nala damayanthi story in telugu
మీకు ముందే చెప్పాను కదా , మహాభారతంలో కథలు చాలా బాగుంటాయి అవి మన నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి .ఇది ఒక అందమైన ప్రేమకథ .చాలా ప్రేమకథలు తెలుసు కానీ ఎన్నో ట్విస్టులు వున్న కథ ఇది. అయిపోయింది అనుకున్నప్పుడే మళ్ళీ మలుపు వుంటుంది అందుకే ఈ కథ ప్రేక్షకులు చదువుతున్నంత సేపు ఏం జరుగుతుందో అన్న ఆసక్తి కలుగుతుంది.జీవితంలో ఎన్నో కష్టాలను ఓర్చుకొని ప్రేమను గెలిపించుకున్న నల దమయంతుల ప్రేమకథ. అనగనగా నిషధ దేశాన్ని వీరసేనుడు అనే రాజు పాలిస్తుండేవాడు అతనికి నలుడు , పుష్కరుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. నలుడు ధర్మపరుడు , సత్యవంతుడు, ప్రజలకు ఎంతో ఇష్టమైనవాడు . తండ్రి వీరసేనుడుకు కూడా నలుడు అంటే ఇష్టం వల్ల అతన్ని రాజుగా ప్రకటించాడు నలుడు రాజు అవ్వడం పుష్కరుడికి ఇష్టం లేదు. ఇదిలా ఉండగా విదర్భ దేశాన్ని భీముడు అనే రాజు పాలిస్తున్నాడు. అతనికి సంతానం లేదు,అతనికి ధమనుడు అనే ముని ఇచ్చిన వరం వలన దమయంతి అనే కూతురు దముడు ,ధమనుడు,దంతుడు అనే కుమారులు కలిగారు. దమయంతి అపూర్వ సౌందర్యం, వినయం కలిగినది . ఈ విషయం నలుడు ...