శ్రీకృష్ణ రాయబారం .
మహాభారతంలో అన్ని కథలు మనకు చాలా దగ్గరగా ఉంటాయి అని గతంలో చెప్పుకున్నట్లే ఈ శ్రీకృష్ణ రాయబారం కూడా అలాంటిదే.
రాయబారం అంటే ఒకరి తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడడం కాదు ఇరువురి మధ్య ఉన్న సమస్య గురించి లోతైన అవగాహన ఉండాలి.సమస్య తెలిస్తేనే కదా ! దారి తెలుస్తుంది.మహాభారతం ఒక కథ మాత్రమే కాదు మనందరి జీవితాలకు ఒక అర్థవంతమైన పుస్తకం.
పాండవులను కౌరవులు అడుగడుగునా హింసిస్తున్నా కూడా చెక్కు చెదరకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళుతున్నారు.ఈ క్రమంలో వారు కొత్తగా నిర్మించిన ఇంద్రప్రస్తాన్ని చూడడానికి ఒకరోజు దుర్యోధనుడు వెళ్తాడు అతను ఆ భవనాన్ని చూసి చాలా ఆశ్చర్యం పొందాడు,దానితో అసూయ చెందాడు.ఎలాగైనా ఇంద్రప్రస్తాన్ని కూడా చేజిక్కించుకోవాలి అని పన్నాగాలు పన్నాడు.శకుని మామ సహాయంతో మాయ పాచికలు తయారు చేసాడు.ధర్మరాజు జూదానికి బానిస కాదు కాని అతనికి జూదం అంటే ప్రాణం.
ధర్మరాజును కౌరవులు జూదానికి ఆహ్వానించారు ,వారి మనస్తత్వం తెలిసి కూడా ధర్మరాజు ఒప్పుకున్నాడు.వారు ఆహ్వానించనందువల్ల మనం వెళ్ళాలి అని అందరిని కూడా గట్టుకొని హస్తీనాపురానికి వచ్చాడు.శకుని తన చాకచక్యంతో పండిత పామర జనాలను మభ్య పెడుతూ ధర్మరాజును జూదంలో కూర్చోబెట్టాడు.పాచికలు అన్ని శకుని చెప్పినట్టే వింటాయి కాబట్టి అతను ఇది కోరుకుంటే అదే పడుతుంది.ధర్మజుడు చూస్తూ ఉండిపోయాడు మెల్లి మెల్లిగా ఒక్కో ఆట ఓడిపోయాడు.
ధర్మరాజును పూర్తిగా ఓడించాలని నిర్ణయించుకున్న కౌరవరాజు దుర్యోధనుడు రెచ్చగొట్టి తన సోదరులను పణంగా పెట్టాడు.ధర్మరాజు తన సోదరులను కోల్పోయాడు.ఇప్పుడు దుర్యోధనుడు తన భార్యను పందెంగా పెట్టాడు భీష్ముడు వద్దు అని వారించాడు ఇది ఆమోద యోగ్యం కాదు అని హెచ్చరించాడు.అహంకారం వల్ల కళ్ళు మూసుకుపోయిన దుర్యోధనుడు వినలేదు. మాట కోసం ధర్మజుడు పాంచాలిని ఫణంగా పెట్టాడు,ఆమెను ఓడిపోయాడు.దుర్యోధనుడు ఆమెను ఘోరంగా అవమానించాడు.చివరకు ఒక ఒప్పందం ప్రకారం పాండవులు 12 సంవత్సరాల అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది.వారు ఈ కఠినమైన కాలాన్ని కూడా ఒక సవాలుగా స్వీకరించారు , పూర్తి చేశారు.
13 సంవత్సరాల తరువాత తిరిగి ఇంద్రప్రస్థానికి వచ్చారు.మా రాజ్యం మాకు ఇవ్వవలసిందిగా అడిగారు.కౌరవులు మీకు అర్థభాగం కాదు కదా! సూది మొన మోపేటంత స్థలాన్ని కూడా ఇవ్వను అన్నాడు దుర్యోధనుడు.
