Posts

Showing posts with the label సమ్మక్క సారక్క జాతర

సమ్మక్క - సారలమ్మ జాతర

Image
  తెలంగాణ కుంభమేళా  ప్రస్తుతం తెలంగాణలో ఎవరి నోటా విన్నా ఒకటే మాట ,దారులన్నీ ఒకటే బాట అదే మన  సమ్మక్క సారక్క జాతర  . సమ్మక్క సారక్క జాతర రెండేళ్ళ ఒకసారి వస్తుంది మాఘమాసంలో పౌర్ణమి కి నాలుగు రోజుల ముందు అవుతుంది .ఈ జాతరలో నడిపించేది అంత ఒగ్గు పూజారులు .వాళ్ళే చేయాల్సిన అన్ని కార్యక్రమాలు చేస్తారు.4 రోజుల జాతర.  బెల్లమే బంగారగా  సమర్పించి  ఇక్కడ  అమ్మవారిని   కొలుస్తూ  ఉంటారు  ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు సామూహిక భక్తికి ప్రతీక .ఈ సమ్మక్క సారలమ్మ జాతరలో వెదురు కర్రలు,కుంకుమ బరినలు వనదేవతల ప్రతిరూపాలు.పెద్ద హంగు ఆర్భాటాలు లేని గోపురం గోడలు లేని గుడి మన సమ్మక్క సారలమ్మ లది.ఆదివాసీల విశ్వాసాల ఆలంబనగా వర్ధిల్లుతుంది ఈ జాతర.పెద్ద నైవేద్యం కూడా లేదు బెల్లం కేవలం బెల్లం మాత్రమే ప్రసాదంగా అదే బంగారగా , నిలువెత్తు బరువుగా ఇక్కడ అమ్మవార్లకు సమర్పిస్తారు.   జాతరలో మొదటిగా కన్నెపల్లి నుండి సారలమ్మ వస్తుంది,తర్వాత పులిగొండ్ల నుండి పగిడిద్దరాజు,కొండాయి నుండి గోవిందరాజుల  ప్రతిరూపాలు...