ఏమి కాదు.అన్నదమ్ములు ఎప్పుడూ కలిసి మెలిసి ఉండాలి ఈర్ష్య అసూయ ఉండకూడదు.







Comments

Popular posts from this blog

రామచిలుక కథ

చిన్న చేప కథ

అంతా మన మంచికే...