ఇరువైపులా వాతావరణం అనుకూలంగా లేదు. సంజయుడు రాయభారానికి వచ్చి మీకు రాజ్యం ఇచ్చేది లేదని చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత ధర్మరాజు శ్రీకృష్ణుడు దగ్గరకు వెళ్లి బావా ! మా తరపున రాయభారానికి వెళ్ళాలి అన్నాడు.వెళ్లి ఎం చేయాలి అన్నాడు శ్రీకృష్ణుడు. యుద్ధం జరిగితే చనిపోయేవారు అంతా మన బంధువులు కదా శాంతిగా ఒప్పించి మాకు జీవించడానికి సరిపోయేంత 5 గ్రామాలు ఇవ్వమను అన్నాడు.ధర్మరాజు చెప్పినంతనే వెళ్ళలేదు మిగిలిన పాండవుల అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకుందాం అని అడిగాడు.భీముడు,అర్జునుడు,నకుల సహదేవులు యుద్దానికే సిద్ధంగా ఉన్నారు.ద్రుపది మాత్రం తనకు తానే చాలా ప్రశ్నలు వేసుకుంటుంది యుద్ధం జరిగితే జరిగే ప్రాణ నష్టాలకు పూర్తి బాధ్యత నాదే కదా! నేను రక్త పిచాచినా అని అనుకుంటూ ఉంటుంది.ఇంకోవైపు వాళ్ళు చేసిన గాయం మనసులో మెదులుతుంది మొత్తానికి యుద్ధమే శరణం అన్నది.
ధర్మరాజు నువ్వు వెళ్లి మాట్లాడు కానీ వాళ్ళంతట వాళ్లే చెప్పేదాక యుద్ధం ప్రస్థావన తేవద్దు అన్నాడు.శ్రీకృష్ణుడు సాత్యకిని వెంట పెట్టుకొని హస్తీనాపురానికి వెళ్ళాడు.అతను రాయబారిగా వెళ్ళాడు కనుక మొదట తనను తాను పరిచయం చేసుకున్నాడు ఆ తర్వాత సభలో ఉన్న పెద్దలందరికి నమస్కారం చేసి కుశల ప్రశ్నలు వేసాడు.మనం ఎప్పుడూ శాంతి వైపే ఉండాలి కనుక పాండవులకు 5 వూళ్లను ఇవ్వమని అడిగాడు .మేము ఇవ్వము కావాలంటే యుద్ధం చేసి రాజ్యాన్ని గెలుచుకొమ్మని సలహా ఇచ్చాడు దుర్యోధనుడు.యుద్ధం వల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం అని పెద్దలు గురువులు చెప్తున్నారు.అయినా కూడా వినలేది సరి కదా, శ్రీకృష్ణుడుని హెచ్చరించాడు.సరే మీకు అంతగా యుద్ధం చేయాలని ఉంటే వారు మాత్రం చేయకుండా ఎలా ఉంటారు, ఎక్కడ యుద్ధం చేయాలో మీరే నిర్ణయించండి అని అన్నాడు.యుద్ధ ప్రదేశం యుద్ధ సమయం, ముహూర్తం అన్ని వారి చేతనే పెట్టించాడు శ్రీకృష్ణుడు.కౌరవులు వారి చావుకు వారే ముహూర్తం పెట్టుకున్నారు.
ధర్మరాజు యుద్ధం వల్ల జరిగే నష్టాన్ని ముందుగానే అంచనా వేశాడు. శ్రీకృష్ణుడు మంచి మిత్రుడు మంచి సలహాదారు కాబట్టి మంచి సలహాలు సూచనలు ఇచ్చాడు.అతని సారధ్యంలో పాండవులు యుద్ధం గెలిచి రాజ్యాన్ని స్థాపించారు.దుర్యోధనుడు అతని సోదరులు శకుని సాంగత్యంతో చెడు ప్రవర్తన కలిగి అంతం అయ్యారు.
Nice 👌
ReplyDelete