శ్రీనివాస కళ్యాణం
కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి భక్తులు దూర ప్రాంతాలనుండి ఎన్నో వ్యయ ప్రయాసలను ఓర్చుకొని వస్తారు. ఆనందనిలయంలో ఉన్న ఆ శ్రీనివాసుడి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించినంతనే ఎంతో ఆనందం కలుగుతుందని అంటారు.ఇది నిజంగా అనుభూతి చెందిన వారికే అనిపిస్తుంది. ఈ రోజు మన కథ శ్రీ వెంకటేశ్వర స్వామి కథ ,ఎన్నో కథలు గాథలు ఉన్నాయి కానీ అందులో ఒకటి మీకోసం . ఒకనాడు మహర్షులు అందరూ కలసి లోకకళ్యాణం కొరకు యజ్ఞం చేయాలని భావించారు ఆ యజ్ఞానికి ముఖ్య అతిథిగా త్రిమూర్తులలో ఒకరిని పిలవాలని అనుకున్నారు . ఎవరు గొప్ప అయితే వారిని పిలవాలని అనుకున్నారు.ఈ ఎవరు గొప్ప అని నిర్ణయం చేయవలసిందిగా బృగు మహర్షిని పంపారు.మొదట బృగు మహర్షి సత్య లోకానికి వెళ్ళారు అక్కడ బ్రహ్మ దేవుడు సరస్వతి మాత వీణ వాయిస్తుండగా అతను లీనమై పోయాడు. ఆశ్చర్యం అసలు బ్రహ్మ బృగు మహర్షి రాకను గమనించలేదు దానికి ఆ మహర్షి కోపంతో నీకు భూలోకంలో ఆలయాలు ఉండవని శపించాడు. బ్రహ్మ దేవుడు బాధ పడ్డాడు అందుకే బ్రహ్మ దేవుడికి గుడులు చాలా తక్కువ ఉంటాయి. కైలాసానికి బయలుదేరాడు ఈ సారి ఏం జరుగుతుందో చూద్దాం .కైలాసంలో శివపార్వతులు ఇద్దరూ నాట...