తెనాలి రామలింగని తెలివి
అది శ్రీకృష్ణదేవరాయలు రాజ్యం ,అతని మంత్రి తెనాలి రామకృష్ణుడు. అతను చాలా తెలివినవాడు.పక్క రాజ్యం లోని రాజు ఈ విషయం తెలుసుకుని అతని తెలివికి పరీక్ష పెట్టాలనుకున్నాడు.మా రాజ్యానికి ఒక ఇరవై కిలోల క్యాబేజీ,యాభై ఆకుకూర కట్టలు కావాలని వర్తమానం పంపాడు.అందరూ ఈ వర్తమానాన్ని చూసి తలలు పట్టుకొని కూర్చున్నారు.ఆ రాజ్యం నుండి ఈ రాజ్యానికి వెళ్ళడానికి అరవై రోజుల ప్రయాణం పడుతుంది,అని భయపడుతున్నారు.శ్రీకృష్ణదేవరాయలు రామలింగడిని పిలిచి ఈ సమస్యకు పరిష్కారం చూపమని అడిగాడు. రామలింగడు బాగా ఆలోచించి ఒక పది ఎద్దులబండ్లు తెప్పించామన్నాడు.అందరూ చాలా ఉత్కంఠగా చూస్తున్నారు ఈయన ఏమి చేస్తున్నాడు అని.రాయలు మాత్రం రామలింగడి మీద నమ్మకంతో ఏమి అడగలేదు,తెనాలి రామలింగడు అన్ని ఎద్దులబండ్లలో సగం వరకు మట్టిని నింపాడు.కొన్నింటిలో ఆకుకూరలు విత్తనాలు కొన్నింటిలో క్యాబేజీ విత్తనాలు వేశాడు. ఒక్కొక్క బండికి రెండు కుండలు కట్టాడు,ఒక్కో బండికి ఇద్దరు మనుషులను పెట్టాడు వారు దారి పొడవునా వెళ్తూ వెళ్తూ మధ్యలో ఆ మట్టికి నీరు పెట్టమన్నాడు అలా అరవై రోజుల ప్రయాణ సమయానికి ఆ గింజలు మొలకెత్తి తాజా కూరగాయలు,ఆకుకూరలు రాజు గ...