Skip to main content

Posts

Showing posts with the label moral stories.

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

తెనాలి రామలింగని తెలివి

అది శ్రీకృష్ణదేవరాయలు రాజ్యం ,అతని మంత్రి తెనాలి రామకృష్ణుడు. అతను చాలా తెలివినవాడు.పక్క రాజ్యం లోని రాజు ఈ విషయం తెలుసుకుని అతని తెలివికి పరీక్ష పెట్టాలనుకున్నాడు.మా రాజ్యానికి ఒక ఇరవై కిలోల క్యాబేజీ,యాభై ఆకుకూర కట్టలు కావాలని  వర్తమానం పంపాడు.అందరూ ఈ వర్తమానాన్ని చూసి తలలు పట్టుకొని కూర్చున్నారు.ఆ రాజ్యం నుండి ఈ రాజ్యానికి వెళ్ళడానికి అరవై రోజుల ప్రయాణం పడుతుంది,అని భయపడుతున్నారు.శ్రీకృష్ణదేవరాయలు రామలింగడిని పిలిచి ఈ సమస్యకు పరిష్కారం చూపమని అడిగాడు. రామలింగడు బాగా ఆలోచించి ఒక  పది ఎద్దులబండ్లు తెప్పించామన్నాడు.అందరూ చాలా ఉత్కంఠగా చూస్తున్నారు ఈయన ఏమి చేస్తున్నాడు అని.రాయలు మాత్రం రామలింగడి మీద నమ్మకంతో ఏమి అడగలేదు,తెనాలి రామలింగడు అన్ని ఎద్దులబండ్లలో సగం వరకు మట్టిని నింపాడు.కొన్నింటిలో ఆకుకూరలు విత్తనాలు కొన్నింటిలో క్యాబేజీ విత్తనాలు వేశాడు. ఒక్కొక్క బండికి రెండు కుండలు కట్టాడు,ఒక్కో బండికి ఇద్దరు మనుషులను పెట్టాడు వారు దారి పొడవునా వెళ్తూ వెళ్తూ మధ్యలో ఆ మట్టికి నీరు పెట్టమన్నాడు అలా అరవై రోజుల ప్రయాణ సమయానికి ఆ గింజలు మొలకెత్తి తాజా కూరగాయలు,ఆకుకూరలు రాజు గ...

రామచంద్రయ్య కథ

అనగనగా ఒక ఊరిలో రామచంద్రయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను కట్టెలు కొట్టి డబ్బులు సంపాదించేవాడు .ఎంత చేసినా తినడానికిఈ తప్ప ఏమీ మిగలడం లేదు,అని పగలు రాత్రి కష్టపడి కట్టెలు కొట్టేవాడు అతనికి నిద్ర కూడా సరిగా ఉండేది కాదు.ఒకరోజు అతని కూతురికి ఆరోగ్యం బాగాలేదు అదే దిగులుతో ఎలాగైనా ఏ రోజు ఎక్కువ కట్టెలు కొట్టాలని నిర్ణయించుకున్నాడు.అలా కొడుతున్న సమయంలో గొడ్డలి చేయి జారీ నీటిలో పడిపోయింది.అందులో నుండి గంగా మాత బయటకువచ్చి బంగారు గొడ్డలి ఇచ్చింది.అమ్మ ఇది నాది కాదు అన్నాడు రామచంద్రయ్య, గంగామాత లోపలికి వెళ్లి వెండి గొడ్డలి తెచ్చింది .అమ్మా ఇదికూడా నాది కాదు ,నాది కేవలం ఇనుప గొడ్డలి అంతే అన్నాడు .గంగమాత మళ్ళీ లోపలికి వెళ్లి ఇనుప గొడ్డలి తెచ్చి ఇచ్చింది.హా ఇది నాదే అని తీసుకున్నాడు .అతను నిస్వార్థంగా ఉన్నందువల్ల గంగమాత సంతోషించి బంగారు మరియు వెండి గొడ్డలి కూడా ఇచ్చింది.రామచంద్రయ్య వద్దు అమ్మా నాకు అన్నాడు,అయినా ఆమె ఇచ్చింది,దానిని తీసుకొని ఇంటికి వెళ్లి భార్యకు ఇచ్చి జరిగిన విషయాన్ని చెప్పాడు. అనోటా ఈ నోటా అది ఎదురింటి రాజయ్యకు తెలిసింది.రాజయ్య కూడా ఎలాగైనా  బంగారు గొడ్డలి, వెండి గొడ్డ...

బుద్ది బలం

అనగనగా ఒక రాజ్యం .ఆ రాజ్యంలో శుభాసేనుడు అనే రాజు ఉండేవాడు .అతను చాలా మంచివాడు కవులు కళాకారులను ప్రోత్సహించేవాడు.ఒకరోజు రాజ్యంలో ఒక విచిత్రమైన చాటింపు వేయించాడు. రాజ్యంలో అందమైన చిత్రాన్నీ గియమని చెప్పాడు.  రాజ్యంలోని కళాకారులు అంతా ఆలోచనలో పడ్డారు.ఏ బొమ్మ గీస్తే రాజుగారి బహుమతి లభిస్తుందో అని నెల రోజుల గడువు ముగిసింది.ఆ రోజు అన్ని చిత్రపటాలు తీసుకొని వచ్చి ప్రదర్శించడం మొదలు పెట్టారు,సాయంకాలం అయింది కానీ రాజగారికి మాత్రం ఒక్క చిత్రపటం కూడా నచ్చడం లేదు ,రాజు సభ నుండి నిష్క్రమించాడు. మరల గడువు పొడిగించాడు రాజు.కళాకారులు అంతా తలలు పట్టుకున్నారు ఇంకా ఏమి గీయాలి అని మదన పడుతున్నారు.పక్క ఊరి నుండి సుభద్రుడు అనే వ్యక్తి వచ్చాడు,అతను శుభాసేనుడు దగ్గరకు వచ్చి రాజా ఏ రాజ్యంలో అందమైన చిత్రాన్ని గీసాను అన్నాడు ప్రజలు అంతా ఆశ్చర్యంతో చూసారు.సుభద్రుడు తాను తెచ్చిన పటం పైన నుండి తెర తీసాడు చూస్తే అక్కడ అద్దం ఉంది అందులో రాజుగారి ముఖం కనిపించింది.సుభద్రుడు మాట్లాడుతూ రాజా ఈ రాజ్యంలో అందమైన చిత్రం మీదే అన్నాడు,దానికి రాజు సంతోషించి బహుమతి ఇచ్చాడు. అన్ని సార్లు ప్రతిభ పనికిరాదు కొన్ని సా...

స్నేహమేరా జీవితం.

అనగనగా ఒక ఊరిలో ఒక చెరువు ఉండేది,ఆ చెరువు పక్కన ఒక చెట్టు ఉండేది .ఆ చెట్టు మీద ఒక పావురాల గుంపు ,ఎలుక ,చీమలు ఉండేవి.చెరువులో ఒక బాతు ఉండేది .అవన్నీ మంచి స్నేహంతో కలిసి మెలిసి ఉండేవి. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక వేటగాడు వచ్చాడు.ఈ చెట్టు మీద ఎక్కువ పావురాలు ఉన్నాయని వల విసిరి పట్టుకున్నాడు.పావురాలు ఎడుస్తున్నాయి, ఐతే చీమ ,ఎలుక,బాతు అన్ని కలిసి ప్లాన్ చేసాయి ,ఆ పావురాలను ఎలా అయినా విడిపించాలని వెంటనే అమలు చేసాయి. బాతు అరవడం మొదలు పెట్టింది వేటగాడు ఈ శబ్దం ఏంటి అని అటు వెళ్ళాడు,వెంటనే చీమ అతనిని కుట్టింది.అమ్మా నొప్పి అని విలవిల్లాడడు. ఎలుక పరుగున వెళ్లి వలను కొరికింది,పావురాలు అన్ని పారిపోయాయి.వేటగాడు వెంటనే అరవడం మొదలుపెట్టాడు .అన్ని ఎక్కడివి అక్కడకు వెళ్లిపోయాయి ఇంతలో చీమ చెరువులో పడిపోయింది పావురాలు ఒక ఆకును తుంచి నీటిలో వేసింది.చీమ ఆకుపైకి ఎక్కింది ,బాతు దానిని ఒడ్డుకు చేర్చింది.ఇలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవనం సాగించాయి.  మన చుట్టు పక్కల వారితో ఎల్లవేళలా స్నేహంతో ఉండాలి ఒకరికి మంచి చేస్తే మళ్ళీ అదే తిరిగి వస్తుంది.