Skip to main content

నక్క తెలివి

అనగనగా ఒక అడవి ఆ అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి.ఆ అడవికి రాజు మృగరాజు సింహం .సింహం మంచిదే కానీ దాని దగ్గర ఉన్న సైన్యంలో తోడేలు, నక్క,రాబందు ఉండేవి.సింహం సైన్యంలో నక్క అసలు మంచిది కాదు ఎప్పుడు తన స్వార్థం కోసమే ఇతరులను బలి చేసేది.ఒకరోజు సింహం పర్యటనకు వెళ్ళింది అన్ని జంతువులు ఈ అడవిలో ఎలా ఉన్నాయి నేను అంటే  అసలు బయపడుతున్నాయా లేదా!అని అంతటా తిరిగింది.
ఏనుగు దగ్గరకు వచ్చింది మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నది అది చెప్పే లోపే నక్క కల్పించుకొని వాళ్లకు ఏమి సమస్యలు లేవు రాజు గారు అవి ఇంకా ఇష్టారాజ్యంగా తిరిగి అడవులను పాడు చేస్తున్నాయి వెంటనే ఏనుగులు ఎం చెప్పాలో అర్థం కాక తల దించుకున్నాయి.మృగరాజు ఏనుగులను మంద లించాడు. ఆ తర్వాత పక్షులను అడిగాడు ,వారు అన్ని కలిపి ఒకటే గొంతుతో నక్కను మాట్లాడనియక మాకు చాలా సమస్యలు ఉన్నాయి.అడవిలో మేము గూడు కట్టిన చోట ఇంకొకరిని రానివ్వకండి .మాకు చాలా కష్టం అవుతుంది లేకపోతే మాకు అందరికి ఒక దగ్గర మంచి గూళ్లు కట్టించండి అన్నాయి.వెంటనే నక్క మీకు గుళ్ళు కట్టడానికి డబ్బులు ప్రస్తుతం ఖాజానలో లేవు అవి సర్దిబాటు ఐతే కడతాం అన్నది సింహం పేరుకు రాజు అయిన నక్క మాట వింటుంది కాబట్టి ఏమి అనలేదు అలా అందరి సమస్యలు తెలుసుకొని ఇంటికి బయలుదేరింది.అలా వెళుతున్న సింహాన్ని ఒక వేటగాడు చూసాడు దానిని బాణం వేసి చంపాలని చూస్తూ అనుసరిస్తున్నడు.అలా పైన వెళుతున్న కాకి అది చూసి మహారాజ మిమ్ములను ఎవరో చంపడానికి చూస్తున్నారు అంటుంది.నక్క ఈ అడవికి రాజు ఆయనను ఎవరు చంపుతారు అంటుంది.అలా నడుస్తుంది వేటగాడు బాణం వేస్తాడు సింహం చచ్చిపోతుంది.నక్క పారిపోతుంది అందుకే ఎప్పుడూ ఎవరు చెప్పిన వినాలి ,వింటే నష్టం ఏమి జరగదు కదా వినకపోవడంతో జరిగే అనర్థం ఎక్కువ కదా! వినడానికి చిన్న పెద్ద అనే తేడా ఉండదు అది మంచి అయితే చాలు.రాజు ఎప్పుడు ఒకరిద్దరు మాటలు విని నిర్ణయాలు తీసుకోవద్దు.
 





Comments

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .