Posts

Showing posts with the label pancha tantra kathalu

పీత-కొంగ కథ .🦀🦢.

Image
ఈ రోజు పంచతంత్రం కథలలో పీత-కొంగ   కథ తెలుసుకుందాం. అనగనగా ఒక కొలను ఆ కొలనులో ఒక పీత నివాసం ఉంటుంది. ఒకసారి ఆ కొలను దగ్గరకు ఒక కొంగ వచ్చింది.అది ఆ కొలనులో దిగి ఒంటి కాలు మీద తపస్సు చేస్తున్నట్టు నటించుతుంది రోజు ! అది రోజూ పీత, కొలనులో చేపలు చూస్తున్నాయి.అయితే ఆ చేపలు కానీ పీత కానీ కొంగది దొంగ జపం అని గుర్తించ లేకపోయినాయి.ఒకరోజు పీత కొంగ దగ్గరకు వచ్చి మహాత్మా! ఇక్కడ ఇన్ని చేపలు మీ కళ్ళ ముందు తిరుగుతున్న కూడా మీరు వాటిని పట్టి తినకుండా ఇలా జపం చేసుకుంటున్నారు దీనికి కారణం ఏమిటి అన్నది. అప్పుడు ఆ కొంగ మరింత ధ్యానంలో ఉన్నట్టు నటించింది.కొంగగారు మిమ్మల్ని నేను అడుగుతున్న అయిన సమాధానం చెప్పడం లేదు కారణం ఏమైనా ఉందా అని అడిగింది మళ్లి పీత. కొంగ మెల్లిగా కళ్ళు తెరిచి మీరు భక్తి శ్రద్ధలతో అడిగారు కాబట్టి చెబుతున్న విను,నువ్వు చెప్పినట్టు ఆ మధ్యదాక  నేను కూడా చేపలనే కాదు భగవంతుడు మాకు ఇచ్చిన నేను తినదగిన అన్ని జంతువులను తినేవాడిని.ఆ మధ్య కాలంలో నేను నివసించే చెట్టు కిందకు ఒక యోగి వచ్చాడు.ఆయనతో చాలా మంది శిష్యులు కూడా ఉన్నారు.ఆ శిష్యులకు ఉపదేశం చేసేటపుడు నేను ఆ చెట్టు పైన...

పులి-బాటసారి కథ

Image
పంచతంత్ర కథలు చాలా గొప్ప నీతిని కలిగి ఉంటాయి, వీటిని విష్ణుశర్మ గారు రచించారు.అందులో ఒకటి పులి -బాటసారి కథ . అనగనగా ఒక ఊరు, ఆ ఊరికి అవతల చెరువు ఒడ్డుకు ఒక పులి నివాసం ఉంది అది చాలా ముసలి పులి.అయితే దాని దగ్గర ఒక బంగారు కంకణం ఉంది .ఒకరోజు అటుగా వెళుతున్న బాటసారిని చూసి దగ్గరగా వెళ్లి ఓ బ్రహ్మణోత్తమా!నువు చూడడానికి చాలా పుణ్యాత్ముడి లాగా కనిపిస్తున్నావు.నా దగ్గర ఒక బంగారు కంకణం ఉంది దీనిని నేను ఎవరైనా పుణ్యాత్ముడికి దానం చేయాలని ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నా.నువ్వు కనిపించావు ఇదిగో  ఒకసారి ఆ చెరువులో స్నానం చేసి వచ్చి ఈ  కంకణం తీసుకో అన్నది పులి .      సరే కానీ నువ్వు క్రూర జంతువువు నేను నిన్ను ఎలా నమ్మాలి అని భయంతో కూడిన ధైర్యంతో ప్రశ్నించాడు. దానికి ఆ ముసలి పులి చూడు నాయనా నన్ను చూస్తే కనబడుత లేదా నేను ఎంత ముసలి దానినో, నా గోర్లు అన్ని మొద్దుబారినవి ,పళ్ళు మొత్తం ఉడిపోయినవి చేతులు కాళ్లు లేవడం లేదు ఎన్నో రోజుల నుండి చాలా మంది ప్రాణాలు తీసిన తప్పుకు పరిహారంగా ఈ దానం చేద్దాం అనుకుంటున్నా అన్నది పులి.పులి చాలా నమ్మకంగా చెప్పే సరికి అతను స్నానం చేయడానికి చెరువులోకి ద...