Posts

Showing posts with the label telugu kathalu

సజ్జన సాంగత్యం

Image
అది వర్షాకాలం గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కురు దేశంలో వున్నాడు .వర్షాల కారణంగా ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్లడం కష్టం కాబట్టి ఆ నాలుగు నెలలు అక్కడే వున్నారు.ఒకరోజు ఆనందుడు బిక్షాటనకు బయలుదేరాడు .అతను అనుకోకుండా అవంతిక అనే వేశ్య ఇంటికి బిక్షకు వెళ్ళాడు.ఆమె అతనికి భిక్ష వేసి వర్షాల కారణంగా మీరు ఇబ్బంది పడుతున్నారని విన్నాను మీకు అభ్యంతరం లేకపోతే మీరు నా ఇంట్లో ఉండొచ్చు అంది . దానికి ఆనందుడు బిక్షువులు ఎక్కడ ఉండాలో తధగతుడు నిర్ణయిస్తాడు అని వారిని అడిగి చెబుతానన్నాడు.అది విన్న బుద్దుడు ఆమెనే ఆహ్వానించినపుడు నువ్వు ఆ ఇంట్లో విడది  చేయడంలో తప్పులేదు నువ్వు అక్కడికి మకాం మార్చుకో అన్నాడు.   అలా ఆనందుడు వేశ్య ఇంటికి వెళ్ళాడు.అవంతిక చక్కటి అతిధి మర్యాదలతో స్వాగతం పలికి ఆహ్వానించింది.అతనికి చినిగిపోయిన బట్టలు చూసి కొత్తవి కుట్టించింది.ఆనందుడికి చలి నుండి రక్షణ కలిగింది.అవంతిక వేళకు అతనికి వేడి వేడి భోజనం అందిస్తూ ఆనందుడు చెప్పే హితోక్తులు శ్రద్ధగా వినేది. ఆ మాటల ప్రభావం చేత అవంతిక కొద్దిరోజుల్లోనే అతడి శిష్యురాలు అయింది .అయితే ఒక బిక్షువు వేశ్య ఇంట్లో ఉండడం తోటివార...