పర్యావరణం-జంతువులు.
అమ్మా ఇక్కడ నీళ్లు ఏంటి ఇలా ఉన్నాయి చాలా మురికిగా ఎలా తాగాలి అని అడిగింది పిల్లకోతి ,ఎం చేస్తాం బిడ్డా దాహం వేసినప్పుడు ఏదో ఒకటి తాగి మన దాహాన్ని తీర్చుకోవాలి అన్నది .ఎందుకమ్మా ఇలా ? మన తాత ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు పచ్చని చెట్లు , చల్లని గాలి ,సెలయర్ల గలగలలు ,పక్షుల కీలకిలలు ,కోయిల కూని రాగాలు, చెట్ల నిండా పండ్లు, ఫలాలు,కూరగాయలు ఇలా ఒక్కటేమిటి అన్ని అంటుండేవాడు . ఎవమ్మా ఇప్పుడు అవన్నీ అన్నది మాకు కనపడవా?. పాపం ఆ తల్లి కోతికి కూడా బాగా బాధ అనిపించింది.అవునమ్మా ఒకప్పుడు ఈ పర్యావరణం అలాగే ఉండేది.కానీ ఇప్పుడు అలా లేదు అంటుంటే కుందేలు వచ్చింది, ఎందుకు కోతి బావా అలా అంటున్నావు అన్నది, సరే విను చెప్తా అని చెప్పడం మొదలుపెట్టింది .ఒక్కొక్కటిగా అన్ని జంతువులు అక్కడ గుమి గుడాయి. ప్రకృతి అంటే గాలి, నీరు ,నింగి,నేల,నిప్పు ఇవన్నీ పంచభూతాలు . భూమి మీద మనుషులు ,జంతువులు జీవిస్తాయి జంతువులు అన్నీ అడవులలోనే జీవనం సాగించేవి ,మనుషులు పరిణామ క్రమంలో మొదట అడవుల నుండి క్రమంగా నీరు ఉన్న ప్రదేశాలలలో ఆవాసాలు ఏర్పరచుకున్నారు.నీటి చుట్టూ వున్న ఆవాసాలు మెల్లిగా గ...