Skip to main content

రుక్మయ్య-వడ్డీ..

అనగనగా అవంతిపురం అనే రాజ్యం ఉంది ఆ రాజ్యానికి రాజు సులోచనడు.సులోచనడు అంటే మంచి ఆలోచనలు కలిగిన వాడు అని అర్థం .ఆ రాజ్యంలో రుక్మయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు అతను నగలు తాకట్టు పెట్టుకొని సొమ్ము ఇచ్చేవాడు,కానీ ఎక్కువ వడ్డీ లాగేవాడు.కలలో కూడా వడ్డీ వడ్డీ అని ఆలోచించేవాడు. సులోచనడు అతనిని చాలా సార్లు మందలించాడు. అయిన అతని పద్దతి మార్చుకోలేదు. రుక్మయ్య దగ్గరికి చెన్నయ్య దంపతులు వచ్చారు వారి కూతురి వివాహం కోసం సొమ్ము అవసరం అయ్యింది. చెన్నయ్య దంపతులు వారి దగ్గర ఉన్న బంగారాన్ని ఇచ్చి ధనాన్ని తీసుకెళ్లారు అందరికంటే నీకు తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తాను అనేసరికి నోటు రాసుకోలేదు.చెన్నయ్య దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు , కూతురి వివాహం జరిగిపోయింది.
     కొన్ని రోజుల తరువాత చెన్నయ్య దంపతులు పంట అమ్ముడుపోగా మిగిలిన ధనాన్ని ,దాచి ఉంచారు .అలా కూడబెట్టిన ధనాన్ని తీసుకొని పోయి రుక్మయ్య దగ్గరకు వెళ్లారు ,ఆయన నువ్వు నా దగ్గర ఎప్పుడు తాకట్టు పెట్టవు ? నేను నీకు ఎప్పుడు డబ్బులు ఇచ్చాను అని అన్నాడు.చెన్నయ్య దంపతులు కంగారుపడి తర్వాత తేరుకొని అలా మాట్లాడతారు ఏంటి రుక్మయ్య గారు మేము మా కూతురి వివాహం కోసం డబ్బు తీసుకున్నాం కదా ! మా నగలు మాకు ఇవ్వండి అని అన్నారు. రుక్మయ్య కావాలనే నగలు కొట్టేయడానికి నోటు రాసుకోకుండా తక్కువ వడ్డీకి ఇచ్చాడు.ఈ పంచాయితీ రాజు గారి దగ్గరకు వచ్చింది, రాజు గారు బాగా ఆలోచించి రేపు పొద్దున్న రండి అని పంపించాడు.మరుసటిరోజు తెల్లారేసరికి ఇద్దరు వచ్చి  సభలో వున్నారు .అందరూ చూస్తుండగా రాజు రెండు కుండలను తెప్పించాడు వాటికి చుట్టూ గుడ్డ  కట్టి ఉంది.ఇందులో పాలు ఉన్నాయి ,ఇవి ఇంటికి తీసుకొని వెళ్ళండి రేపు తీసుకొని రావాలి ఎవరైతే అబద్దం అడతారో వారి పాలు నీళ్ల లాగా మారిపోతాయి అని చెప్పాడు రాజు సులోచనడు.రుక్మయ్య ,చెన్నయ్య దంపతులు వాటిని తీసికొని ఇంటికి వెళ్లారు.చెన్నయ్య వాళ్ళు దానిని అక్కడే పెట్టారు .రుక్మయ్య పొద్దున తెరిచి చూసాడు దానిలో నీళ్లు ఉన్నాయి ,నిజంగానే పాలు నీళ్లు ఐపోయాయి అని అనుకోని దానిలో పాలు వేసాడు.ఇద్దరు వారి వారి కుండలను తీసుకొని వచ్చారు .భటులు వచ్చి రెండింటి మూతలు తెరిచారు ,ఒకదానితో పాలు ఇంకో దానిలో నీళ్లు ఉన్నాయి.రుక్మయ్య చాలా సంతోషంగా చూడండి మహారాజా!ఆ చెన్నయ్య తెచ్చిన కుండలో  నీళ్లు ఉన్నాయి అన్నాడు.సులోచనడు వెంటనే నవ్వి,దొంగ దొరికాడు అన్నాడు.అవును మహారాజా అవును,ఈ చెన్నయ్య దంపతులు దొంగలు అబద్దం చెప్తున్నారు.భటులారా రండి ఈ రుక్మయ్యని బంధించండి అన్నాడు రాజు సులోచనడు. అందరూ అయోమయంలో ఉన్నారు. నేను రెండు కుండలలో కేవలం నీటిని నింపాను నువ్వు దొంగతనం చేశావు కనుక భయపడి అందులో పాలు పోసావు అన్నాడు రుక్మయ్య ఖంగుతున్నాడు నిజం ఒప్పుకున్నాడు. చెన్నయ్య దంపతులు సంతోషించి రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.అబద్ధం ఎప్పుడైనా తప్పే ఎవరినైనా మోసం చేయాలని చూస్తే దాని వల్ల మనకే సమస్య ఎదురవుతుంది.ఎల్లవేళలా నిజం చెప్పాలి అదే మమ్మల్ని కాపాడుతుంది.




Comments

Post a Comment

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .