కచుడు -దేవయాని కథ..
మా కళాశాలలో తెలుగు ఉపాధ్యాయుడు పాఠం చెప్తూ మహాభారతంలో లేనిది లోకం లో లేదు లోకంలో ఉన్నది అంత మహాభారతంలో ఉంటుంది అన్నారు కానీ నాకు అర్థం కాలేదు .కానీ నిజంగా ఒక్కొక్క కథ చదువుతుంటే అప్పుడప్పుడు నిజమే అనిపిస్తుంది. ఈ కథ మహాభారతంలో ఒక ప్రేమకథ, కానీ ఇద్దరు ప్రేమించుకోలేదు ఒక్కరు మాత్రమే ప్రేమించారు ,అసలు ఏంటో ఈ కథ తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం దేవతలకు,రాక్షసులకు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో దేవతలు రాక్షసులని ఎంతమందిని చంపినా రాక్షసులు చనిపోకుండా మళ్ళీ మృత సంజీవని విద్య ద్వారా బ్రతుకుతున్నారు.ఈ విద్య కేవలం రాక్షసుల గురువైన శుక్రాచార్యుడుకి మాత్రమే తెలుసు. దేవతలు అంతా కూర్చొని ఆలోచించసాగారు. దేవతల గురువు బృహస్పతి అతని కుమారుడు కచుడు, దేవతలు అందరూ కచుడిని శుక్రాచార్యుడి దగ్గరకు శిష్యరికానికి పంపించారు. కచుడు శుక్రాచార్యుడికి జరిగిన విషయం చెప్పి అతని దగ్గర శిష్యుడిగా చేరాడు .కచుడు మంచి ప్రవర్తనతో అతని మనసు గెలుచుకున్నాడు, శిష్యులందరిలో ఉత్తముడిగా పేరు సంపాదించాడు. శుక్రాచార్యుడుకి దేవయాని...