అనగనగా ఒక ఊరిలో సుబ్బయ్య అనే అతను వున్నాడు.అతను ఒక గొర్రెలకాపరి .అతనికి ఒక కొడుకు సోము ఉండేవాడు.అతను తుంటరి ,ఒకరోజు తండ్రితో పాటు గొర్రెలు మేపడనికి వెళ్ళాడు.సుబ్బయ్య మధ్యాహ్నం భోజనం చేసి ఒక చెట్టు కింద కునుకు తీయడానికి వెళ్ళాడు .వెళ్తూ వెళ్తూ ఇక్కడికి పులి వస్తుంది జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళాడు .సోము సరే అన్నాడు, కాసేపటి తర్వాత సోము తండ్రిని ఆటపట్టించడానికి పులి పులి అని అరిచాడు.వెంటనే తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు.ఎక్కడ ?ఎక్కడ? అని అంటాడు.వురికే అన్నాను నువ్వు వస్తావా లేదా అని అన్నాడు.ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ ఆలాగే అన్నాడు సోము.సుబ్బయ్య వచ్చాడు ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదు అని హెచ్చరించి వెళ్ళాడు.ఒక గంట తర్వాత నిజంగానే పులి వచ్చింది .నాన్న నాన్న అని పిలిచాడు సుబ్బయ్య మాత్రం చెట్టుకిందనుండి రాలేదు పులి వచ్చి మంద లో ఉన్న గొర్రెలను తిన్నది.సోముని గాయపరిచింది. సోము పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్నకు చెప్పి క్షమాపణ వేడుకున్నాడు.మనుషులకు ఒక్కసారి నమ్మకం పోతే దానిని తిరిగి నిలబెట్టుకోవడం చాలా కష్టం అందువల్ల నమ్మకం కోల్పోయే పనులు ఎప్పుడు చేయవద్దు. దాని వల్ల మనం కొల్పోయేది ఎక్కువగా ఉంటుంది.
ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా. అనగనగా ఒక ఊర...
Comments
Post a Comment