ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు...

సెప్టెంబర్ 5 న భారతదేశం అంతటా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు ,ఏ రోజు ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి కనుక.
గురువు అంటే అజ్ఞానం తొలగించి జ్ఞానం అనే వెలుగులోకి నడిపే మార్గాన్ని చూపే వ్యక్తి.
అది ఎవరైనా కావచ్చు మనను మంచి వైపు నడిపించేవాడు ఎల్లప్పుడూ గురువే అయి ఉంటాడు.
సూర్యుడు లేకుండా వెలుగు లేదు, ఔషదం సేవించకుండా రోగం నశించదు అలాగే గురువు లేకుండా జ్ఞానం లభించదు అని పెద్దల మాట.
ప్రతి ఒక్కరి జీవితంలో గురువు కు అత్యంత విలువైన ప్రాముఖ్యత వుంటుది.మన తల్లిదండ్రులు మనకు జన్మ ఇస్తే గురువు పునర్జన్మ ఇస్తాడు.
ఈ సందర్భంగా ఒకచిన్న కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో స్వేచ్ఛ అని ఒక అల్లరి పిల్ల ఉండేది తన తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు అవడం వల్ల అల్లారు ముద్దుగా పెంచారు .ఆమెను పాఠశాలలో చేరిస్తే అల్లరి తగ్గుతుంది అని భావించి తల్లిదండ్రులు పాఠశాలకు పంపించారు, కానీ తీరు మారలేదు,ఆమె ఒకరోజు అటుగా వెళుతున్న గురువు పంచె ను లాగింది దాని వల్ల అతడు కింద పడిపోయారు  తలకు గాయం అయింది అది చూసి పరుగెత్తింది స్వేచ్ఛ, భయంతో వణికిపోతోంది ఆమెను చూసి గురువు చూసావా నువు చేసిన అల్లరి పని వల్ల నాకు రక్తం వస్తుంది .నేను ఇది నే తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు ఎంత బాధ పడతారు ఒకసారి ఆలోచించు అన్నారు ఆ గురువు,ఇంకోసారి ఇలా చేస్తావా అంటే లేదు అని మాట ఇచ్చింది.తరువాత అతని దగ్గరబుద్ధిగా పాఠాలు నేర్చి ప్రయోజకురాలు అయింది.
గురువు పిల్లలని దారిలో పెట్టడానికి సామ ,దాన భేద ,దండోపాయము లని ఉపయోగిస్తారు.
టీచర్స్ డే శుభాకాంక్షలు

 

Comments

Popular posts from this blog

రామచిలుక కథ

చిన్న చేప కథ

అంతా మన మంచికే...