Skip to main content

రంగడు-సింగడు-ఉద్యోగం

అనగనగా ఒక రాజ్యంలో సింగడు,రంగడు  అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు.వారి ఇంట్లో వాళ్ళు మీరు ఏ పని చేయడం లేదు అని తిట్టి ఇంట్లో నుండి గెంటేశారు.సింగడు ఏదిఅయినా మన మంచికే అని అనుకుంటాడు అందరికి అలాగే చెప్తాడు.రంగడిని తీసుకుని ఉద్యోగం కోసం బయలుదేరి వెళ్లారు. వారు అలా వెళుతుండగా వారికి సింహాగర్జన వినిపించింది ఇద్దరూ వెంటనే చెట్టు ఎక్కి కోమ్మల్లో దాక్కున్నారు. రంగడు అరేయ్ సింగా మనం ఎంత  ప్రమాదంలో ఉన్నామో తెలుసా మనం ఈ దారిన వద్దు అంటే నువ్వు తెచ్చావు అంటాడు ఎమీ కాదులే నువ్వు గబరపడకు అన్నాడు.మెల్లిగా చెట్టు దిగి చుట్టూ చూసి వేరే దిక్కుగా నడవడం మొదలు పెట్టారు.వెళుతుంటే దారిలో వారికి ఒక ఉంగరం కనిపించింది.దానిని రంగడు వేలికి పెట్టుకున్నాడు. కొంతదూరంలో వారికి భటులు ఎదురుపడ్డారు.రంగడి చేతికి ఉన్న ఉంగరాన్ని చూసి వాళ్ళను రాజు గర్ దగ్గరికి తీసుకెళ్ళారు. రంగడు భయపడుతున్నాడు, సింగడు ఎమి పర్లేదు మిత్రమా అంత మన మంచికే ఎక్కడ నుండో ప్రయాణం చేసి వచ్చి రాజు గారిని నేరుగా చూసే అవకాశం వచ్చింది అంటాడు.రాజు గారు వారిని గురించి
అడిగాడు,వారు జరిగింది అంతా చెప్పారు..నాకు నమ్మకం కలగడం లేదు అప్పటిదాకా ఇక్కడే ఉండండి అన్నారు.మీకు ఒక గుర్రాన్ని ఇస్తాను దానికి కాపలా కాయండి అన్నాడు రాజు.ఆ రోజు రాత్రి దానిని ఎవరో ఎత్తుకొని వెళ్లారు .భటులు వీరిద్దరే ఎదో చేశారు అని రాజు దగ్గరకు తీసుకెళ్లారు.అప్పుడు సింగడు నిజంగా మేము దొంగతనం చేస్తే మేము ఇక్కడ ఉండము కదా అన్నాడు.సరే అయితే వెళ్లి గుర్రాన్ని వెతకండి అని చెప్పాడు.అలా వెళుతుండగా వీళ్లిదరికి ఒక దగ్గర కట్టేసి ఉన్న గుర్రం కనిపించింది.అక్కడ ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు అందరి దృష్టి గుర్రం మీదనే ఉంది కోటలోనికి వెళ్ళడానికి ఇదే సరైన సమయం ఎలాగూ సైనికధికారి అక్కడ సైనికాధికారి మన మనిషే అని మాట్లాడుకోవడం వాళ్ళు విన్నారు.వెంటనే వెళ్లి రాజుకు విషయం చెప్పారు.గుర్రాన్ని కాపాడారు,సైనికాధికారి మోసం బయటపడింది.వాళ్లకు ఉద్యోగం దొరికింది.అప్పుడు సింగడు ఎంత కష్టం వచ్చినా సరే అది మనకు అనుకూలంగా వుంటుందనే ఆలోచనతో మందుకెళ్తే ఏదయినా సాదించొచ్చు అన్నాడు.






Comments

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .