Posts

Showing posts with the label education

చెడపకురా చెడేవు.....

Image
రామకృష్ణాపురంలో సాంబయ్య అనే రైతు ఉండేవాడు అతను చాలా కష్టపడి పని చేసేవాడు .అతనికి  నలుగురు కొడుకులు రంగయ్య,రాజయ్య,రుద్రయ్య మరియు రాఘవయ్య.రాజయ్య, రంగయ్య, రుద్రయ్య బాగా తెలివినవాళ్ళు,రాఘవయ్య పాపం వట్టి అమాయకుడు.ఎవరు ఏమి చెప్పిన నమ్ముతాడు.రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలకు పెళ్లిళ్లు చేసాడు సాంబయ్య. అతని దిగులు అంత చిన్న కొడుకు గురించే, అతని అమాయకత్వానికి ఎవరూ పిల్లను ఎవరు ఇవ్వలేదు.అలాగే ఉండిపోయాడు.కొన్ని రోజులకు సాంబయ్యకు జబ్బు చేసింది రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలు వారి పిల్లలను భార్యలను చూసుకుంటూ సాంబయ్యను పట్టించుకునేవారు కాదు.రాఘవయ్య తండ్రిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు .పూర్తిగా అతని ఆరోగ్యం క్షీణించి అతను చనిపోయాడు.అతను చనిపోయాక అన్ని కార్యక్రమాలు ముగిసిన తరువాత లాయరు వీలునామా తెచ్చి ఇచ్చాడు ఆస్థులన్ని సమంగా పంచుకోవడానికి.సాంబయ్య వీలునామాలో రాఘవయ్యకు కొంచెం ఎక్కువగా ఆస్తి రాసాడు అది చూసి మిగిలిన అన్నలు ఓర్వలేక ఇది మేము చూసుకుంటాం అని లాయరును పంపించి వేశారు. రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలు మంచి తరి పొలాన్ని తీసుకొని ఊరు అవతల పనికిరాని మెట్టభూమి ఇచ్చారు.ఇంకా అతని దగ్గర ఒక కుంటి పిల్ల...

సోమరి కొడుకు కథ

Image
అనగనగా ఒక ఊరిలో చెంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు , అతనికి రాజు అనే కొడుకు ఉండేవాడు.అతను చాలా సోమరిపోతు ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు.రాజుని తండ్రి ఎప్పుడు మందలించే వాడు.అయిన వాడు మాత్రం ఏమి చేయకుండా  అలాగే తిరిగేవాడు. ఒకరోజు ఎంత చెప్పినా వినడం లేదు అని ఇంటి నుండి బయటకు పంపించేశారు.ఏదయినా పని చేసి డబ్బులు తీసుకొని ఇంటికి వస్తేనే నీకు భోజనం లభిస్తుంది అన్నాడు చెంగయ్య.రాజు పని కోసం వెళ్లాడు కానీ పని దొరకలేదు.అయితే అతను తనకు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు దానిని తెచ్చి తండ్రికి ఇచ్చాడు.దానికి తండ్రి సంతోషించి తీసుకొని భోజనం పెట్టాడు ఆ డబ్బును ఇంట్లొ ఉన్న బావిలో వేసాడు చెంగయ్య. రాజు చూసుకుంటూ వెళ్ళాడు తప్ప ఏమీ అనలేదు.అలా వెళ్లి భోజనం తిని పడుకున్నాడు. తెల్లారి కూడా అలాగే బయటకు వెళ్లి డబ్బులు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చాడు.అలా మూడు నెలలు గడిచిపోయాయి.ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది.కొంతకాలానికి ఒకరోజు ఎంత వెతికినా ఎవరు దొరకలేదు ఖాళీగా ఇంటికి వచ్చాడు,ఇంట్లో భోజనం పెట్టలేదు.అలాగే  పడుకున్నాడు.మళ్ళీ వెళ్ళాడు సగం రోజు వరకు ఎవరూ దొరకలేదు.రిక్షా తొక్కే వ్యక్తి...

కలసి ఉంటే కలదు సుఖం

Image
అనగనగా ఒక ఊరిలో రామయ్య, సీతమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి నలుగురు సంతానం.నలుగురు కొడుకులు,కొడళ్లతో ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది.ఆ ఊరిలో అందరూ మీరు ఎప్పుడు ఇలా ఎలా కలిసి వుంటారు అని అనుకుంటారు.ఒకరోజు వాళ్ల ఇంటికి ఒక అతిధి వచ్చాడు అతను వాళ్లలో వాళ్లకు ఎలాగైనా గొడవ పెట్టాలి అనుకుని వచ్చాడు.అత్త సీతమ్మ వంట పూర్తి చేసింది ,పెద్దకొడలికి ఆ కూర ఒక అయిదు నిముషాల తర్వాత కొంచెం ఉప్పు వేసి దించు అని చెప్పి ఆమె బయటకు వెళ్ళింది.పెద్దకొడలు సరే అన్నది ఇంతలో బట్టలు అరబెట్టేది వుందని రెండవ కోడలికి చెప్పి వెళ్ళింది,ఆమె కూడా సరే అన్నది అప్పుడే వాళ్ళ ఆయన పిలిచేసరికి వెళ్ళింది.మూడవ కోడలికి ఉప్పు వేసి దించమని చెప్పింది.ఆమెకు నీళ్లు పట్టేది ఉందని వెళ్తూ వెళ్తూ చిన్న కోడలికి చెప్పి వెళ్ళింది.చిన్న కోడలు సరే అని ఉప్పు వేసి దించింది.నీళ్లు పట్టి తిరిగి వచ్చిన మూడవ కోడలు ఉప్పు వేసి కలిపింది.భర్త దగ్గర నుండి వచ్చిన రెండవకోడలు చెల్లి ఉప్పు వేసిందో లేదో అని ఉప్పు వేసి కలిపింది.ఆ తర్వాత కొద్ది సేపటికి వచ్చిన పెద్ద కోడలు నా చెల్లి  ఉప్పు వేసిందో లేదో అని ఆమె కూడా ఉప్పు వేసింది.మధ్యాహ్నం భోజనానికి ...

ఐకమత్యమే మహాబలం.

Image
ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .

అంతా మన మంచికే...

Image
అనగనగా ఒక రాజ్యం ఉండేది, దానికి రాజు సులోచనడు.అంటే మంచి ఆలోచనలు కలిగినవాడు అని అర్థం .రాజు చాలా మంచివాడు కానీ ముక్కోపి వెంటనే కోపం వస్తుంది.ఆయనతో ఎవరు మాట్లాడిన చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడతారు. అతని దగ్గర రాజశేఖరుడు అనే మంత్రి ఉండేవాడు.అతను మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి.ఒకసారి రాజదర్బారులో పండితుల సేవ చేస్తుంటే పండ్లను కోసి ఇస్తుండగా వేలు తెగింది అక్కడ ఉన్నవారు అంత బాధపడ్డారు ఒక్క మంత్రి మాత్రం అంత మన మంచికే అన్నాడు.అసలే ముక్కోపి అయిన సులోచనడు ఎం ఆలోచించకుండా అతనిని బంధించాడు.ఒక వారం రోజుల తర్వాత వేటకు వెళ్ళాడు మంది మార్బలంతో చీకటి పడింది.తన వెంట వచ్చినవారు తప్పిపోయారు అలా వెళుతూ ఒక గూడెంకి చేరాడు.అక్కడ ఉన్నవాళ్లు ఇతనిని దొంగగా భావించి కట్టిపడేశారు.గూడెం పెద్ద వచ్చాడు అక్కడివారు అయ్యా ఇతను వేరే ప్రదేశం నుండి చొరబడ్డాడు అందుకే కట్టి పడేసాము అన్నారు.పెద్ద చూసి ఐతే ఇతనిని అమ్మవారికి బలి ఇవ్వండి  అన్నాడు.ఇంకొక తలారీ వచ్చి రాజు సులోచనుడిని కింద నుండి మీద వరకు తేరిపారా చూసాడు .అతని వేలు తెగి ఉంది,ఇతను బలి ఇవ్వడానికి సరిపోదు అన్నాడు.హమ్మయ్య ప్రాణాలు నిలబడ్డాయి అని సంతోషించి ...

బుద్ది బలం

Image
అనగనగా ఒక రాజ్యం .ఆ రాజ్యంలో శుభాసేనుడు అనే రాజు ఉండేవాడు .అతను చాలా మంచివాడు కవులు కళాకారులను ప్రోత్సహించేవాడు.ఒకరోజు రాజ్యంలో ఒక విచిత్రమైన చాటింపు వేయించాడు. రాజ్యంలో అందమైన చిత్రాన్నీ గియమని చెప్పాడు.  రాజ్యంలోని కళాకారులు అంతా ఆలోచనలో పడ్డారు.ఏ బొమ్మ గీస్తే రాజుగారి బహుమతి లభిస్తుందో అని నెల రోజుల గడువు ముగిసింది.ఆ రోజు అన్ని చిత్రపటాలు తీసుకొని వచ్చి ప్రదర్శించడం మొదలు పెట్టారు,సాయంకాలం అయింది కానీ రాజగారికి మాత్రం ఒక్క చిత్రపటం కూడా నచ్చడం లేదు ,రాజు సభ నుండి నిష్క్రమించాడు. మరల గడువు పొడిగించాడు రాజు.కళాకారులు అంతా తలలు పట్టుకున్నారు ఇంకా ఏమి గీయాలి అని మదన పడుతున్నారు.పక్క ఊరి నుండి సుభద్రుడు అనే వ్యక్తి వచ్చాడు,అతను శుభాసేనుడు దగ్గరకు వచ్చి రాజా ఏ రాజ్యంలో అందమైన చిత్రాన్ని గీసాను అన్నాడు ప్రజలు అంతా ఆశ్చర్యంతో చూసారు.సుభద్రుడు తాను తెచ్చిన పటం పైన నుండి తెర తీసాడు చూస్తే అక్కడ అద్దం ఉంది అందులో రాజుగారి ముఖం కనిపించింది.సుభద్రుడు మాట్లాడుతూ రాజా ఈ రాజ్యంలో అందమైన చిత్రం మీదే అన్నాడు,దానికి రాజు సంతోషించి బహుమతి ఇచ్చాడు. అన్ని సార్లు ప్రతిభ పనికిరాదు కొన్ని సా...

స్నేహమేరా జీవితం.

Image
అనగనగా ఒక ఊరిలో ఒక చెరువు ఉండేది,ఆ చెరువు పక్కన ఒక చెట్టు ఉండేది .ఆ చెట్టు మీద ఒక పావురాల గుంపు ,ఎలుక ,చీమలు ఉండేవి.చెరువులో ఒక బాతు ఉండేది .అవన్నీ మంచి స్నేహంతో కలిసి మెలిసి ఉండేవి. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక వేటగాడు వచ్చాడు.ఈ చెట్టు మీద ఎక్కువ పావురాలు ఉన్నాయని వల విసిరి పట్టుకున్నాడు.పావురాలు ఎడుస్తున్నాయి, ఐతే చీమ ,ఎలుక,బాతు అన్ని కలిసి ప్లాన్ చేసాయి ,ఆ పావురాలను ఎలా అయినా విడిపించాలని వెంటనే అమలు చేసాయి. బాతు అరవడం మొదలు పెట్టింది వేటగాడు ఈ శబ్దం ఏంటి అని అటు వెళ్ళాడు,వెంటనే చీమ అతనిని కుట్టింది.అమ్మా నొప్పి అని విలవిల్లాడడు. ఎలుక పరుగున వెళ్లి వలను కొరికింది,పావురాలు అన్ని పారిపోయాయి.వేటగాడు వెంటనే అరవడం మొదలుపెట్టాడు .అన్ని ఎక్కడివి అక్కడకు వెళ్లిపోయాయి ఇంతలో చీమ చెరువులో పడిపోయింది పావురాలు ఒక ఆకును తుంచి నీటిలో వేసింది.చీమ ఆకుపైకి ఎక్కింది ,బాతు దానిని ఒడ్డుకు చేర్చింది.ఇలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవనం సాగించాయి.  మన చుట్టు పక్కల వారితో ఎల్లవేళలా స్నేహంతో ఉండాలి ఒకరికి మంచి చేస్తే మళ్ళీ అదే తిరిగి వస్తుంది.

కష్టేఫలి

Image
  అనగనగా ఒక ఊరిలో ఒక కోడి,ఎలుక ,చిలుక, బాతులు స్నేహితులు .ఐతే ఎలుక ,చిలుక, బాతు ఏ పని చేయకుండా ఎప్పుడూ కోడి తోనే అన్ని పనులు చూపిస్తూ ఉండేవి.ఎలాగైనా వాటికి బుద్ది చెప్పాలి అని ఆ కోడి నిర్ణయించుకుంది. పొద్దున్న లేవగానే ఈ ఇల్లు ఎవరు ఉడుస్తారు? అని అన్నది.నేనుకాదు నేను కాదు అని చిలుక ,ఎలుక ,బాతు అన్నాయ్. సరే నేనె ఉడుస్తా అని ఉడిచింది.గిన్నెలు ఎవరు తోముతారు అని అడిగింది నేను తోమను నేను తోమను అని అన్ని పారిపోయారు.గిన్నెలు కడిగింది కోడి.ధాన్యం ఎవరు సేకరిస్తారు అని అంటే చిలుక, ఎలుక ,బాతు మా వల్ల కాదు అని వెళ్ళిపోయాయ్. కోడి పాపం బెంగగా వెళ్లి ధాన్యం సేకరించింది,వంట చేసింది.ఈ భోజనం ఎవరు చేస్తారు అని కోడి అడిగింది ,మేము తింటాం మేము తింటాం అని అన్ని ముందుకు వచ్చాయి. దానితో కోపం వచ్చిన కోడి నేను ఎవరికి పెట్టను అని అంటుంది.ఎందుకు అని అడుగుతాయి చిలుక,ఎలుక ,బాతు పొద్దున్నుంచి ఒక్కదాన్నే అన్ని చేస్తుంటే ఎవరు సహాయం చేయడానికి రాలేదు తినడానికి మాత్రం వచ్చారు. అందరూ కలిసి పని చేయాలి కలిసి తినాలి తప్ప ఒక్కరే చేయాలి నేను ఏమి చేయను అని ఉండకూడదు..కష్టపడితేనే ఫలితం వస్తుంది అని కోడి చెప్తుంది.

