Posts

Showing posts with the label lord shiva stories

చిరు తొండనంబి కథ.

Image
పరమ శివుని భక్తులు చాలా మంది ఉన్నారు అందులో అరవై మూడు మంది మహాభక్త మహాశయులచరిత్ర పెరియ పురాణము .ఈ కథ నేను చదివిన పెరియ పురాణం లోనిది చిరు తొండనంబి కథ. కావేరినది ప్రవాహం ఒడ్డున తిరుచెంగట్టంగుడి అనే ఒక గ్రామం కలదు.ఆ గ్రామంలో మహామట్టిరార్ అను బ్రాహ్మణ వంశంలో పరంజ్యోతి (ఇతనికి చిరుతోండని పేరు) అను వాడుండెను.అతను ఆయుర్వేదం,సంస్కృతము,యుద్ధ విద్య ,అశ్వ,గజ శిక్షణలలో నిపుణుడు ఆయినప్పటికి సకల శాస్త్ర పరమార్థము శివుడే అని  అనుకోని శివుని పాద సేవకంటే ఏదీ ఎక్కువ కాదని  శివసేవకే అంకితమయ్యాడు.   పరంజ్యోతి పల్లవ రాజు సేనాధిపతి,అతను చాలా సార్లు అనేక నగరాలపై దండయాత్ర చేసి , వాటిని నేల మట్టం చేసి అక్కడ కొల్ల గొట్టిన ధనాన్ని తెచ్చి రాజుకు ఇచ్చేవాడు. అతని బల పరాక్రమం చూసి మంత్రులు తలమీద చంద్రవంక పెట్టుకున్న శివుడిని పూజ చేయడం ద్వారా ఇతనికి చాలా పరాక్రమం ఉంది ఈయనను ఎదురించువారు ఈ లోకములో లేరు అని అన్నారు.ఆ మాటలు విన్న రాజు నేను ఒక శివ భక్తుడిని నా సేవ కోసం ఉపయోగం చేసుకుంటున్నా నా ఎంత పాపం తగులుతుంది నాకు అనుకోని నన్ను క్షమించు అని పరంజ్యోతిని వేడుకున్నాడు. నువ్వు నీ సొంత గ్రామానికి...