Posts

మూడు చేపల కథ..🐟🐋🐳

Image
ఈ కథ భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన కథ మహాభారతానికి సంబంధించిన మూడుచేపల కథ. అనగనగా ఒక చెరువు ఉండేది అందులో దీర్గదర్శి ,దీర్ఘసుత్రుడు,ప్రాప్తకాలజ్ఞుడు అనే మూడు చేపలు ఉండేవి.ఆ చెరువు ఎల్లప్పుడూ నీటిని కలిగి ఉండేది కావున ఆ చేపలు సంతోషంగా ఉండేవి.ఎల్లప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు కదా! ఆ చెరువులోకి నీళ్లు రావడం తగ్గిపోయాయి,దాంతో కంగారు పడిన దీర్ఘదర్శి మిగిలిన రెండు చేపలతో చూడండి మిత్రులారా ఈ చెరువు కొన్ని రోజులలో ఎండిపోతుంది.మనం ఇక్కడ నుండి బయటపడి వేరే దారి చూసుకోవాలి అన్నది.అది విన్న దీర్ఘసుత్రుడు, ప్రాప్తకాలజ్ఞుడు ఎప్పుడో ఎండిపోయే చెరువు గురించి ఇప్పటి నుండి ఎందుకు కంగారు పడడం ఎండిపోయినపుడు మనం ఎటైనా వెళ్లిపోదాం అన్నాయి.దీర్గదర్శి వీళ్లకు చెప్పడం వృధా అని మెల్లిగా పిల్లకాలువలోకి వెళ్ళింది ఆ తర్వాత పెద్ద చెరువులోకి దూకింది.సంతోషంగా జీవించసాగింది.      కొంతకాలానికి దీర్గదర్శి చెప్పినట్టే చెరువు ఎండిపోయింది అది చిన్న మడుగు లాగా కనిపించింది ఎండిపోయిన చెరువులో చేపలు ఎక్కువగా ఉంటాయి అని జాలరులు వల వేశారు. ప్రాప్తకాలజ్ఞుడు మొత్తం బురద అంటించుకుంది చనిపోయినట్టు నటించింది...

తెనాలి వారి బంగారు మామిడి పండ్లు.

Image
తెలుగు కథలలో తెనాలి రామలింగని కథలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది.రాయల వారి ఆస్థానంలో తెనాలి రామలింగడు మాత్రమే చాలావరకు సమస్యలను పరిష్కరించారు.తన యుక్తులతో ఇతరుల కుటీలత్వాన్ని రాజుగారి దగ్గర బయటపెట్టాడు. రాయల వారి తల్లి జబ్బుతో బాధపడుతుంది. వైద్యుడు పరీక్షించి తన కోరికలు ఏవైనా ఉంటే తీర్చాలిసిందిగా ఆదేశించాడు.ఆమె తన ఆఖరి కోరికగా మామిడి పండ్లు తినాలని ఉంది అని అన్నది,కానీ అది మామిడి పండ్లు వచ్చే కాలం కాదు కాబట్టి అతనికి లభించలేదు ఆమె ఆ కోరికతో కాలం చేసింది.రాయలవారు బాధపడ్డాడు ఒక పండితుడిని కలిసి విషయం చెప్పాడు.ఆ పండితుడు దోషం జరిగింది పరిహారం చేయాలి అని చెప్పి బంగారు మామిడిపండ్లు పంచాలని చెప్పాడు.రాజుగారు తెచ్చి బంగారు మామిడిపండ్లను పంచాడు.చాలా వరకు ఆ పండ్లను పండితుడి సన్నిహితులు తీసుకున్నారు.విషయం తెలుసుకున్న తెనాలి రామలింగడు వాళ్ళ మోసాన్ని బయటపెట్టాలి అనుకున్నాడు.మా తల్లి గారు చనిపోతుండగా చివరి కోరికగా వాతలు పెట్టమని కోరింది.రాజుగారి దగ్గర మామిడిపండ్లు తీసుకున్న వారు అంతా ఒక వరసలో నిలుచుంటే వాతలు పెడతాను అని అన్నాడు రామలింగడు.దీనితో భయపడిన పండితులు చేసిన తప్పు ఒప్పుకున్నారు.ఇం...

