దొరలు దోచలేరు, దొంగలెత్తుక పోరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనమ్మురా లలిత సుగుణజాల! తెలుగు బాల. పైన పేర్కొన్న ఈ పద్యం తాత్పర్యం ఏమిటో తెలుసా? దొరలు దోచుకోలేరు మరియు దొంగలు కూడా ఎత్తుకొనిపోలేనిది ,మన సోదరుల మధ్య పంపకాలలో పంచుకోలేనటువంటిది ఏమిటో తెలుసా విద్య .మన చదువును జ్ఞానాన్ని మన నుండి ఎవరూ వేరు చేయలేరు. మనం ఉన్నంత కాలం మనతోనే ఉంటుంది మనం నేర్చుకున్న ఙ్ఞానం. మీకు ఈ విషయం ఇంకా వివరంగా ఒక కథ ద్వారా చెప్తాను వినండి. అనగనగా ఒక ఊరిలో ప్రసన్నవర్మ అనే పండితుడు ఉండేవాడు అతడు పేరుకు తగ్గట్టే చాలా ప్రసన్నంగా ఉంటాడు.అతడు వేద వేదాంగాలు చదివిన మహా పండితుడు.అతడికి రవివర్మ అనే కొడుకు ఉండేవాడు. మనకు బాగా తెలిసిన లోకోక్తి ప్రకారం "పండిత పుత్ర పరమ శుంఠ" అన్నట్లు రవివర్మకు చదువు వంట బట్టలేదు.ఎంత చెప్పినా చదివి ఎవరిని ఉద్దరించాలి ఏదైనా పని చేసుకొని బ్రతుకుతాను లే అని సోమరి పోతు లాగ ఉండేవాడు. ఒకరోజు ప్రసన్న వర్మ ప్రవచనాలకు వెళ్ళాడు అక్కడ మంచిగా ప్రవచనాలు చెప్పిన తర్వాత అతడిని కొందరు ఓర్వలేక మీ పుత్రుడికీ ప్రవచనాల...
మహాభారతం ఒక మహా గ్రంథం. ఇందులోని ప్రతి పాత్ర మనకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జీవితానికి సంబంధించిన ఏదో ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. మహాభారతంలోని పాత్రలను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది – మన ఆలోచనలే మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక విషయాన్ని మనం మంచి ఉద్దేశంతో ఆలోచిస్తే అది మనకు మంచిగానే అనిపిస్తుంది. అదే విషయాన్ని చెడు ఉద్దేశంతో చూస్తే తప్పుగానే కనిపిస్తుంది. అందుకే మనిషి జీవితంలో ఆలోచనలకు, ప్రవర్తనకు, ధర్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాంటి గొప్ప నీతి బోధలను అందించిన వ్యక్తి విదురుడు. విదురుడి జననం హస్తినాపుర రాజవంశంలో చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు రాజులు ఉన్నారు. విచిత్రవీర్యుడు మరణించిన తర్వాత అతని భార్యలు అంబిక, అంబాలికలకు సంతానం లేకపోవడంతో సత్యవతి చాలా బాధపడింది. వంశాన్ని కొనసాగించడానికి సత్యవతి తన కుమారుడైన వేదవ్యాసుడిని ఆశ్రయించింది. ఆమె సూచనతో అంబిక, అంబాలికలు వ్యాసుడిని కలిశారు. అంబిక వ్యాసుడిని చూసి భయంతో కళ్లను మూసుకుంది. అందువల్ల ఆమెకు జన్మించిన ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడయ్యాడు. అంబాలిక వ్యాసుడిని చూసి భయపడటంతో ఆమె ముఖం పాలిపోయింది. ఆమెక...