Posts

Showing posts with the label sri krishna rayabaaram

శ్రీకృష్ణ రాయబారం .

Image
మహాభారతంలో అన్ని కథలు మనకు చాలా దగ్గరగా ఉంటాయి అని గతంలో చెప్పుకున్నట్లే ఈ శ్రీకృష్ణ రాయబారం కూడా అలాంటిదే. రాయబారం అంటే ఒకరి తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడడం కాదు ఇరువురి మధ్య ఉన్న సమస్య గురించి లోతైన అవగాహన ఉండాలి.సమస్య తెలిస్తేనే కదా ! దారి తెలుస్తుంది.మహాభారతం ఒక కథ మాత్రమే కాదు మనందరి జీవితాలకు ఒక అర్థవంతమైన పుస్తకం. పాండవులను కౌరవులు అడుగడుగునా హింసిస్తున్నా కూడా చెక్కు చెదరకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళుతున్నారు.ఈ క్రమంలో వారు కొత్తగా నిర్మించిన ఇంద్రప్రస్తాన్ని చూడడానికి ఒకరోజు దుర్యోధనుడు వెళ్తాడు అతను ఆ భవనాన్ని చూసి చాలా ఆశ్చర్యం పొందాడు,దానితో అసూయ చెందాడు.ఎలాగైనా ఇంద్రప్రస్తాన్ని కూడా చేజిక్కించుకోవాలి అని పన్నాగాలు పన్నాడు.శకుని మామ సహాయంతో మాయ పాచికలు తయారు చేసాడు.ధర్మరాజు జూదానికి బానిస కాదు కాని అతనికి జూదం అంటే ప్రాణం.   ధర్మరాజును కౌరవులు జూదానికి ఆహ్వానించారు ,వారి మనస్తత్వం తెలిసి కూడా ధర్మరాజు ఒప్పుకున్నాడు.వారు ఆహ్వానించనందువల్ల మనం వెళ్ళాలి అని అందరిని కూడా గట్టుకొని హస్తీనాపురానికి వచ్చాడు.శకుని తన చాకచక్యంతో పండిత పామర జనాలను మభ్య పెడుతూ ధర...