పర్యావరణం-జంతువులు.
అమ్మా ఇక్కడ నీళ్లు ఏంటి ఇలా ఉన్నాయి చాలా మురికిగా ఎలా తాగాలి అని అడిగింది పిల్లకోతి ,ఎం చేస్తాం బిడ్డా దాహం వేసినప్పుడు ఏదో ఒకటి తాగి మన దాహాన్ని తీర్చుకోవాలి అన్నది .ఎందుకమ్మా ఇలా ? మన తాత ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు పచ్చని చెట్లు , చల్లని గాలి ,సెలయర్ల గలగలలు ,పక్షుల కీలకిలలు ,కోయిల కూని రాగాలు, చెట్ల నిండా పండ్లు, ఫలాలు,కూరగాయలు ఇలా ఒక్కటేమిటి అన్ని అంటుండేవాడు .ఎవమ్మా ఇప్పుడు అవన్నీ అన్నది మాకు కనపడవా?.
పాపం ఆ తల్లి కోతికి కూడా బాగా బాధ అనిపించింది.అవునమ్మా ఒకప్పుడు ఈ పర్యావరణం అలాగే ఉండేది.కానీ ఇప్పుడు అలా లేదు అంటుంటే కుందేలు వచ్చింది, ఎందుకు కోతి బావా అలా అంటున్నావు అన్నది, సరే విను చెప్తా అని చెప్పడం మొదలుపెట్టింది .ఒక్కొక్కటిగా అన్ని జంతువులు అక్కడ గుమి గుడాయి.
ప్రకృతి అంటే గాలి, నీరు ,నింగి,నేల,నిప్పు ఇవన్నీ పంచభూతాలు . భూమి మీద మనుషులు ,జంతువులు జీవిస్తాయి జంతువులు అన్నీ అడవులలోనే జీవనం సాగించేవి ,మనుషులు పరిణామ క్రమంలో మొదట అడవుల నుండి క్రమంగా నీరు ఉన్న ప్రదేశాలలలో ఆవాసాలు ఏర్పరచుకున్నారు.నీటి చుట్టూ వున్న ఆవాసాలు మెల్లిగా గ్రామాలు,నగరాలుగా ఏర్పడ్డాయి. మానవులు జంతువులకు ఒక స్పష్టమైన రేఖ గీయబడింది .అడవుల్లో జంతువులు నగరాల్లో మనుషులు జీవించడం మొదలు పెట్టారు.
ఆ తర్వాత ఏమైంది అమ్మా? ఇప్పుడే మొదలయింది అసలు కథ .అవునా ఏంటి అమ్మా అది ,మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది కోతి.మనిషి ఇప్పుడు పంటలు పండించడం చేసేవాడు , ఆ ఆహారం వల్ల వచ్చే శక్తి సరిపోక జంతువులను వేటాడే వాడు వాటిని కాల్చి తినేవాడూ. తినడం మాత్రమే కాకుండా పనులు చేసేవాడు ఆ పనుల్లో భాగంగా కొత్తకొత్తవి కనిపెట్టడం ,వాహనాల తయారీ , పరిశ్రమల ఏర్పాటు అన్నీ అవసరాలకు సంబంధించినవి తయారు చేస్తున్నాడు.
ఈ పరిశ్రమలు మనుషుల అవసరాలు తీర్చాయి కానీ వాటి వల్ల,వాహనాల వల్ల గాలి కలుషితం అయింది. ఖనిజాల కోసం భూమిని తవ్వడంతో భూమి కాలుష్యం పెరిగింది. పెరుగుతున్న నీటి అవసరాల కోసం బోర్లు వేయడం వల్ల ,సముద్రం , చెరువుల నుండి ఇసుక తవ్వడం చేస్తున్నారు ఈ కారణంగా నీటి జీవులకు ,భూమి మీద జీవులకు హాని కలుగుతుంది .పరిశ్రమలు నీటిని కలుషితం చేస్తున్నాయి అందువల్ల ఈ నీరు ఇలా మురికిగా మారాయి .నగరాలు విస్తరించడానికి అడవులను నరికి వేస్తున్నారు మనకు ఆవాసాలు లేకుండా చేస్తున్నారు ఈ మనుషులు.
