Posts

Showing posts with the label chinna kathalu

శ్రీకృష్ణ రాయబారం .

Image
మహాభారతంలో అన్ని కథలు మనకు చాలా దగ్గరగా ఉంటాయి అని గతంలో చెప్పుకున్నట్లే ఈ శ్రీకృష్ణ రాయబారం కూడా అలాంటిదే. రాయబారం అంటే ఒకరి తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడడం కాదు ఇరువురి మధ్య ఉన్న సమస్య గురించి లోతైన అవగాహన ఉండాలి.సమస్య తెలిస్తేనే కదా ! దారి తెలుస్తుంది.మహాభారతం ఒక కథ మాత్రమే కాదు మనందరి జీవితాలకు ఒక అర్థవంతమైన పుస్తకం. పాండవులను కౌరవులు అడుగడుగునా హింసిస్తున్నా కూడా చెక్కు చెదరకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళుతున్నారు.ఈ క్రమంలో వారు కొత్తగా నిర్మించిన ఇంద్రప్రస్తాన్ని చూడడానికి ఒకరోజు దుర్యోధనుడు వెళ్తాడు అతను ఆ భవనాన్ని చూసి చాలా ఆశ్చర్యం పొందాడు,దానితో అసూయ చెందాడు.ఎలాగైనా ఇంద్రప్రస్తాన్ని కూడా చేజిక్కించుకోవాలి అని పన్నాగాలు పన్నాడు.శకుని మామ సహాయంతో మాయ పాచికలు తయారు చేసాడు.ధర్మరాజు జూదానికి బానిస కాదు కాని అతనికి జూదం అంటే ప్రాణం.   ధర్మరాజును కౌరవులు జూదానికి ఆహ్వానించారు ,వారి మనస్తత్వం తెలిసి కూడా ధర్మరాజు ఒప్పుకున్నాడు.వారు ఆహ్వానించనందువల్ల మనం వెళ్ళాలి అని అందరిని కూడా గట్టుకొని హస్తీనాపురానికి వచ్చాడు.శకుని తన చాకచక్యంతో పండిత పామర జనాలను మభ్య పెడుతూ ధర...

కచుడు -దేవయాని కథ..

Image
మా కళాశాలలో తెలుగు ఉపాధ్యాయుడు పాఠం చెప్తూ మహాభారతంలో లేనిది లోకం లో లేదు లోకంలో ఉన్నది అంత మహాభారతంలో  ఉంటుంది అన్నారు కానీ నాకు అర్థం కాలేదు .కానీ నిజంగా ఒక్కొక్క కథ చదువుతుంటే అప్పుడప్పుడు నిజమే అనిపిస్తుంది. ఈ కథ మహాభారతంలో ఒక ప్రేమకథ, కానీ ఇద్దరు ప్రేమించుకోలేదు ఒక్కరు మాత్రమే ప్రేమించారు ,అసలు ఏంటో ఈ కథ తెలుసుకుందాం.             హిందూ పురాణాల ప్రకారం దేవతలకు,రాక్షసులకు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో దేవతలు రాక్షసులని ఎంతమందిని చంపినా రాక్షసులు చనిపోకుండా  మళ్ళీ మృత సంజీవని విద్య ద్వారా  బ్రతుకుతున్నారు.ఈ విద్య కేవలం రాక్షసుల గురువైన శుక్రాచార్యుడుకి మాత్రమే తెలుసు. దేవతలు అంతా కూర్చొని ఆలోచించసాగారు.      దేవతల గురువు బృహస్పతి అతని కుమారుడు కచుడు, దేవతలు అందరూ కచుడిని శుక్రాచార్యుడి  దగ్గరకు శిష్యరికానికి పంపించారు. కచుడు శుక్రాచార్యుడికి జరిగిన విషయం చెప్పి అతని దగ్గర శిష్యుడిగా చేరాడు .కచుడు మంచి ప్రవర్తనతో అతని మనసు గెలుచుకున్నాడు, శిష్యులందరిలో ఉత్తముడిగా పేరు సంపాదించాడు. శుక్రాచార్యుడుకి దేవయాని...