అప్పయ్య ,కొండయ్య, కొరడా దెబ్బలు

Image
రంగాపురంలో అప్పయ్య,కొండయ్య అనే ఇద్దరు స్నేహితులు వుండేవారు.వారు దేశ సంచారం చేసేవారు రాజ్యంలోని పరిస్థితులను రాజుకు వివరించేవారు.అలా తిరుగుతూ తిరుగుతూ వుండేవారు. కోటిలింగాల రాజ్యంలో రాజు మా రాజ్యంలో ప్రజలు అంతా చాలా మంచివారు స్వార్థం లేని వారు అధికారులు లంచం తీసుకోరు అని బాగా గొప్పలు చెప్పుకునేవారు. కోటిలింగాల ప్రజల గురుంచి,అధికారుల గురించి తెలుసుకోవడానికి అప్పయ్య, కొండయ్య బయలుదేరారు.గ్రామాల్లో పర్యటిస్తున్నారు ఇద్దరు ఆట పాటలతో అందరిని ఆకట్టుకొని డబ్బులు పొగుచేస్తున్నారు.వాళ్ళు దారిలో వెళుతుంటే ఆగంతకులు వచ్చి వాళ్ళ సంచిని ఎత్తుకొని వెళ్లారు వీరు వాళ్ళను వెంబడించి దొంగలను పట్టుకున్నారు ఎందుకు ఇలా చేసారు అని అడగగా మాకు పని దొరకక ఆకలికి దొంగతనం చేసాము ఈ రాజ్యంలో ఏదయినా లోటు ఉంది అని చెప్తే మంత్రి వర్గం అంత మమ్ములను బ్రతనివ్వరు అందుకే మేము సంతోషంగా ఉన్నట్లు రాజు గారిని నమ్మిస్తున్నాము అని అన్నారు.అలా అన్ని గ్రామాలు పూర్తి అయిన తర్వాత అనోటా ఈనోట అప్పయ్య ,కొండయ్యల ఆట పాటల వినోదాలు రాజు గారికి తెలిసింది .వారికి రాజభవనం నుండి ఆహ్వానం లభించింది. వారు వస్తుంటే ఇద్దరు కాపలాదారులు మిమ్మ...

దీపావళి కథ...

Image
దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం .ఈ పండగను భారతదేశం అంతటా పిల్లలు పెద్దలు టపాసులు,మిఠాయిలు, పిండివంటలతో  చాలా సంతోషంగా జరుపుకుంటారు. దీపావళి జరుపుకోవడానికి రకరకాల కధలు ప్రచారంలో ఉన్నాయి.పూర్వ కాలంలో నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు.అతను భూదేవి వరహస్వామికి అసుర సమయంలో జన్మించాడు.ఇతను రాక్షస ప్రవృత్తి చేత మరణించబడతాడు అని బాధ పడిన భూదేవి విష్ణుమూర్తిని ఒక వరం అడిగింది.అతనికి చావు లేకుండా చేయమని అన్నది,  అలా జరగదు కాబట్టి తల్లి చేత మాత్రమే చంపబడతాడు అనే వరాన్ని పొంది ఉన్నాడు. తన తల్లి నేను నా కొడుకును చంపలేను కాబట్టి సరే అంది భూదేవి.ఆమె తన కొడుకు మంచి లక్షణాలు పొందడానికి జనక మహారాజుకి అప్పగించి వెళ్ళింది.జనక మహారాజు దగ్గర విద్య నేర్చుకొని అతను మంచి బుద్ధులు అలవాటు చేసుకున్నాడు.అతను కామాఖ్య అమ్మవారిని చాలా నిష్ఠగా పూజ చేసేవాడు. కొన్ని రోజులకు అతను పక్క రాజ్యం రాజైన బాణాసురుడుతో స్నేహం చేసాడు. అతను స్త్రీలను కేవలం భోగ వస్తువుగా మాత్రమే చూసేవాడు. అతని ప్రభావం చేత నరకాసురుడు కూడా మారిపోయాడు.స్త్రీలను ఆటబొమ్మలుగా చూడడం మొదలు పెట్టాడు,క్రమంగా పూజ చేయడం మానేశాడు.నరకాసురుడు...

రుక్మయ్య-వడ్డీ..

Image
అనగనగా అవంతిపురం అనే రాజ్యం ఉంది ఆ రాజ్యానికి రాజు సులోచనడు.సులోచనడు అంటే మంచి ఆలోచనలు కలిగిన వాడు అని అర్థం .ఆ రాజ్యంలో రుక్మయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు అతను నగలు తాకట్టు పెట్టుకొని సొమ్ము ఇచ్చేవాడు,కానీ ఎక్కువ వడ్డీ లాగేవాడు.కలలో కూడా వడ్డీ వడ్డీ అని ఆలోచించేవాడు. సులోచనడు అతనిని చాలా సార్లు మందలించాడు. అయిన అతని పద్దతి మార్చుకోలేదు. రుక్మయ్య దగ్గరికి చెన్నయ్య దంపతులు వచ్చారు వారి కూతురి వివాహం కోసం సొమ్ము అవసరం అయ్యింది. చెన్నయ్య దంపతులు వారి దగ్గర ఉన్న బంగారాన్ని ఇచ్చి ధనాన్ని తీసుకెళ్లారు అందరికంటే నీకు తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తాను అనేసరికి నోటు రాసుకోలేదు.చెన్నయ్య దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు , కూతురి వివాహం జరిగిపోయింది.      కొన్ని రోజుల తరువాత చెన్నయ్య దంపతులు పంట అమ్ముడుపోగా మిగిలిన ధనాన్ని ,దాచి ఉంచారు .అలా కూడబెట్టిన ధనాన్ని తీసుకొని పోయి రుక్మయ్య దగ్గరకు వెళ్లారు ,ఆయన నువ్వు నా దగ్గర ఎప్పుడు తాకట్టు పెట్టవు ? నేను నీకు ఎప్పుడు డబ్బులు ఇచ్చాను అని అన్నాడు.చెన్నయ్య దంపతులు కంగారుపడి తర్వాత తేరుకొని అలా మాట్లాడతారు ఏంటి రుక్మయ్య గారు మేము మా క...

నమ్మకం

Image
అనగనగా ఒక ఊరిలో  సుబ్బయ్య అనే అతను వున్నాడు.అతను ఒక గొర్రెలకాపరి .అతనికి ఒక కొడుకు సోము ఉండేవాడు.అతను తుంటరి ,ఒకరోజు తండ్రితో పాటు గొర్రెలు మేపడనికి వెళ్ళాడు.సుబ్బయ్య మధ్యాహ్నం భోజనం చేసి ఒక చెట్టు కింద కునుకు తీయడానికి వెళ్ళాడు .వెళ్తూ వెళ్తూ ఇక్కడికి పులి వస్తుంది జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళాడు .సోము సరే అన్నాడు, కాసేపటి తర్వాత సోము తండ్రిని ఆటపట్టించడానికి పులి పులి అని అరిచాడు.వెంటనే తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు.ఎక్కడ ?ఎక్కడ? అని అంటాడు.వురికే అన్నాను నువ్వు వస్తావా లేదా అని అన్నాడు.ఆ తర్వాత కొద్దిసేపటికి  మళ్ళీ ఆలాగే అన్నాడు సోము.సుబ్బయ్య వచ్చాడు ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదు అని హెచ్చరించి వెళ్ళాడు.ఒక గంట తర్వాత నిజంగానే పులి వచ్చింది .నాన్న నాన్న అని పిలిచాడు సుబ్బయ్య మాత్రం చెట్టుకిందనుండి రాలేదు పులి వచ్చి మంద లో ఉన్న గొర్రెలను తిన్నది.సోముని గాయపరిచింది. సోము పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్నకు  చెప్పి క్షమాపణ వేడుకున్నాడు. మనుషులకు ఒక్కసారి నమ్మకం పోతే దానిని తిరిగి నిలబెట్టుకోవడం చాలా కష్టం అందువల్ల నమ్మకం కోల్పోయే పనులు ఎప్పుడు చేయవద్దు. దాన...

శ్రవణకుమారుడి కథ..

Image
 ఈ కథ అందరికీ తెలుసు కానీ  ఇంకా తెలియని వాళ్ళ కోసం మాత్రమే. గాంధీజీ తన ఆశ్రమంలో జనులందరితో ముచ్చటిస్తూ వున్నారు.అక్కడ ఉన్నవారు తల్లిదండ్రుల సేవ ఎలా చేయాలి అని అడిగారు దానికి గాంధీజీ ఒక కథ చెప్తాను అన్నాడు ఎందుకంటే ఆ కథ అంటే గాంధీజీకి చాలా ఇష్టం.అది తల్లిదండ్రులను గౌరవించే శ్రవణకుమారుడి కథ.శ్రవనకుమారుడి తల్లిదండ్రులకు కళ్ళు లేవు ఐతే వారి బాగోగులు మొత్తం ఆయనే చూస్తూ ఉండేవాడు .వారు వయసు మీరడంతో మాకు తీర్థయాత్రలు చేయలని ఉంది అని అన్నారు దానికి శ్రవనకుమారుడు సరే అన్నాడు.వారిద్దరిని ఒక కావడి తయారు చేసి దానిలో కూర్చో బెట్టాడు.వారిని అలా తీసుకొని వెళుతుండగా దారిలో వారికి దాహం వేసింది ,నీళ్ల కోసం వారిని అక్కడే ఉంచి వెళ్ళాడు.ఇంతలో వేటకు వచ్చిన దశరథ మహారాజు జింక అనుకోని బాణం వేసాడు అది శ్రవనకుమారుడికి గుచ్చుకుంది .దశరథుడు వచ్చి చూసి అయ్యె?నేను ఎంత పాపం చేసాను అని బాణం తీయడానికి ప్రయత్నించాడు,శ్రవనకుమారుడు వద్దు మహారాజ న తల్లిదండ్రులకు దాహం తీర్చి ఈ విషయాన్ని చెప్పండి అని కన్ను ముసాడు.దశరథుడు తీవ్రమైన దుఃఖంతో వచ్చి వారి దాహం తీర్చి నా  వల్ల మీ కుమారుడు మరణించాడు అని చెప్...

