సహవాస దోషం
అనగనగా ఒక ఊరిలో ఒక గ్రామాధికారి,పూజారి,జూదరి అనుకోకుండా ఒక విహారయాత్రకు బయలుదేరారు.వారు పడవ ప్రయాణం చేస్తున్నారు,ఇంతలో ఒక భయంకరమైన తుఫాను వచ్చింది .దాని వల్ల వారు ఒక ద్వీపంలో చిక్కుకుపోయారు.అటునుంది వారు బయటపడే మార్గం కొరకు చాలా వెతికారు,కానీ వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. చివరకు ఇది ఐతే అది జరుగుతుందని భావించి అలా ఉండిపోయారు. అలా రెండు నెలలు గడిచిపోయాయి ,ఒకరోజు జూదరి రండి ఎంతకాలం ఇలాగే ఉంటారు సరదాగా పేకాట ఆడుకుందాం అంటాడు. గ్రామాధికారి ఈ విషయం మా ఊరిలో తెలిస్తే గ్రామస్తులు నాకు మర్యాద ఇవ్వరు నేను ఆడను అంటాడు.పూజారి జూదం అనేది ఒక వ్యసనం అది మహాపాపం ,నేను ఆడను అంటాడు.
అలా కొన్ని రోజుల తర్వాత గ్రామాధికారి జూదరి దగ్గరగా వచ్చి పోనీలే నేను ఇక్కడ ఆడితే అక్కడ మా గ్రామంలో ప్రజలకు ఎలా తెలుస్తుంది రా నాకు ఆట నేర్పించు అన్నాడు.ఆ తర్వాత పూజారి వచ్చి ఏవైనా దోష పరిహారాలు ఉంటే చేసుకుంటా,ఖాళీగా ఉండి ఏమి లాభం అన్నాడు.అలా ముగ్గురు కలిసి ఆడటం మొదలుపెట్టారు.పని ఏమి లేకపోవడంతో వారు ఒక వారంలొనే ఆట నేర్చుకున్నారు.అలా ఆడుకుంటూ కొన్ని నెలలు గడిచాయి.ఒకరోజు ఆ ద్వీపంలో ఒక సీసా కనిపించింది దానికి మూత పెట్టి వుంది వారు దానిని తెరిస్తే ఒక భూతం వచ్చింది.నన్ను విడుదల చేసినందుకు ధన్యవాదాలు మీకు ఏ వరం కావాలో కోరుకోండి అన్నది భూతం. పూజారి నేను ఏదైతే గుడిలో పూజారిగా ఉన్నానో అక్కడ నన్ను వదిలిపెట్టు అన్నాడు సరే అని వదిలిపెట్టింది భూతం. గ్రామాధికారి నన్నుకుడా మా గ్రామంలో వదిలిపెట్టండి అన్నాడు ఆయనను కూడా వదిలింది.ఆ తర్వాత జూదరిని అడిగింది అతను చాలాసేపు ఆలోచించి వారిద్దరిని ఎక్కడైతే వదిలావో అక్కడ నుండి తెచ్చి మళ్ళీ ఇక్కడే వదిలిపెట్టు అన్నాడు.భూతం అలాగే చేసింది పాపం వారిద్దరూ మళ్ళీ ద్వీపంలో వచ్చి పడ్డారు.వారు నువ్వు పోకుండా మళ్ళీ మమ్ములను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చేలా చేసావు అన్నారు.అతను దానికి నేను ఊళ్లో జూదం ఆడితే అందరూ నన్ను తిడతారు కనుక నేను ఊరికి వెళ్లలేను నేను ఒక్కడినే ఇక్కడ ఉండలేను అందుకే మిమ్మలను ఇక్కడికి రప్పించాను అన్నాడు దానికి వారిద్దరూ చాలా బాధపడ్డారు.మనుషులు తమ స్వంత ప్రయోజనాలకోసం ఇతరుల జీవితాలను ఫణంగా పెడతారు.వారితో జాగ్రత్తగా ఉండాలి.ఎల్లప్పుడూ మంచి సహవాసం చేయాలి.
Comments
Post a Comment