మనుషులు -రకాలు
మనుషులు మూడు రకాలుగా ఉంటారు . మొదటి రకం ఏ పనినైనా గొప్పగా ప్రారంభిస్తారు పది మందికి చెప్పుకుంటారు.ఏ ఉత్సాహంతో మొదలు పెట్టారో అదే ఉత్సాహాన్ని చివరిదాకా కొనసాగించరు.మొదలు పెట్టిన పనిని మధ్యలోనే వదిలేస్తారు. రెండవరకం పని మొదలు పెట్టడానికి ముందే వంద ఆలోచిస్తారు అవుతాదా?లేదా? అవకపోతే ఎలా ఎం చేయాలి అని రకరకాలుగా ఆలోచించి సమయం వృధా చేస్తారు.మొత్తానికి పని మొదలు పెట్టరు. మూడవ రకం పని చిన్నదా ?పెద్దదా? అని ఆలోచించరు ఏ పని అయిన వీళ్ళ చేతిలో పడిందంటే పూర్తి కావాల్సిందే.పూర్తి చేసేదాక వదిలి పెట్టరు. కానీ అదే పనిని సంవత్సరాల తరబడి అయినా చాలా ఓపికగా చేస్తారు చివరకు విజయాన్ని సాధిస్తారు. ఒక పని ఆరంభించినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వెనకడుగు వేయరాదు .లక్ష్యాన్ని చేరుకునే దాకా అహర్నిశలు కష్టపడాలి. ఈ సాధనలో కఠోర దీక్ష , అంతులేని శ్రమ,దుఃఖము, త్యాగము అన్ని ఇమిడి ఉంటాయి. అలాంటి కొన్ని పురాణ కథలను మనం తెలుసుకుందాం. వాయి పుత్రుడు హనుమాన్ ,అతను అత్యంత బలశాలి అతనికి గురువు ఎవరో తెలుసా సూర్యుడు. చిన్నతనంలోనే ...