అనగనగా ఒక ఊరిలో చంద్రయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు .అతనికి రుద్ర అనే కొడుకు ఉండేవాడు . వాళ్ళు ఒకరోజు బజారుకు వెళ్ళి ఒక గాడిదను కొన్నారు దానిని తీసుకొని నడుచుకుంటూ వెళుతున్నారు . అలా వెళ్తుండగా అతనికి తెలిసినవాళ్ళు వచ్చి చిన్న పిల్లాడిని ఎందుకు నడిపిస్తున్నావు , గాడిద మీద ఎక్కించి తీసుకెళ్ళవచ్చు కదా ! అని అన్నారు . ఆ మాటలు విన్న చంద్రయ్య రుద్రను ఎక్కించి నడుచుకుంటూ వెళుతున్నారు. అలా కొంత సేపటికి మరల ఒక వ్యక్తి కనిపించి అరేయ్ రుద్రా నువ్వు దిగు మీ నాన్నకు కాళ్ళు నొప్పులు వస్తాయి , నువ్వు చిన్న పిల్లాడివి నీకు ఏం కాదు అన్నాడు. అప్పుడు రుద్ర దిగి తండ్రి చంద్రయ్య ను ఎక్కించాడు. కొంత దూరం వెళ్ళాక రమణయ్య అనే పాత స్నేహితుడు కలిసి పిల్లాడిని నడిపించి నువ్వు హాయిగా కూర్చున్నావు అని అన్నాడు చంద్రయ్య ఆలోచించి రుద్రను కూడా పైకి ఎక్కించాడు . కొద్దిసేపటికి బ్రాహ్మణుల గుంపు ఎదురయింది వారు ,గాడిదపైన ఇద్దరు కూర్చున్నారు ఎలా వెళ్తదీ అది మీరు జీవహింస చేస్తున్నారు అని అన్నారు.అప్పుడు బ్రాహ్మణుల మాటలు విన్న చంద్రయ్య,...
“చిన్న నీతి కథలు” బ్లాగ్లో పిల్లల కోసం సరదాగా చదవడానికి తెలుగు నీతి కథలు, జంతువుల కథలు, స్నేహం కథలు మరియు ప్రేరణాత్మక కథలు అందుబాటులో ఉంటాయి. ప్రతి కథలో ఒక మంచి నీతి ఉంటుంది, ఇది పిల్లలకి మంచి అలవాట్లు నేర్పుతుంది. Discover the best Telugu moral stories, short stories for kids, and inspirational stories in Telugu.