నక్క తెలివి

Image
అనగనగా ఒక అడవి ఆ అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి.ఆ అడవికి రాజు మృగరాజు సింహం .సింహం మంచిదే కానీ దాని దగ్గర ఉన్న సైన్యంలో తోడేలు, నక్క,రాబందు ఉండేవి.సింహం సైన్యంలో నక్క అసలు మంచిది కాదు ఎప్పుడు తన స్వార్థం కోసమే ఇతరులను బలి చేసేది.ఒకరోజు సింహం పర్యటనకు వెళ్ళింది అన్ని జంతువులు ఈ అడవిలో ఎలా ఉన్నాయి నేను అంటే  అసలు బయపడుతున్నాయా లేదా!అని అంతటా తిరిగింది. ఏనుగు దగ్గరకు వచ్చింది మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నది అది చెప్పే లోపే నక్క కల్పించుకొని వాళ్లకు ఏమి సమస్యలు లేవు రాజు గారు అవి ఇంకా ఇష్టారాజ్యంగా తిరిగి అడవులను పాడు చేస్తున్నాయి వెంటనే ఏనుగులు ఎం చెప్పాలో అర్థం కాక తల దించుకున్నాయి.మృగరాజు ఏనుగులను మంద లించాడు. ఆ తర్వాత పక్షులను అడిగాడు ,వారు అన్ని కలిపి ఒకటే గొంతుతో నక్కను మాట్లాడనియక మాకు చాలా సమస్యలు ఉన్నాయి.అడవిలో మేము గూడు కట్టిన చోట ఇంకొకరిని రానివ్వకండి .మాకు చాలా కష్టం అవుతుంది లేకపోతే మాకు అందరికి ఒక దగ్గర మంచి గూళ్లు కట్టించండి అన్నాయి.వెంటనే నక్క మీకు గుళ్ళు కట్టడానికి డబ్బులు ప్రస్తుతం ఖాజానలో లేవు అవి సర్దిబాటు ఐతే కడతాం అన్నది సింహం పేరుకు రాజు అయిన నక్క మా...

రంగడు-సింగడు-ఉద్యోగం

Image
అనగనగా ఒక రాజ్యంలో సింగడు,రంగడు  అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు.వారి ఇంట్లో వాళ్ళు మీరు ఏ పని చేయడం లేదు అని తిట్టి ఇంట్లో నుండి గెంటేశారు.సింగడు ఏదిఅయినా మన మంచికే అని అనుకుంటాడు అందరికి అలాగే చెప్తాడు.రంగడిని తీసుకుని ఉద్యోగం కోసం బయలుదేరి వెళ్లారు. వారు అలా వెళుతుండగా వారికి సింహాగర్జన వినిపించింది ఇద్దరూ వెంటనే చెట్టు ఎక్కి కోమ్మల్లో దాక్కున్నారు. రంగడు అరేయ్ సింగా మనం ఎంత  ప్రమాదంలో ఉన్నామో తెలుసా మనం ఈ దారిన వద్దు అంటే నువ్వు తెచ్చావు అంటాడు ఎమీ కాదులే నువ్వు గబరపడకు అన్నాడు.మెల్లిగా చెట్టు దిగి చుట్టూ చూసి వేరే దిక్కుగా నడవడం మొదలు పెట్టారు.వెళుతుంటే దారిలో వారికి ఒక ఉంగరం కనిపించింది.దానిని రంగడు వేలికి పెట్టుకున్నాడు. కొంతదూరంలో వారికి భటులు ఎదురుపడ్డారు. రంగడి చేతికి ఉన్న ఉంగరాన్ని చూసి వాళ్ళను రాజు గర్ దగ్గరికి తీసుకెళ్ళారు. రంగడు భయపడుతున్నాడు, సింగడు ఎమి పర్లేదు మిత్రమా అంత మన మంచికే ఎక్కడ నుండో ప్రయాణం చేసి వచ్చి రాజు గారిని నేరుగా చూసే అవకాశం వచ్చింది అంటాడు.రాజు గారు వారిని గురించి అడిగాడు,వారు జరిగింది అంతా చెప్పారు..నాకు నమ్మకం కలగడం లేదు అప్పటిద...

