స్నేహమేరా జీవితం.

అనగనగా ఒక ఊరిలో ఒక చెరువు ఉండేది,ఆ చెరువు పక్కన ఒక చెట్టు ఉండేది .ఆ చెట్టు మీద ఒక పావురాల గుంపు ,ఎలుక ,చీమలు ఉండేవి.చెరువులో ఒక బాతు ఉండేది .అవన్నీ మంచి స్నేహంతో కలిసి మెలిసి ఉండేవి. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక వేటగాడు వచ్చాడు.ఈ చెట్టు మీద ఎక్కువ పావురాలు ఉన్నాయని వల విసిరి పట్టుకున్నాడు.పావురాలు ఎడుస్తున్నాయి, ఐతే చీమ ,ఎలుక,బాతు అన్ని కలిసి ప్లాన్ చేసాయి ,ఆ పావురాలను ఎలా అయినా విడిపించాలని వెంటనే అమలు చేసాయి. బాతు అరవడం మొదలు పెట్టింది వేటగాడు ఈ శబ్దం ఏంటి అని అటు వెళ్ళాడు,వెంటనే చీమ అతనిని కుట్టింది.అమ్మా నొప్పి అని విలవిల్లాడడు. ఎలుక పరుగున వెళ్లి వలను కొరికింది,పావురాలు అన్ని పారిపోయాయి.వేటగాడు వెంటనే అరవడం మొదలుపెట్టాడు .అన్ని ఎక్కడివి అక్కడకు వెళ్లిపోయాయి ఇంతలో చీమ చెరువులో పడిపోయింది పావురాలు ఒక ఆకును తుంచి నీటిలో వేసింది.చీమ ఆకుపైకి ఎక్కింది ,బాతు దానిని ఒడ్డుకు చేర్చింది.ఇలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవనం సాగించాయి. మన చుట్టు పక్కల వారితో ఎల్లవేళలా స్నేహంతో ఉండాలి ఒకరికి మంచి చేస్తే మళ్ళీ అదే తిరిగి వస్తుంది.




Comments

Popular posts from this blog

రామచిలుక కథ

చిన్న చేప కథ

అంతా మన మంచికే...