ఆదిశక్తి....
" యత్ర నార్యస్తు పూజ్యతే తత్ర రమంత దేవతా " అన్నారు పెద్దలు ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని ప్రతీతి.గౌరీశంకరులు అది దంపతులు వారు మానవాళికి ఆదర్శ దంపతులు. స్త్రీ ,పురుషులు ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ,గౌరవం, ప్రేమ ఉండాలి.నారాయణుడు లక్ష్మీదేవిని, శివుడు పార్వతిని, బ్రహ్మ సరస్వతిని గౌరవించారు అదే గౌరవం సమాజంలో స్త్రీల పట్ల ఉండాలి అని పురాణాలు చాటి చెప్పాయి.ఎక్కడో ఉన్న గుడిలోని దేవతమూర్తికి వంగి వంగి దండాలు పెడతాం ,అమ్మా కాపాడు అని ప్రార్దిస్తాం కానీ ఇంట్లో ఉన్న లక్ష్మీ ,సరస్వతి, పార్వతిని మాత్రం చులకనగా చూస్తాం.స్త్రీలు అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోతున్నారు.స్త్రీల యొక్క ప్రయాణం ఎన్నో అవరోధాలను కలిగి ఉంటుంది.అయినా వారు అన్ని ఆటంకాలను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతారు.ప్రయాణం ముఖ్యం కాదు గమ్యస్థాననికి చేరుకోవడం ప్రధానం అంటారు పెద్దలు.స్త్రీల పట్ల దయ ,జాలి ,కరుణ ఉండాల్సిన అవసరం లేదు కానీ వారి హక్కులను నియంత్రించకుండా ఉంటే సరిపోతుంది.కాలం మారింది కానీ సనాతన సంప్రదాయాలు,కట్టుబాట్లు కొన్ని మారడం లేదు.అరవింద సమేత సినిమా లో ఆడవాళ్లకు రాజకీయలా...