మీకు ఎప్పుడూ చెప్పినా మహాభారతం లోని కథలే చెప్పాలి అనిపిస్తుంది ఎందుకంటే మహాభారతంలో లేనిది లోకంలో లేదు లోకంలో లేనిది ఏది మహాభారతంలో ఉండదు అని ఒక సామెత. ఒకప్పుడు హస్తినాపురానికి దగ్గరలో ఉన్న అడవిలో హిరణ్యధనుస్సు అనే గిరిజన రాజు నివసించేవాడు. అతనికి ఏకలవ్యుడు అనే కుమారుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచే ఏకలవ్యుడికి విలువిద్య అంటే ఎంతో ఇష్టం. అతను ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధారి కావాలని కలలు కనేవాడు. ఆ కాలంలో విలువిద్యలో అత్యంత ప్రఖ్యాత గురువు ద్రోణాచార్యుడు. ఆయన వద్దే కౌరవులు, పాండవులు విద్యలు నేర్చుకుంటుండేవారు. ఒకరోజు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లి నమస్కరించి, “గురువర్యా! నాకు కూడా విలువిద్య నేర్పించండి” అని వినయంగా అడిగాడు. ద్రోణాచార్యుడు అతని వేషధారణ చూసి, “నేను రాజకుమారులకు మాత్రమే విద్య నేర్పుతాను” అని చెప్పి తిరస్కరించాడు. ఆ మాటలు విన్న ఏకలవ్యుడు చాలా బాధపడ్డాడు. కానీ తన కలను వదలలేదు. అడవికి తిరిగి వెళ్లి మట్టితో ద్రోణాచార్యుడి విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని గురువుగా భావించి ప్రతిరోజూ వారికి నేర్పించేటపుడు చూసి సాధన చేయసాగాడు. అతను ఉదయం నుంచి స...
“చిన్న నీతి కథలు” బ్లాగ్లో పిల్లల కోసం సరదాగా చదవడానికి తెలుగు నీతి కథలు, జంతువుల కథలు, స్నేహం కథలు మరియు ప్రేరణాత్మక కథలు అందుబాటులో ఉంటాయి. ప్రతి కథలో ఒక మంచి నీతి ఉంటుంది, ఇది పిల్లలకి మంచి అలవాట్లు నేర్పుతుంది. Discover the best Telugu moral stories, short stories for kids, and inspirational stories in Telugu.