సహవాస దోషం

Image
అనగనగా ఒక ఊరిలో ఒక గ్రామాధికారి,పూజారి,జూదరి అనుకోకుండా ఒక విహారయాత్రకు బయలుదేరారు.వారు పడవ ప్రయాణం చేస్తున్నారు,ఇంతలో ఒక భయంకరమైన తుఫాను వచ్చింది .దాని వల్ల వారు ఒక ద్వీపంలో చిక్కుకుపోయారు.అటునుంది వారు బయటపడే మార్గం కొరకు చాలా వెతికారు,కానీ వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. చివరకు ఇది ఐతే అది జరుగుతుందని భావించి అలా ఉండిపోయారు. అలా రెండు నెలలు గడిచిపోయాయి ,ఒకరోజు జూదరి రండి ఎంతకాలం ఇలాగే ఉంటారు సరదాగా పేకాట ఆడుకుందాం అంటాడు. గ్రామాధికారి ఈ విషయం మా ఊరిలో తెలిస్తే గ్రామస్తులు నాకు మర్యాద ఇవ్వరు నేను ఆడను అంటాడు.పూజారి జూదం అనేది ఒక వ్యసనం అది మహాపాపం ,నేను ఆడను అంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత గ్రామాధికారి జూదరి దగ్గరగా వచ్చి పోనీలే నేను ఇక్కడ ఆడితే అక్కడ మా గ్రామంలో ప్రజలకు ఎలా తెలుస్తుంది రా నాకు ఆట నేర్పించు అన్నాడు.ఆ తర్వాత పూజారి వచ్చి ఏవైనా దోష పరిహారాలు ఉంటే చేసుకుంటా,ఖాళీగా ఉండి ఏమి లాభం అన్నాడు.అలా ముగ్గురు కలిసి ఆడటం మొదలుపెట్టారు.పని ఏమి లేకపోవడంతో వారు ఒక వారంలొనే ఆట నేర్చుకున్నారు.అలా ఆడుకుంటూ కొన్ని నెలలు గడిచాయి.ఒకరోజు ఆ ద్వీపంలో ఒక సీసా కనిపించింది దానికి మూత పెట్టి వుంది వారు ...

సోమరి కొడుకు కథ

Image
అనగనగా ఒక ఊరిలో చెంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు , అతనికి రాజు అనే కొడుకు ఉండేవాడు.అతను చాలా సోమరిపోతు ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు.రాజుని తండ్రి ఎప్పుడు మందలించే వాడు.అయిన వాడు మాత్రం ఏమి చేయకుండా  అలాగే తిరిగేవాడు. ఒకరోజు ఎంత చెప్పినా వినడం లేదు అని ఇంటి నుండి బయటకు పంపించేశారు.ఏదయినా పని చేసి డబ్బులు తీసుకొని ఇంటికి వస్తేనే నీకు భోజనం లభిస్తుంది అన్నాడు చెంగయ్య.రాజు పని కోసం వెళ్లాడు కానీ పని దొరకలేదు.అయితే అతను తనకు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు దానిని తెచ్చి తండ్రికి ఇచ్చాడు.దానికి తండ్రి సంతోషించి తీసుకొని భోజనం పెట్టాడు ఆ డబ్బును ఇంట్లొ ఉన్న బావిలో వేసాడు చెంగయ్య. రాజు చూసుకుంటూ వెళ్ళాడు తప్ప ఏమీ అనలేదు.అలా వెళ్లి భోజనం తిని పడుకున్నాడు. తెల్లారి కూడా అలాగే బయటకు వెళ్లి డబ్బులు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చాడు.అలా మూడు నెలలు గడిచిపోయాయి.ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది.కొంతకాలానికి ఒకరోజు ఎంత వెతికినా ఎవరు దొరకలేదు ఖాళీగా ఇంటికి వచ్చాడు,ఇంట్లో భోజనం పెట్టలేదు.అలాగే  పడుకున్నాడు.మళ్ళీ వెళ్ళాడు సగం రోజు వరకు ఎవరూ దొరకలేదు.రిక్షా తొక్కే వ్యక్తి...

కలసి ఉంటే కలదు సుఖం

Image
అనగనగా ఒక ఊరిలో రామయ్య, సీతమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి నలుగురు సంతానం.నలుగురు కొడుకులు,కొడళ్లతో ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది.ఆ ఊరిలో అందరూ మీరు ఎప్పుడు ఇలా ఎలా కలిసి వుంటారు అని అనుకుంటారు.ఒకరోజు వాళ్ల ఇంటికి ఒక అతిధి వచ్చాడు అతను వాళ్లలో వాళ్లకు ఎలాగైనా గొడవ పెట్టాలి అనుకుని వచ్చాడు.అత్త సీతమ్మ వంట పూర్తి చేసింది ,పెద్దకొడలికి ఆ కూర ఒక అయిదు నిముషాల తర్వాత కొంచెం ఉప్పు వేసి దించు అని చెప్పి ఆమె బయటకు వెళ్ళింది.పెద్దకొడలు సరే అన్నది ఇంతలో బట్టలు అరబెట్టేది వుందని రెండవ కోడలికి చెప్పి వెళ్ళింది,ఆమె కూడా సరే అన్నది అప్పుడే వాళ్ళ ఆయన పిలిచేసరికి వెళ్ళింది.మూడవ కోడలికి ఉప్పు వేసి దించమని చెప్పింది.ఆమెకు నీళ్లు పట్టేది ఉందని వెళ్తూ వెళ్తూ చిన్న కోడలికి చెప్పి వెళ్ళింది.చిన్న కోడలు సరే అని ఉప్పు వేసి దించింది.నీళ్లు పట్టి తిరిగి వచ్చిన మూడవ కోడలు ఉప్పు వేసి కలిపింది.భర్త దగ్గర నుండి వచ్చిన రెండవకోడలు చెల్లి ఉప్పు వేసిందో లేదో అని ఉప్పు వేసి కలిపింది.ఆ తర్వాత కొద్ది సేపటికి వచ్చిన పెద్ద కోడలు నా చెల్లి  ఉప్పు వేసిందో లేదో అని ఆమె కూడా ఉప్పు వేసింది.మధ్యాహ్నం భోజనానికి ...

