Skip to main content

అప్పయ్య ,కొండయ్య, కొరడా దెబ్బలు

రంగాపురంలో అప్పయ్య,కొండయ్య అనే ఇద్దరు స్నేహితులు వుండేవారు.వారు దేశ సంచారం చేసేవారు రాజ్యంలోని పరిస్థితులను రాజుకు వివరించేవారు.అలా తిరుగుతూ తిరుగుతూ వుండేవారు. కోటిలింగాల రాజ్యంలో రాజు మా రాజ్యంలో ప్రజలు అంతా చాలా మంచివారు స్వార్థం లేని వారు అధికారులు లంచం తీసుకోరు అని బాగా గొప్పలు చెప్పుకునేవారు.
కోటిలింగాల ప్రజల గురుంచి,అధికారుల గురించి తెలుసుకోవడానికి అప్పయ్య, కొండయ్య బయలుదేరారు.గ్రామాల్లో పర్యటిస్తున్నారు ఇద్దరు ఆట పాటలతో అందరిని ఆకట్టుకొని డబ్బులు పొగుచేస్తున్నారు.వాళ్ళు దారిలో వెళుతుంటే ఆగంతకులు వచ్చి వాళ్ళ సంచిని ఎత్తుకొని వెళ్లారు వీరు వాళ్ళను వెంబడించి దొంగలను పట్టుకున్నారు ఎందుకు ఇలా చేసారు అని అడగగా మాకు పని దొరకక ఆకలికి దొంగతనం చేసాము ఈ రాజ్యంలో ఏదయినా లోటు ఉంది అని చెప్తే మంత్రి వర్గం అంత మమ్ములను బ్రతనివ్వరు అందుకే మేము సంతోషంగా ఉన్నట్లు రాజు గారిని నమ్మిస్తున్నాము అని అన్నారు.అలా అన్ని గ్రామాలు పూర్తి అయిన తర్వాత అనోటా ఈనోట అప్పయ్య ,కొండయ్యల ఆట పాటల వినోదాలు రాజు గారికి తెలిసింది .వారికి రాజభవనం నుండి ఆహ్వానం లభించింది. వారు వస్తుంటే ఇద్దరు కాపలాదారులు మిమ్మల్ని లోపలికి పంపాలంటే రాజు ఇచ్చిన బహుమతిలో సగం మాకు ఇవ్వాల్సి ఉంటుంది అన్నారు.కోట ద్వారం దాటాక ఇద్దరు సేవకులు మిమ్ము రాజు దగ్గరికి పంపితే మాకు సగం ఇవ్వాలి అన్నారు.అలా రాజు గారి దగ్గరకి చేరే వరకు చాలా మంది అడ్డుకున్నారు ,చివరగా మంత్రిగారు కూడా మీకు ఇచ్చే బహుమతిలో సగం ఇవ్వాలని అడిగారు.ఎట్టకేలకు రాజు దగ్గరకు వెళ్లి తమ ఆట పాటలను ప్రదర్శించారు.రాజుకు చాలా సంతోషపడ్డాడు. మీకు ఏమి కావాలో కోరుకో ? అన్నాడు రాజు.మాకు ఒక వంద కొరడా దెబ్బలు కావాలి అన్నారు.రాజు ఆశ్చర్యం పొంది ఎందుకు అని అడిగాడు ,వారు జరిగింది అంతా రాజుకు వివరించారు రాజు జరిగింది తెలుసుకొని అందరిని శిక్షించాడు .అప్పయ్య,కొండయ్యకు బహుమతులు ఇచ్చాడు. రాజు ఎప్పుడైనా  సొంతంగా పరిస్థితులు తెలుసుకోవాలి కానీ ఎవరి మీద ఆధారపడకూడదు.పై అధికారులు నుంచికింది స్థాయి వరకు అందరి మీద నిఘా ఉంచాలి గుడ్డిగా ఎవరిని నమ్మవద్దు.





Comments

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .