పాజిటివ్ థింకింగ్.

 సెప్టెంబర్ నెలలో 13 వ తేదీని పాజిటివ్ థింకింగ్ డే గా నిర్వహిస్తారు.సానుకూల ఆలోచనలు మనిషిని మంచి మార్గం వైపుకు మళ్లిస్తాయి.ఒక వ్యక్తి ఎంత బాధలో ఉన్నా తనయొక్క ఆలోచనలు నియంత్రించుకోకపోతే అవి వ్యతిరేక ఆలోచనలుగా మారతాయి,దానివల్ల మనం లేక ఇతరులు భాదపడవలసి వస్తుంది.సానుకూల ఆలోచనలు మన మెదడును ప్రభావితం చేస్తాయి.మనం చేసే ప్రతి పని ఒక పద్దతిలో చేయాలి,ప్రతికూల ఆలోచనల ధోరణిని విడిచిపెట్టాలి.కాదు అని అనుకున్న పనులు కూడా మన ప్రయత్నంతో పూర్తి అవుతాయి.ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ప్రణాళిక రచన చాలా ప్రధానం,ప్రణాలికను చక్కగా ఆచరణలో పెడితే తొంబై శాతం పూర్తి అవుతుంది.మిగిలిన 10 శాతం పని చేయడం వల్ల ఐపోతుంది.సానుకూల ఆలోచనల వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది,సృజనాత్మకత బయట పడుతుంది.

ప్రతికూల ఆలోచనల వల్ల అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది.రక్తపోటు, ఆందోళన,డిప్రెషన్ వంటివి చేరతాయి.ఆటగ్యాన్ని దెబ్బతీసే ప్రతికూల ఆలోచనలు చేయవద్దు. ఒక విషయాన్ని ఎంత ఆలోచించిన మారదు, కాన్ని దాని నుండి బయట పడే మార్గాన్ని వెతికితే సులువుగా ఆ పని మనం చేయవచ్చు.

మీకు పాజిటివ్ థింకింగ్ గురించి ఒక కథ చెప్తాను.రామాపురంలో సుగుణమ్మ అనే ఒక ముసలి అవ్వ ఉండేది అమె చాల మంచిది, ఎవరికైనా సహాయం చేసేది.కానీ ఎవరి నుండి ఏమి ఆశించేది కాదు.ఆమె ఒక తోట సాగు చేస్తుంది,కూరగాయలు,ఆకుకూరలు, పండ్లు పండించేది అవి అందరికి పంచేది.ఆమె పిల్లలు మాత్రం ఎందుకు అందరికి పంచుతున్నావు అని అడుగుతారు.మనం వాటిని అమ్మి డబ్బు సంపాదించవచ్చు అంటారు. మనం మన దగ్గర సరిపడా డబ్బు ఉంది ఐన నేను ఇచ్చేది కూరగాయలు, పండ్లే కదా అంటుంది.మనకు సరిపడినంత ఉంచుకొని మిగిలినది దానం చేయవచ్చు.దానివల్ల లేనివారికి అవి లభిస్తాయి.పిల్లలకు కోపం వస్తుంది గొడవ పడి భార్య పిల్లలను తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతారు. ఇరుగుపొరుగు వారు అమ్మ సుగుణమ్మ నువ్వు పేరుకు తగ్గట్టు మంచి గుణాలు ఉన్న అమ్మవు ఐనా పిల్లలు ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఎందుకు బాధపడుతాలేవు అని అడుగుతారు.దానికి ఆమె రెక్కలు వచ్చే వరకే పిల్లలు ఆ తర్వాత వారికి స్వేచ్ఛ ఇవ్వాలి అంటుంది. అయిన నేను ఎప్పుడు ఒంటరీదాన్నే నేను చిన్నగా ఉన్నప్పుడు తల్లి చనిపోయింది తర్వాత తండ్రి చనిపోయాడు. నాకు తోబుట్టువులు కూడా ఎవరు లేరు .అనాథగా ఆశ్రమంలో పెరిగాను,నా బంధువులు ఎవరు సహాయం చేయలేదు. తర్వాత ఆ ఆశ్రమంలో వ్యక్తితో నా వివాహం జరిగింది.ఆయన ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తి నన్ను పై చదువులు చదివించారు అలా నేను ఉపాధ్యాయురాలిగా మారాను.నాకంటూ ఒక పెద్ద కుటుంబం ఏర్పడింది అంతా బాగుంది అనుకునే లోపు ఒక కుదుపు నా భర్త మరణించాడు.అయిన మరల పిల్లల కోసం బ్రతికాను,పిల్లలను ప్రయోజకులను చేసాను.ఎన్నో చూసాను మల్ల నేను అదే త్రోవలో వెళ్ళొద్దని ప్రతికూల ఆలోచనలు చేయకుండా ఇలా జీవితాన్ని కొనసాగిస్తున్నాను.దానితో వాళ్ల కళ్ళు చేమర్చాయి. జీవితంలో ఒక్కసారైనా ప్రతికూల ఆలోచనలు చేస్తే ఆమె జీవితం ఉండేది కాదు కదా!అందుకే ఎప్పుడూ సానుకూల ఆలోచనలు చేయాలి.



Comments

Post a Comment

Popular posts from this blog

రామచిలుక కథ

చిన్న చేప కథ

అంతా మన మంచికే...