దురాశ దుఃఖానికి చేటు.

Image
అనగనగా ఒక ఊరిలో రంగయ్య అతని భార్య నివాసం ఉండేవారు, రంగయ్య కష్టపడిపని చేసి కుటుంబాన్ని పోషించేవాడు.అతని భార్య తెచ్చిన ధనం అంత ఖర్చు చేస్తూ ఉండేది .రంగయ్య ఎంతపని చేసిన డబ్బులు మిగలడం లేదు అని బాధపడేవాడు.ఒకరోజు అలా వెళుతున్న రంగయ్య కి నా స్నేహితురాలు ఆపదలో ఉంది కాపాడు అని చిలుక చెప్పింది,సరే నీ స్నేహితురాలు ఎక్కడుందో చూపించు అన్నాడు రంగయ్య. అక్కడ బాతు ఉంది దానికి గాయం అయింది,దానికి సపర్యలు చేసి కట్టు కట్టాడు.బాతు చాలా సంతోషపడి అతనికి ఒక బంగారు గుడ్డు ఇచ్చింది.చాలా ఆనందంగా ఇంటికి వెళ్లి భార్యకు బంగారు గుడ్డు ఇచ్చాడు.భార్య దానిని బజారులో అమ్మి ధనాన్ని తెచ్చుకుంది.రంగయ్య రోజు అలా చేరువుదగ్గరకు వెళ్లడం ఒక బంగారు గుడ్డు తెచ్చుకోవడం పరిపాటిగా మారింది.చూసిన జనాలంతా ఆశ్చర్యపోయేలా వారు ధనాన్ని పోగు చేస్తున్నారు.ఒకరోజు వారికి మెదడులో దురాశ కలిగింది.బాతు దగ్గర రోజు ఒక గుడ్డు తెచ్చుకునే బదులు బాతును తెచ్చి ఇంట్లో దానిని కొస్తే చాలా గుడ్లు వస్తాయి కదా !అని ఆలోచించారు.వెంటనే అమలు చేయడం కోసం చెరువు దగ్గరకు వెళ్లారు ,బాతు వీరిని చూసి భయపడి దూరంగా పారిపోయింది.మొత్తానికి బాతు బంగారుగుడ్డు పోయి...

సమయస్ఫూర్తి

Image
అనగనగా ఒక ఊరిలో సాంబయ్య అనే వ్యాపారి ఉండేవాడు.అతను వ్యాపారరీత్యా ఒక ఉరి నుండి ఇంకొక ఊరికి ప్రయాణం చేస్తూ ఉండేవాడు.ఒక పని మీద తన ప్రాణస్నేహితుడిని కలవడానికి దొంగలపురం అనే ఊరికి వెళ్ళాడు. ఆ ఊరిలో దొంగతనాలు ఎక్కువగా జరగడం వల్ల ఆ ఊరికి దొంగలపురం అనే పేరు వచ్చింది.తన స్నేహితుడిని కలిసి మాట్లాడేసరికి చాలా సమయం అయింది సాయంకాలం ఆ ఉరి నుండి బయలుదేరాడు ,తన స్నేహితుడు ఈ ఊర్లో దొంగలు ఎక్కువగా ఉంటారు నువ్వు నీ సొమ్ము జాగ్రత్తగా తీసుకెళ్లు అన్నాడు.చీకటి మరియు అడవిగుండా ప్రయాణం అవడం చేత సాంబయ్య మెల్లిగా నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి ఎవరో తనను వెంబడిస్తున్నారు అని చూసాడు .ఒక వ్యక్తి తనను దూరం నుంచి ఫాలో అవుతున్నాడు అతనికి భయం వేసింది.అలా నడుస్తూ ఉన్నాడు, కొంతసేపటికి ఒక చెరువు కనిపించింది అతనికి వెంటనే ఒక ఉపాయం తట్టింది.చెరువు దగ్గరకు వెళ్లి అయ్యయ్యో నా పెట్టె చెరువులో పడిపోయింది అని లబోదిబోమన్నాడు.అతనిని వెంబడిస్తున్న వ్యక్తి దగ్గరికి వచ్చి ఏమైంది ?అంటాడు నా పెట్టె పడిపోయింది అన్నాడు సాంబయ్య .దొంగ వెంటనే నేను తీసి ఇస్తా అని చెరువులోకి దూకాడు ,సాంబయ్య వెంటనే పొదల్లో ఉన్న పెట్టె తీ...

