లాభమా? -నష్టమా?
అనగనగా ఒక పెద్ద అడవి దాని పేరు సుందరవనము.అది అతి సుందరంగా వుండడం చేతదానిని సుందరవనము అంటారు.ప్రతి అడవికి రాజు సింహమే కదా ఇక్కడ కూడా సింహమే రాజు ,కుందేలు మాత్రం మంత్రి . అడవిలో అన్నీ జంతువులు చాలా సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి.ఒకరోజు సింహం వేటకు వెళ్ళింది అక్క కొన్ని వృద్ధ జంతువులు కూర్చొని తమ తమ సమస్యల గురుంచి మాట్లాడుకుంటున్నాయి. దూరం నుంచి ఆ మాటలు వింటుంది సింహం వారికి కనపడకుండా .ఆ జంతువులు మనము ఇప్పుడు ముసలి వాళ్ళము మనకు వేటాడే శక్తి లేదు కాబట్టి మన పిల్లలను బాధ పెట్టకుండా మనలో మనం ఆహారం ఐపోయి చనిపోదాం అని అంటున్నాయి.ఆ మాట విన్న సింహం కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సింహం తన స్థావరనికి వచ్చి కుందేలును పిలిచి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది .జంతువులు అన్ని భయం భయంగా వచ్చాయి.అప్పుడు అక్కడ ఉన్న జంతువులను ఉద్దేశించి మన అడవిలో ఎవరికైనా అత్యవసరంగా సాయం చేయవలసి ఉందా అని అడిగింది, అన్ని ఆలోచించసాగాయి.కుందేలు టక్కున లేచి సాయం కోసం ఎదురు చూసేది కేవలం వృద్ధ ప్రాణులే అంది కుందేలు.ఐతే మీరందరు వృద్ధ జంతువుల సంరక్షణ కోసం సలహాలు,సూచనలు చేయవలసిందిగా ఆదేశించింది. రాజా మన...