లాభమా? -నష్టమా?

అనగనగా ఒక పెద్ద అడవి దాని పేరు సుందరవనము.అది అతి సుందరంగా వుండడం చేతదానిని సుందరవనము అంటారు.ప్రతి అడవికి రాజు సింహమే కదా ఇక్కడ కూడా సింహమే రాజు ,కుందేలు మాత్రం మంత్రి . అడవిలో అన్నీ జంతువులు చాలా సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి.ఒకరోజు సింహం వేటకు వెళ్ళింది అక్క కొన్ని వృద్ధ జంతువులు కూర్చొని తమ తమ సమస్యల గురుంచి మాట్లాడుకుంటున్నాయి.
       దూరం నుంచి ఆ మాటలు వింటుంది సింహం వారికి కనపడకుండా .ఆ జంతువులు మనము ఇప్పుడు ముసలి వాళ్ళము మనకు వేటాడే శక్తి లేదు కాబట్టి మన పిల్లలను బాధ పెట్టకుండా మనలో మనం ఆహారం ఐపోయి చనిపోదాం అని అంటున్నాయి.ఆ మాట విన్న సింహం కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
సింహం తన స్థావరనికి వచ్చి కుందేలును పిలిచి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది .జంతువులు అన్ని భయం భయంగా వచ్చాయి.అప్పుడు అక్కడ ఉన్న జంతువులను ఉద్దేశించి మన అడవిలో ఎవరికైనా అత్యవసరంగా సాయం చేయవలసి ఉందా అని అడిగింది, అన్ని ఆలోచించసాగాయి.కుందేలు టక్కున లేచి సాయం కోసం ఎదురు చూసేది కేవలం వృద్ధ ప్రాణులే అంది కుందేలు.ఐతే మీరందరు వృద్ధ జంతువుల సంరక్షణ కోసం సలహాలు,సూచనలు చేయవలసిందిగా ఆదేశించింది.
రాజా మనం తెచ్చుకునే ఆహారంలో కొంత భాగాన్ని ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అన్నది కుందేలు.అలా ఎలా కుదురుతుంది అని అన్నది నక్క మృగరాజుకు కోపం వచ్చింది ,అది గమనించిన చిరుత అవి మనలాగా పరుగెత్తలేక పోవచ్చు కానీ ఆరుస్తూ  వేటగాళ్ల బారి నుండి జింక పిల్లలను కాపాడడం నేను చూసాను అన్నది.
ఒక కొండముచ్చు నేను ఆహారం కోసం వెళ్ళినపుడు నా పిల్లలను డేగ నుండి రక్షించిది.పిల్లలను జాగ్రత్తగా చూస్తాయి అని అంది ఉడుత.ఇది మాకు కలిగిన ఉపకారమే కదా అన్నాయి.
అవును కేసరి గారు మేము ఆహారం వేటకు వెళ్ళినపుడు మా పిల్లలను వృద్ధ జంతువులు చూసుకుంటున్నాయి.కాబట్టి వాటి సంరక్షణ మన బాధ్యత .పైగా మా పిల్లలకు వేటాడేందుకు కావలిసిన నైపుణ్యాలను, ఎలా ఉండాలి,ఎలా ఉండకూడదు అనే జాగ్రత్తలు నేర్పిస్తున్నాయి.అడవిలో ఒకరికి ఒకరు ఎలా తోడి ఉండాలో కూడా, సంస్కారం నేర్పిస్తున్నాయి.ఏ విధంగా చూసిన లాభమే ఉంది నష్టం ఏమి లేదు అన్నది తోడేలు .
అప్పుడు మృగరాజు నడవలేని ఆహారం తెచుకోలేని జీవులకు మిగతా జంతువులు తమ ఆహారంలో కొంత భాగాన్ని తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పింది అది బాధ్యతగా భావించాలి ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవు అని హెచ్చరిక జారీ చేసింది.దానికి నక్కతో సహా మిగతా జంతువులు సరే అన్నాయి. ఎవరికైనా అనారోగ్యం వస్తే వారికి నేను ఉచితంగా వైద్యం చేస్తాను అంది ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటి ఆలోచనకు మృగరాజుతో సహా అన్ని జంతువులు కరతాల ధ్వనులు చేశాయి.అక్కడ ఉన్న  వృద్ధ జంతువులు అన్ని సింహం దగ్గరికి వచ్చి  ధన్యవాదాలు తెలిపాయి .
సింహం మెల్లిగా చూడండి మీరు వృద్ధులు అయినంత మాత్రాన చనిపోవాలని ఆలోచన చేయవద్దు అన్నది.దానికి అన్ని జంతువులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాయి, నాకు అడవిలో జరిగే అన్ని సంఘటనలు తెలుస్తాయి.మేము కూడా వృద్ధులము అయిపోతాము.మీ సలహాలు సూచనలు ఈ తరానికి అవసరం అనగానే అవన్నీ సరే మహారాజా ఇంకోసారి ఇలా చేయము అని మాట ఇచ్చాయి.
అప్పటి నుండి అడవి జీవులు వృద్ధ జీవులకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకున్నాయి.అనుకోని ఇబ్బందులు వచ్చినపుడు ఎలా ఉండాలో పిల్లలకు తమ అనుభవాలు చెప్తున్నాయి.
ఈ కథ కేవలం అడవి జంతువులకు మాత్రమే కాదు మనుషులకు కూడా .మన సమాజంలో కూడా వృద్దులు వుంటారు ప్రతి ఇంట్లో వారి సంరక్షణ నేడు భారం అయింది .వారి అనుభవాలు నేటి తరానికి చాలా అవసరం అందుకే బాధ్యతగా భావించి వృద్ధులని జాగ్రత్తగా చూసుకోవాలి .ఎన్నో చూసి వుంటారు వాళ్ళు ఒక్కోసారి కోపంతో అన్న మాటలు  పట్టించుకోవద్దు.తల్లిదండ్రులు పిల్లలకు మంచి నేర్పిస్తే ఆ తరువాత వాళ్ళు కూడా వృద్ధులైన తర్వాత చూసుకుంటారు.
వారి సంరక్షణ కోసం ప్రభుత్వం చాలా చట్టాలు అందుబాటులోకి తెచ్చింది.చట్టాలకు భయపడి కాకుండా  జీవితాన్ని మన కోసం బ్రతికిన వారి కోసం మనం  కేవలం   వారు ఉన్నన్ని రోజులు  వారిని ఆరోగ్యంగా ఆనందంగా చూసుకోవాల్సిన బాధ్యత మనది.





Comments

Post a Comment

Popular posts from this blog

రామచిలుక కథ

చిన్న చేప కథ

అంతా మన మంచికే...