రామచిలుక కథ

Image
అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యంలో ఒక వేటగాడు వున్నాడు.అతను వేటకు వెళ్లి రెండు రామచిలుకలను పట్టి తెచ్చాడు.ఆ చిలుకలను రాజభవననికి తెచ్చి రాజుకు బహుకరించాడు. ఆ రాజు ఈ చిలుకలను మంత్రికి మరియు సేనాధిపతికి ఇచ్చాడు.మంత్రికి,సేనాధిపతికి ఒక్క నిముషం కూడా పడదు . రాజు  రామచిలుకకు ఎవరైతే మాటలు నేర్పిస్తారో వారికి బహుమతులు ఇస్తాను అని చెప్పాడు .మంత్రి ఇంటికి వెళ్లి భార్యతో దీనికి మాటలు నేర్పించు మనకు అన్ని బహుమతులు రావాలి అంటాడు అది విన్న మంత్రి భార్య ఎలా అండి అని అడిగింది. రాజు గారు దీనికి మాటలు నేర్పిస్తే బహుమతి ఇస్తా అన్నారు అంటాడు. మంత్రి గారి భార్య సరే అంటుంది. సేనాధిపతి కూడా భార్యకు విషయం చెప్పి చిలుకను ఇస్తాడు. మంత్రి భార్య ఒక సంగీతం నేర్పించే గురువు అవడడం చేత అది అన్ని పాటలు ,పద్యాలు మంచి మాటలు నేర్చుకుంది. సేనాధిపతి భార్య పదవి ఉందని అహంకారంతో ఏ పని చేయకుండా అందరితో గొడ్డు చాకిరి చేపిస్తూ అందరిని తిడుతూ ఉంటుంది అది విన్న చిలుక ఆ మాటలు తిట్లు నేర్చికుంది.మంత్రి ఎప్పుడు రాజు క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు కనుక చిలుక కూడా రాజు గారి మీద గౌరవం పెంచుకుంటుంది సేనాధిపతి రాజుకి వ్యతిరేకంగా ఇత...

మౌన వ్రతం

Image
రాఘవ పురం అనే గ్రామం ఉండేది.ఆ గ్రామంలో ప్రజలు అంతా సుఖ శాంతులతో జీవించసాగారు.అలాంటి గ్రామం లోకి ఒక వదరుబోతు వచ్చాడు అతను గ్రామంలోని ప్రజలు ఇంత సుఖంగా ఉండడం చూడలేక పోయాడు. అతను అక్కడి వారందరితో స్నేహం చేసాడు, అలా కొంత కాలం మంచిపేరు ,నమ్మకం సంపాదించాడు.  తర్వాత ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం మొదలు పెట్టాడు మొదట్లో ఎవరూ నమ్మకపోయేవారు తర్వాత తర్వాత నమ్మడం మొదలు పెట్టారు దీని వలన ఆ గ్రామం లోని ప్రజలు నిత్యం ఏదో ఒక సంఘర్షణ పడుతుండేవారు, దానితో విసుగు చెందిన గ్రామ పెద్దలు ఒక సాధువు దగ్గరకు వెళ్ళి వాళ్ళ గోడు చెప్పారు .ఉన్నట్టుండి మా గ్రామంలో అంతః కలహాల వల్ల గ్రామాభివృద్ధి జరగడం లేదు అని చెప్పారు. ఆ సాధువు మీరు ఒక నెలంతా మౌనవ్రతం పాటించండి అని చెప్పాడు .గ్రామపెద్దలకు ఏమి బోధ పడలేదు అయిన సాధువు చెప్పడం వల్ల ప్రజలంతా మౌనవ్రతం పాటించాలని చాటింపు వేసారు.గ్రామంలో ప్రజలు మౌనంగా ఎవరి పనులు వారు చేసుకుంటూ జీవించారు.ఊరు ఊరు అంతా ప్రశాంత వాతావరణం ఏర్పడింది గ్రామ పెద్దలు సంతోషించి సాధువు దగ్గరకు వెళ్లారు అయ్యా మీరు చెప్పిన్నట్టే నెల నుండి మేము వ్రతం చేస్తున్నాం అందరూ సంతోషంగా వున్నారు అని ...

చిన్న చేప కథ

Image
అనగనగా కథలు చాలా విచిత్రంగా ఉంటాయి, ఇది ఒక చేప పిల్ల కథ. ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది,అందులో ఒక చేపల కుటుంబం నివసిస్తూ ఉండేది.అందులో అందరికన్నా చిన్నది అయిన చేప ఒకరోజు బయటకు వచ్చి ఈదడం నేర్చుకుంటుంది.అక్కడే ఒక  కోమ్మ పైన ఉన్న పక్షిని చూసి అది అంతలా ఎలా ఎగురుతుంది అని ఆలోచించింది దానితో   దగ్గరగా వెళ్లి నేను ఈదుతున్న మొత్తం నీటిలోనే ఉంటాను కానీ నువ్వు మాత్రం రెక్కలతొ ఎంత దూరం అయిన ప్రయాణం చేయగలవు అని బాధ  పడుతుంది .ఆ పక్షి అలా కాదు అమ్మ నువ్వు జల జీవివి నీకు రెక్కలు ఉండవు .నువ్వు ఈదుతున్నావు నేను ఈదలేను అని బాధ పడుతున్నాన అని అంటుంది . ఆ చిన్న చేప తన తల్లి దగ్గరకు వెళ్లి అమ్మా మనకు రెక్కలు ఎందుకు లేవు అని ప్రశ్నిస్తుంది, అప్పుడు ఆ తల్లి చేప భగవంతుడు ఒక్కో ప్రాణిని ఒక్కో లాగా సృష్టించాడు అని చెపుతుంది అయిన వినకుండా మారం చేస్తుంది. తెల్లవారుజామున ఆ తల్లి చేప  అడవిలో ఉన్న జంతువులు అన్నింటినీ సమావేశం కావాలిసిందిగా కోరింది, కోరిన విధంగా అన్ని జంతువులు చెరువు చుట్టూ మూగారు .తల్లి చేప పిల్ల చేపను తీసుకొని వచ్చి చూడు ఇవన్ని అడవిలోని రకరకాల జంతువులు కోతి ,నక్...

ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు...

సెప్టెంబర్ 5 న భారతదేశం అంతటా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు ,ఏ రోజు ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి కనుక. గురువు అంటే అజ్ఞానం తొలగించి జ్ఞానం అనే వెలుగులోకి నడిపే మార్గాన్ని చూపే వ్యక్తి. అది ఎవరైనా కావచ్చు మనను మంచి వైపు నడిపించేవాడు ఎల్లప్పుడూ గురువే అయి ఉంటాడు. సూర్యుడు లేకుండా వెలుగు లేదు, ఔషదం సేవించకుండా రోగం నశించదు అలాగే గురువు లేకుండా  జ్ఞానం లభించదు అని పెద్దల మాట. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు కు అత్యంత విలువైన ప్రాముఖ్యత వుంటుది.మన తల్లిదండ్రులు మనకు జన్మ ఇస్తే గురువు పునర్జన్మ ఇస్తాడు. ఈ సందర్భంగా ఒకచిన్న కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో స్వేచ్ఛ అని ఒక అల్లరి పిల్ల ఉండేది తన తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు అవడం వల్ల అల్లారు ముద్దుగా పెంచారు .ఆమెను పాఠశాలలో చేరిస్తే అల్లరి తగ్గుతుంది అని భావించి తల్లిదండ్రులు పాఠశాలకు పంపించారు, కానీ తీరు మారలేదు,ఆమె ఒకరోజు అటుగా వెళుతున్న గురువు పంచె ను లాగింది దాని వల్ల అతడు కింద పడిపోయారు  తలకు గాయం అయింది అది చూసి పరుగెత్తింది స్వేచ్ఛ, భయంతో వణికిపోతోంది ఆమెను చూసి గురువు చూసావా నువు చేసిన అల్లరి పని వల్ల నాకు రక్తం వస్తుంది ...