చెడపకురా చెడేవు.....
రామకృష్ణాపురంలో సాంబయ్య అనే రైతు ఉండేవాడు అతను చాలా కష్టపడి పని చేసేవాడు .అతనికి నలుగురు కొడుకులు రంగయ్య,రాజయ్య,రుద్రయ్య మరియు రాఘవయ్య.రాజయ్య, రంగయ్య, రుద్రయ్య బాగా తెలివినవాళ్ళు,రాఘవయ్య పాపం వట్టి అమాయకుడు.ఎవరు ఏమి చెప్పిన నమ్ముతాడు.రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలకు పెళ్లిళ్లు చేసాడు సాంబయ్య. అతని దిగులు అంత చిన్న కొడుకు గురించే, అతని అమాయకత్వానికి ఎవరూ పిల్లను ఎవరు ఇవ్వలేదు.అలాగే ఉండిపోయాడు.కొన్ని రోజులకు సాంబయ్యకు జబ్బు చేసింది రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలు వారి పిల్లలను భార్యలను చూసుకుంటూ సాంబయ్యను పట్టించుకునేవారు కాదు.రాఘవయ్య తండ్రిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు .పూర్తిగా అతని ఆరోగ్యం క్షీణించి అతను చనిపోయాడు.అతను చనిపోయాక అన్ని కార్యక్రమాలు ముగిసిన తరువాత లాయరు వీలునామా తెచ్చి ఇచ్చాడు ఆస్థులన్ని సమంగా పంచుకోవడానికి.సాంబయ్య వీలునామాలో రాఘవయ్యకు కొంచెం ఎక్కువగా ఆస్తి రాసాడు అది చూసి మిగిలిన అన్నలు ఓర్వలేక ఇది మేము చూసుకుంటాం అని లాయరును పంపించి వేశారు. రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలు మంచి తరి పొలాన్ని తీసుకొని ఊరు అవతల పనికిరాని మెట్టభూమి ఇచ్చారు.ఇంకా అతని దగ్గర ఒక కుంటి పిల్ల...