పులి-బాటసారి కథ

Image
పంచతంత్ర కథలు చాలా గొప్ప నీతిని కలిగి ఉంటాయి, వీటిని విష్ణుశర్మ గారు రచించారు.అందులో ఒకటి పులి -బాటసారి కథ . అనగనగా ఒక ఊరు, ఆ ఊరికి అవతల చెరువు ఒడ్డుకు ఒక పులి నివాసం ఉంది అది చాలా ముసలి పులి.అయితే దాని దగ్గర ఒక బంగారు కంకణం ఉంది .ఒకరోజు అటుగా వెళుతున్న బాటసారిని చూసి దగ్గరగా వెళ్లి ఓ బ్రహ్మణోత్తమా!నువు చూడడానికి చాలా పుణ్యాత్ముడి లాగా కనిపిస్తున్నావు.నా దగ్గర ఒక బంగారు కంకణం ఉంది దీనిని నేను ఎవరైనా పుణ్యాత్ముడికి దానం చేయాలని ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నా.నువ్వు కనిపించావు ఇదిగో  ఒకసారి ఆ చెరువులో స్నానం చేసి వచ్చి ఈ  కంకణం తీసుకో అన్నది పులి .      సరే కానీ నువ్వు క్రూర జంతువువు నేను నిన్ను ఎలా నమ్మాలి అని భయంతో కూడిన ధైర్యంతో ప్రశ్నించాడు. దానికి ఆ ముసలి పులి చూడు నాయనా నన్ను చూస్తే కనబడుత లేదా నేను ఎంత ముసలి దానినో, నా గోర్లు అన్ని మొద్దుబారినవి ,పళ్ళు మొత్తం ఉడిపోయినవి చేతులు కాళ్లు లేవడం లేదు ఎన్నో రోజుల నుండి చాలా మంది ప్రాణాలు తీసిన తప్పుకు పరిహారంగా ఈ దానం చేద్దాం అనుకుంటున్నా అన్నది పులి.పులి చాలా నమ్మకంగా చెప్పే సరికి అతను స్నానం చేయడానికి చెరువులోకి ద...

చెడపకురా చెడేవు.....

Image
రామకృష్ణాపురంలో సాంబయ్య అనే రైతు ఉండేవాడు అతను చాలా కష్టపడి పని చేసేవాడు .అతనికి  నలుగురు కొడుకులు రంగయ్య,రాజయ్య,రుద్రయ్య మరియు రాఘవయ్య.రాజయ్య, రంగయ్య, రుద్రయ్య బాగా తెలివినవాళ్ళు,రాఘవయ్య పాపం వట్టి అమాయకుడు.ఎవరు ఏమి చెప్పిన నమ్ముతాడు.రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలకు పెళ్లిళ్లు చేసాడు సాంబయ్య. అతని దిగులు అంత చిన్న కొడుకు గురించే, అతని అమాయకత్వానికి ఎవరూ పిల్లను ఎవరు ఇవ్వలేదు.అలాగే ఉండిపోయాడు.కొన్ని రోజులకు సాంబయ్యకు జబ్బు చేసింది రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలు వారి పిల్లలను భార్యలను చూసుకుంటూ సాంబయ్యను పట్టించుకునేవారు కాదు.రాఘవయ్య తండ్రిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు .పూర్తిగా అతని ఆరోగ్యం క్షీణించి అతను చనిపోయాడు.అతను చనిపోయాక అన్ని కార్యక్రమాలు ముగిసిన తరువాత లాయరు వీలునామా తెచ్చి ఇచ్చాడు ఆస్థులన్ని సమంగా పంచుకోవడానికి.సాంబయ్య వీలునామాలో రాఘవయ్యకు కొంచెం ఎక్కువగా ఆస్తి రాసాడు అది చూసి మిగిలిన అన్నలు ఓర్వలేక ఇది మేము చూసుకుంటాం అని లాయరును పంపించి వేశారు. రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలు మంచి తరి పొలాన్ని తీసుకొని ఊరు అవతల పనికిరాని మెట్టభూమి ఇచ్చారు.ఇంకా అతని దగ్గర ఒక కుంటి పిల్ల...