ఐకమత్యమే మహాబలం.

Image
ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .

తెనాలి రామలింగని తెలివి

Image
అది శ్రీకృష్ణదేవరాయలు రాజ్యం ,అతని మంత్రి తెనాలి రామకృష్ణుడు. అతను చాలా తెలివినవాడు.పక్క రాజ్యం లోని రాజు ఈ విషయం తెలుసుకుని అతని తెలివికి పరీక్ష పెట్టాలనుకున్నాడు.మా రాజ్యానికి ఒక ఇరవై కిలోల క్యాబేజీ,యాభై ఆకుకూర కట్టలు కావాలని  వర్తమానం పంపాడు.అందరూ ఈ వర్తమానాన్ని చూసి తలలు పట్టుకొని కూర్చున్నారు.ఆ రాజ్యం నుండి ఈ రాజ్యానికి వెళ్ళడానికి అరవై రోజుల ప్రయాణం పడుతుంది,అని భయపడుతున్నారు.శ్రీకృష్ణదేవరాయలు రామలింగడిని పిలిచి ఈ సమస్యకు పరిష్కారం చూపమని అడిగాడు. రామలింగడు బాగా ఆలోచించి ఒక  పది ఎద్దులబండ్లు తెప్పించామన్నాడు.అందరూ చాలా ఉత్కంఠగా చూస్తున్నారు ఈయన ఏమి చేస్తున్నాడు అని.రాయలు మాత్రం రామలింగడి మీద నమ్మకంతో ఏమి అడగలేదు,తెనాలి రామలింగడు అన్ని ఎద్దులబండ్లలో సగం వరకు మట్టిని నింపాడు.కొన్నింటిలో ఆకుకూరలు విత్తనాలు కొన్నింటిలో క్యాబేజీ విత్తనాలు వేశాడు. ఒక్కొక్క బండికి రెండు కుండలు కట్టాడు,ఒక్కో బండికి ఇద్దరు మనుషులను పెట్టాడు వారు దారి పొడవునా వెళ్తూ వెళ్తూ మధ్యలో ఆ మట్టికి నీరు పెట్టమన్నాడు అలా అరవై రోజుల ప్రయాణ సమయానికి ఆ గింజలు మొలకెత్తి తాజా కూరగాయలు,ఆకుకూరలు రాజు గ...

అంతా మన మంచికే...

Image
అనగనగా ఒక రాజ్యం ఉండేది, దానికి రాజు సులోచనడు.అంటే మంచి ఆలోచనలు కలిగినవాడు అని అర్థం .రాజు చాలా మంచివాడు కానీ ముక్కోపి వెంటనే కోపం వస్తుంది.ఆయనతో ఎవరు మాట్లాడిన చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడతారు. అతని దగ్గర రాజశేఖరుడు అనే మంత్రి ఉండేవాడు.అతను మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి.ఒకసారి రాజదర్బారులో పండితుల సేవ చేస్తుంటే పండ్లను కోసి ఇస్తుండగా వేలు తెగింది అక్కడ ఉన్నవారు అంత బాధపడ్డారు ఒక్క మంత్రి మాత్రం అంత మన మంచికే అన్నాడు.అసలే ముక్కోపి అయిన సులోచనడు ఎం ఆలోచించకుండా అతనిని బంధించాడు.ఒక వారం రోజుల తర్వాత వేటకు వెళ్ళాడు మంది మార్బలంతో చీకటి పడింది.తన వెంట వచ్చినవారు తప్పిపోయారు అలా వెళుతూ ఒక గూడెంకి చేరాడు.అక్కడ ఉన్నవాళ్లు ఇతనిని దొంగగా భావించి కట్టిపడేశారు.గూడెం పెద్ద వచ్చాడు అక్కడివారు అయ్యా ఇతను వేరే ప్రదేశం నుండి చొరబడ్డాడు అందుకే కట్టి పడేసాము అన్నారు.పెద్ద చూసి ఐతే ఇతనిని అమ్మవారికి బలి ఇవ్వండి  అన్నాడు.ఇంకొక తలారీ వచ్చి రాజు సులోచనుడిని కింద నుండి మీద వరకు తేరిపారా చూసాడు .అతని వేలు తెగి ఉంది,ఇతను బలి ఇవ్వడానికి సరిపోదు అన్నాడు.హమ్మయ్య ప్రాణాలు నిలబడ్డాయి అని సంతోషించి ...

