నమ్మకం
అనగనగా ఒక ఊరిలో సుబ్బయ్య అనే అతను వున్నాడు.అతను ఒక గొర్రెలకాపరి .అతనికి ఒక కొడుకు సోము ఉండేవాడు.అతను తుంటరి ,ఒకరోజు తండ్రితో పాటు గొర్రెలు మేపడనికి వెళ్ళాడు.సుబ్బయ్య మధ్యాహ్నం భోజనం చేసి ఒక చెట్టు కింద కునుకు తీయడానికి వెళ్ళాడు .వెళ్తూ వెళ్తూ ఇక్కడికి పులి వస్తుంది జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళాడు .సోము సరే అన్నాడు, కాసేపటి తర్వాత సోము తండ్రిని ఆటపట్టించడానికి పులి పులి అని అరిచాడు.వెంటనే తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు.ఎక్కడ ?ఎక్కడ? అని అంటాడు.వురికే అన్నాను నువ్వు వస్తావా లేదా అని అన్నాడు.ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ ఆలాగే అన్నాడు సోము.సుబ్బయ్య వచ్చాడు ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదు అని హెచ్చరించి వెళ్ళాడు.ఒక గంట తర్వాత నిజంగానే పులి వచ్చింది .నాన్న నాన్న అని పిలిచాడు సుబ్బయ్య మాత్రం చెట్టుకిందనుండి రాలేదు పులి వచ్చి మంద లో ఉన్న గొర్రెలను తిన్నది.సోముని గాయపరిచింది. సోము పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్నకు చెప్పి క్షమాపణ వేడుకున్నాడు. మనుషులకు ఒక్కసారి నమ్మకం పోతే దానిని తిరిగి నిలబెట్టుకోవడం చాలా కష్టం అందువల్ల నమ్మకం కోల్పోయే పనులు ఎప్పుడు చేయవద్దు. దాన...