Skip to main content

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

  ఫిబ్రవరి  21 రోజు  అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం  అని  ఎంతమందికి తెలుసు .  మాతృభాష అంటే మనము  మాట్లాడే భాష కానీ మనం ఎంతవరకు ఆ తల్లి భాషకు దగ్గరగా ఉన్నాము ఎవరికి తెలియదు, తెలిసినా కూడా దానిని పట్టించుకోరు.
  భాష అనేది భావ వ్యక్తీకరణ ప్రక్రియ , మనము మన మనసులో వున్న భావాలను ఎదుటి వారికి అర్థం అయ్యేలా చెప్పడం . ప్రపంచవ్యాప్తంగా రకరకాల భాషలు అందుబాటులో ఉన్నాయి ఓ ఇంగ్లీష్ అనే భాష ప్రపంచ భాషగా ప్రసిద్ధి చెందింది
ఇంగ్లీష్ , హిందీ , తర్వాత అత్యధిక సంఖ్యలో మాట్లాడే భాష తెలుగు .
మాతృభాషలో మాట్లాడితే వచ్చే ఆనందం గురించి ఒక చిన్న ఉదాహరణ.
మా అమ్మమ్మ తాత వాళ్ళు మహారాష్ట్రలో రైల్వే ఉద్యోగం చేసేవాళ్ళు  ప్రతి సంవత్సరం సెలవులకు నేను అక్కడికి వెళ్లేదాన్ని .అక్కడ మార్కెట్ కి గాని, గుడికి గానీ వెళ్ళినప్పుడు అక్కడ మన భాష మాట్లాడే వాళ్ళు ఒక్కరు కనిపించినా మనకు చాలా సంతోషంగా దగ్గరకు వెళ్ళి కొద్ది సేపు మాట్లాడి వచ్చేది.నిజంగా వేరే ప్రాంతానికి వెళ్లినపుడు మన బాషలో మాట్లాడితే ఆ ఆనందమే వేరు. మాతృభాష ప్రతి చిన్న భావాన్ని చాలా స్పష్టంగా వ్యక్తపరచగలిగే సాధనం.
ప్రతి ఒక్కరు తమ మాతృ భాష ఏమిటో తెలుసుకోవాలి,దానిలోనే మాట్లాడడానికి ప్రయత్నించాలి ,  ఇతరులను ప్రోత్సహించాలి.
ఉదాహరణకు ఇంగ్లీషు లాంటి భాషలు కేవలం అఫిషియల్ గా సంప్రదింపులు జరపడానికి మాత్రమే కానీ ఆ ధ్యాసలో మన మాతృభాషను మరవద్దు.
ప్రతి భాషకు ఒక ప్రత్యేకమైన లిపి , దానికి ఒక చరిత్ర ,పరిణామ క్రమం ఉంటాయి . ఏ భాషను చిన్న చూపు చూడొద్దు.కొందరైతే ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్పవాళ్ళుగా భావింపబడతారు అని వాళ్ళ నిజమైన భాష పక్కన పెట్టీ మాట్లాడతారు.
ప్రపంచవ్యాప్తంగా మాతృభాష దినోత్సవం జరుపుకోవడానికి గల కారణాలు తెలుసుకుందాం. భారతదేశం , పాకిస్థాన్ విభజన తర్వాత తూర్పు పాకిస్థాన్  , పశ్చిమ పాకిస్థాన్ గా పాకిస్థాన్ ఆవిర్భావం జరిగింది. పాకిస్థాన్ ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించింది. తూర్పు పాకిస్థాన్ లో బెంగాలీలు ఎక్కువగా ఉన్నారు వారు  ఉర్దూతో పాటు  బెంగాలీని జాతీయ భాషగా చేయమని అన్నారు పాకిస్థాన్ వినలేదు అది మెల్లగా భాషా ఉద్యమంగా తయారు అయింది.  తూర్పు పాకిస్థాన్ కు చెందిన ధీరేంద్ర నాథ్ దత్త ఈ విషయాన్ని పార్లమెంట్ లో లేవనెత్తారు. ఫిబ్రవరి 21 న ఉద్యమంలో పాల్గొన్న వారిపై కాల్పులు జరిపారు.వందలాది మంది గాయపడ్డారు. తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి  బెంగాలీని జాతీయ భాషగా ప్రకటించింది.ఈ ఘటన భాష ప్రేమికులందరిని తీవ్రంగా కలచి వేసింది దానికోసం ఐక్యరాజ్య సమితిలో కూడా తీర్మానం ప్రవేశ పెట్టారు. యునెస్కో ఫిబ్రవరి 21 నీ అంతర్జాతీయ  మాతృబాషా దినోత్సవంగా ప్రకటించింది.దీని వల్ల చిన్న చిన్న భాషల అభివృద్ధికి మరియు నిర్లక్ష్యంకి గురి అవకుండా కాపాడుకోవచ్చు .
ప్రతి ఒక్కరు తమ మాతృభాషను నిర్లక్ష్యం చేయకుండా , దాని అభివృద్ధికి కృషి చేయాలి.
నా మాతృభాష తెలుగు నేను సాధ్యమైనంత వరకు తెలుగులోనే మాట్లాడటానికి ప్రయత్నిస్తాను . మీరు కూడా మీ మాతృభాష ఏంటో తెలుసుకునీ మీరు మాట్లాడండి.






 


.


Comments

Post a Comment

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .