చిన్న చేప కథ
అనగనగా కథలు చాలా విచిత్రంగా ఉంటాయి, ఇది ఒక చేప పిల్ల కథ.
ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది,అందులో ఒక చేపల కుటుంబం నివసిస్తూ ఉండేది.అందులో అందరికన్నా చిన్నది అయిన చేప ఒకరోజు బయటకు వచ్చి ఈదడం నేర్చుకుంటుంది.అక్కడే ఒక కోమ్మ పైన ఉన్న పక్షిని చూసి అది అంతలా ఎలా ఎగురుతుంది అని ఆలోచించింది దానితో
దగ్గరగా వెళ్లి నేను ఈదుతున్న మొత్తం నీటిలోనే ఉంటాను కానీ నువ్వు మాత్రం రెక్కలతొ ఎంత దూరం అయిన ప్రయాణం చేయగలవు అని బాధ పడుతుంది .ఆ పక్షి అలా కాదు అమ్మ నువ్వు జల జీవివి నీకు రెక్కలు ఉండవు .నువ్వు ఈదుతున్నావు నేను ఈదలేను అని బాధ పడుతున్నాన అని అంటుంది .
ఆ చిన్న చేప తన తల్లి దగ్గరకు వెళ్లి అమ్మా మనకు రెక్కలు ఎందుకు లేవు అని ప్రశ్నిస్తుంది, అప్పుడు ఆ తల్లి చేప భగవంతుడు ఒక్కో ప్రాణిని ఒక్కో లాగా సృష్టించాడు అని చెపుతుంది అయిన వినకుండా మారం చేస్తుంది.
తెల్లవారుజామున ఆ తల్లి చేప అడవిలో ఉన్న జంతువులు అన్నింటినీ సమావేశం కావాలిసిందిగా కోరింది, కోరిన విధంగా అన్ని జంతువులు చెరువు చుట్టూ మూగారు .తల్లి చేప పిల్ల చేపను తీసుకొని వచ్చి చూడు ఇవన్ని అడవిలోని రకరకాల జంతువులు కోతి ,నక్క ,జింక,కుందేలు, ఏనుగు,గ్రద్ద వీటన్నింటిని జాగ్రత్తగా చూడు ఒక్కోటి ఒక్కో ప్రత్యేకత కలిగి వున్నాయి రెక్కలు ఏ జంతువుకి అవసరమో దానికి ఉంటాయి తప్ప అందరికి ఉండవు అప్పుడు ఆ చేప అన్నింటిని చూసి ప్రపంచంలో చాలా రకాల జంతువులు ఉన్నాయి అని గుర్తించింది .భగవంతుడు ఒక్కో ప్రాణికి ఒక్కో అవయవాలు ఇచ్చాడు వాటికి ఉంది నాకు లేదు అని అసూయ పడవద్దు ఎల్లప్పుడూ అందరితో కలిసిమెలిసి సహాయం చేస్తూ ,పొందుతూ జీవనం సాగించాలి అని ఆ తల్లి చేప చెప్పింది.
ఇది విన్న పిల్ల చేప సరే అమ్మ అంటూ ముందుకి ఈదసాగింది........
Nice story keep it up 👍
ReplyDelete