Skip to main content

Posts

Showing posts with the label నీతి కథలు

దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు – విద్య విలువ తెలిపే నీతి కథ

దొరలు దోచలేరు, దొంగలెత్తుక పోరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనమ్మురా లలిత సుగుణజాల! తెలుగు బాల.        పైన పేర్కొన్న ఈ పద్యం తాత్పర్యం ఏమిటో తెలుసా? దొరలు దోచుకోలేరు మరియు దొంగలు కూడా ఎత్తుకొనిపోలేనిది ,మన సోదరుల మధ్య పంపకాలలో పంచుకోలేనటువంటిది ఏమిటో తెలుసా విద్య .మన చదువును జ్ఞానాన్ని మన నుండి ఎవరూ వేరు చేయలేరు. మనం ఉన్నంత కాలం మనతోనే ఉంటుంది మనం నేర్చుకున్న ఙ్ఞానం. మీకు ఈ విషయం ఇంకా  వివరంగా ఒక కథ  ద్వారా చెప్తాను వినండి.    అనగనగా ఒక ఊరిలో ప్రసన్నవర్మ అనే పండితుడు ఉండేవాడు అతడు పేరుకు తగ్గట్టే చాలా ప్రసన్నంగా ఉంటాడు.అతడు వేద వేదాంగాలు చదివిన మహా పండితుడు.అతడికి రవివర్మ అనే కొడుకు ఉండేవాడు. మనకు బాగా తెలిసిన లోకోక్తి  ప్రకారం  "పండిత పుత్ర పరమ శుంఠ" అన్నట్లు రవివర్మకు చదువు వంట బట్టలేదు.ఎంత చెప్పినా చదివి ఎవరిని ఉద్దరించాలి ఏదైనా పని చేసుకొని బ్రతుకుతాను లే అని సోమరి పోతు లాగ ఉండేవాడు. ఒకరోజు ప్రసన్న వర్మ ప్రవచనాలకు వెళ్ళాడు అక్కడ మంచిగా ప్రవచనాలు చెప్పిన తర్వాత అతడిని కొందరు ఓర్వలేక మీ పుత్రుడికీ ప్రవచనాల...