Posts

Showing posts with the label reading.

కలసి ఉంటే కలదు సుఖం

Image
అనగనగా ఒక ఊరిలో రామయ్య, సీతమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి నలుగురు సంతానం.నలుగురు కొడుకులు,కొడళ్లతో ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది.ఆ ఊరిలో అందరూ మీరు ఎప్పుడు ఇలా ఎలా కలిసి వుంటారు అని అనుకుంటారు.ఒకరోజు వాళ్ల ఇంటికి ఒక అతిధి వచ్చాడు అతను వాళ్లలో వాళ్లకు ఎలాగైనా గొడవ పెట్టాలి అనుకుని వచ్చాడు.అత్త సీతమ్మ వంట పూర్తి చేసింది ,పెద్దకొడలికి ఆ కూర ఒక అయిదు నిముషాల తర్వాత కొంచెం ఉప్పు వేసి దించు అని చెప్పి ఆమె బయటకు వెళ్ళింది.పెద్దకొడలు సరే అన్నది ఇంతలో బట్టలు అరబెట్టేది వుందని రెండవ కోడలికి చెప్పి వెళ్ళింది,ఆమె కూడా సరే అన్నది అప్పుడే వాళ్ళ ఆయన పిలిచేసరికి వెళ్ళింది.మూడవ కోడలికి ఉప్పు వేసి దించమని చెప్పింది.ఆమెకు నీళ్లు పట్టేది ఉందని వెళ్తూ వెళ్తూ చిన్న కోడలికి చెప్పి వెళ్ళింది.చిన్న కోడలు సరే అని ఉప్పు వేసి దించింది.నీళ్లు పట్టి తిరిగి వచ్చిన మూడవ కోడలు ఉప్పు వేసి కలిపింది.భర్త దగ్గర నుండి వచ్చిన రెండవకోడలు చెల్లి ఉప్పు వేసిందో లేదో అని ఉప్పు వేసి కలిపింది.ఆ తర్వాత కొద్ది సేపటికి వచ్చిన పెద్ద కోడలు నా చెల్లి  ఉప్పు వేసిందో లేదో అని ఆమె కూడా ఉప్పు వేసింది.మధ్యాహ్నం భోజనానికి ...

గాడిద తెలివి

Image
అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు.అతను ఒక కుక్కను,గాడిదను పెంచుకున్నాడు.కుక్కను కాపలాగా ఉంచి గాడిదను పట్నానికి తీసుకోని వెళ్ళాడు అక్కడ నుండి సరుకులు అన్ని తెచుకునేవాడు.ఇలా రోజులు గడిచిపోతున్నాయి.,గాడిదకు కుక్క మీద ఎక్కువ అసూయ పెంచుకుంటుంది.ఒకరోజు ఇంట్లో వాళ్ళు అందరూ నిద్రిస్తుండగా దొంగలు వచ్చారు వారిని చూసి కుక్క మొరిగింది, అందరూ లేచి దొంగలను తరిమికొట్టారు. గాడిదకు కోపం వచ్చింది దానిని మెచ్చుకొని ఇంకా గారబం చేశారు.గాడిద అరిచింది ఈ సారి దానిని కొట్టాడు రైతు రామయ్య. కోపం తెచ్చుకొని ఎలాగైనా వీరికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంది.పట్నానికి సరుకులు తేవడానికి వెళ్ళేటప్పుడు నదిని దాటాలి,అప్పుడు నేను పడిపోయినట్టు నటిస్తాను అన్ని సరుకులు పడిపోతాయి అనుకుంది.సరుకులు తీసుకొని వస్తుండగా నదిలో పడిపోయింది దానిలో సరుకులు పాడైపోయాయి.ఉప్పు బస్తా మొత్తం కరిగిపోయింది గాడిదకు ఇది ఎదో మాయనదివలె ఉంది అని భావించి ఏ రోజు కి ఏ పని లేదు అని సంతోషంగా ఇంటికి వెళ్ళింది .రైతు మాత్రం గాడిదకు ఏమైనా దెబ్బలు తగిలాయి అని అనుకోని డాక్టర్ ని తెచ్చాడు మందులు ఇచ్చాడు .రెండు రోజులు ఏ పని చెప్పలేదు  అది...