ఒక్కసారిగా అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి వేలాది జంతువులు మరణించడం లేక ఆవాసాన్ని కోల్పోవడం జరుగుతుంది. భవనాలు కూడా మంటల్లో కాలి పోతున్నాయి వేలాది ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. ఈ కాలుష్యానికి ధ్రువ ప్రాంతాలలో మంచు కరుగుతుంది ,వాటి వల్ల సముద్ర తీర ప్రాంతాల్లో వుండే దేశాలు మునిగిపోతాయి ఇదే భవిషత్తులో జరిగేది.విపరీతమైన ప్లాస్టిక్ వాడకంతో భూమి కాలుష్యం నదులు,సముద్రాల కాలుష్యం పెరిగింది. కొన్ని రకాల మైక్రో ప్లాస్టీక్స్ మెల్లిగా సముద్ర జీవులలోకి వెళుతున్నాయి.ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఆవులు ఆహారం దొరకక ప్లాస్టిక్ కవర్లు తింటున్నాయి.ప్రపంచం అంతా అభివృద్ధి గురించి ఆలోచిస్తుంది కానీ మన గురుంచి ఎవరూ ఆలోచించడం లేదు ఎదో కొద్దీ మంది పర్యావరణ వేత్తలు తప్ప.
అవునమ్మా అభివృద్ధి కూడా జరగాలి కదా అది లేకుంటే మానవుడికి జంతువులకు తేడా ఉండదు కదా అన్నది ఆ చిన్న కోతి .అవును తల్లీ అభివృద్ధి జరగాలి కసిని దాని వల్ల మనకు హాని జరగవద్దు కదా! చిన్న ఉదాహరణ చెప్తా విను ఈ ప్రకృతి మానవుడు కలిసి పని చేయాలి లేకపోతే అంతా వినాశనమే జరుగుతుంది.రంగురంగుల సీతాకోకచిలుకలు ఊరికే అన్ని చేలా మీద వాలవు అవి ఒక చెట్టు పువ్వు నుండి పుప్పొడిని సేకరించి ఇంకొక పువ్వు మీద వేస్తాయి అలా పరాగ సంపర్కం జరిగి కాయలు పండ్లు వస్తాయి.మనం కోతులము కూడా పండ్లను మాత్రమే తిని గింజలు ఉస్తాము దానితో మల్ల కొత్త మొక్కలు వస్తాయి.కుందేలు , ఉడతలు అన్ని అంతే. అడవిలో జంతువుల సంఖ్య పెరగకుండా ఉండడానికి జీవరాశి సమతుల్యత దెబ్బతినకుండా ఒక జీవి ఇంకొక జీవికి ఆహారంగా ఏర్పాటు చేశాడు ఆ భగవంతుడు.
మానవుడు ఎం చేసినా కూడా పర్యావరణ సమతుల్యత దెబ్బ తీయవద్దు.సెల్ ఫోన్ టవర్ల నిర్మాణం వల్ల రేడియేషన్ కి పక్షులు అన్ని కనుమరుగు అవుతున్నాయి.ప్రపంచ దేశాలు అన్నీ కూర్చొని వివిధ ఒప్పందాలు చేసుకున్నాయి అవన్నీ మాత్రం తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలి రేపటి తరానికి మనం ఇచ్చేది ఏదయినా పరిశుభ్రంగా ఉండాలి.
అభివృద్ధి పేరు మీద జరిగే విద్వంసాన్ని అరి కట్టాలి
తెలంగాణాలో ఒక పర్యావరణ వేత్త వనజీవి రామయ్య అతని భార్య కలిసి యాభై సంవత్సరాలనుండి మొక్కలు నాటుతూనే ఉన్నారు
సీడ్ బాల్స్ లాంటివి తయారు చేసి కొన్ని చోట్ల మొక్కలు నాటారు అలాంటి వారు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు కానీ అది అతి కొద్ది శాతం మాత్రమే .ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత అనుకోని పర్యావరణ హితమైన పనులు చేయాలి.ఈ భూమిమీద జీవించడానికి ప్రతి జీవికి హక్కు ఉంది ఆ హక్కును ఎవరూ కాల రాయడానికి వీలు లేదు .
ప్రకృతి ఎంత అందమైనదో అంత భయకరమైనది కూడా ఎల్లవేళలా దానికి అనుకూలంగా మనం పని చేసుకుంటూ వెళ్ళాలి.ప్రకృతి ప్రకోపానికి ఎవరైనా బలి కావాల్సిందే.
అప్పుడు అక్కడ ఉన్న జంతువులు అన్ని ఈ విషయాలన్నీ జాగ్రత్తగా విన్నాయి.మానవుడు చేసే పనులకు మనకు ఇబ్బందులు వస్తున్నాయి మనమైన కొంచెం మార్పు చేద్దాం మంచి నీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వలస వెళదాం అని అక్కడ నుండి బయలుదేరాయి.
🫡nice
ReplyDelete