రామచంద్రయ్య కథ

Image
అనగనగా ఒక ఊరిలో రామచంద్రయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను కట్టెలు కొట్టి డబ్బులు సంపాదించేవాడు .ఎంత చేసినా తినడానికిఈ తప్ప ఏమీ మిగలడం లేదు,అని పగలు రాత్రి కష్టపడి కట్టెలు కొట్టేవాడు అతనికి నిద్ర కూడా సరిగా ఉండేది కాదు.ఒకరోజు అతని కూతురికి ఆరోగ్యం బాగాలేదు అదే దిగులుతో ఎలాగైనా ఏ రోజు ఎక్కువ కట్టెలు కొట్టాలని నిర్ణయించుకున్నాడు.అలా కొడుతున్న సమయంలో గొడ్డలి చేయి జారీ నీటిలో పడిపోయింది.అందులో నుండి గంగా మాత బయటకువచ్చి బంగారు గొడ్డలి ఇచ్చింది.అమ్మ ఇది నాది కాదు అన్నాడు రామచంద్రయ్య, గంగామాత లోపలికి వెళ్లి వెండి గొడ్డలి తెచ్చింది .అమ్మా ఇదికూడా నాది కాదు ,నాది కేవలం ఇనుప గొడ్డలి అంతే అన్నాడు .గంగమాత మళ్ళీ లోపలికి వెళ్లి ఇనుప గొడ్డలి తెచ్చి ఇచ్చింది.హా ఇది నాదే అని తీసుకున్నాడు .అతను నిస్వార్థంగా ఉన్నందువల్ల గంగమాత సంతోషించి బంగారు మరియు వెండి గొడ్డలి కూడా ఇచ్చింది.రామచంద్రయ్య వద్దు అమ్మా నాకు అన్నాడు,అయినా ఆమె ఇచ్చింది,దానిని తీసుకొని ఇంటికి వెళ్లి భార్యకు ఇచ్చి జరిగిన విషయాన్ని చెప్పాడు. అనోటా ఈ నోటా అది ఎదురింటి రాజయ్యకు తెలిసింది.రాజయ్య కూడా ఎలాగైనా  బంగారు గొడ్డలి, వెండి గొడ్డ...

బుద్ది బలం

Image
అనగనగా ఒక రాజ్యం .ఆ రాజ్యంలో శుభాసేనుడు అనే రాజు ఉండేవాడు .అతను చాలా మంచివాడు కవులు కళాకారులను ప్రోత్సహించేవాడు.ఒకరోజు రాజ్యంలో ఒక విచిత్రమైన చాటింపు వేయించాడు. రాజ్యంలో అందమైన చిత్రాన్నీ గియమని చెప్పాడు.  రాజ్యంలోని కళాకారులు అంతా ఆలోచనలో పడ్డారు.ఏ బొమ్మ గీస్తే రాజుగారి బహుమతి లభిస్తుందో అని నెల రోజుల గడువు ముగిసింది.ఆ రోజు అన్ని చిత్రపటాలు తీసుకొని వచ్చి ప్రదర్శించడం మొదలు పెట్టారు,సాయంకాలం అయింది కానీ రాజగారికి మాత్రం ఒక్క చిత్రపటం కూడా నచ్చడం లేదు ,రాజు సభ నుండి నిష్క్రమించాడు. మరల గడువు పొడిగించాడు రాజు.కళాకారులు అంతా తలలు పట్టుకున్నారు ఇంకా ఏమి గీయాలి అని మదన పడుతున్నారు.పక్క ఊరి నుండి సుభద్రుడు అనే వ్యక్తి వచ్చాడు,అతను శుభాసేనుడు దగ్గరకు వచ్చి రాజా ఏ రాజ్యంలో అందమైన చిత్రాన్ని గీసాను అన్నాడు ప్రజలు అంతా ఆశ్చర్యంతో చూసారు.సుభద్రుడు తాను తెచ్చిన పటం పైన నుండి తెర తీసాడు చూస్తే అక్కడ అద్దం ఉంది అందులో రాజుగారి ముఖం కనిపించింది.సుభద్రుడు మాట్లాడుతూ రాజా ఈ రాజ్యంలో అందమైన చిత్రం మీదే అన్నాడు,దానికి రాజు సంతోషించి బహుమతి ఇచ్చాడు. అన్ని సార్లు ప్రతిభ పనికిరాదు కొన్ని సా...

స్నేహమేరా జీవితం.

Image
అనగనగా ఒక ఊరిలో ఒక చెరువు ఉండేది,ఆ చెరువు పక్కన ఒక చెట్టు ఉండేది .ఆ చెట్టు మీద ఒక పావురాల గుంపు ,ఎలుక ,చీమలు ఉండేవి.చెరువులో ఒక బాతు ఉండేది .అవన్నీ మంచి స్నేహంతో కలిసి మెలిసి ఉండేవి. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక వేటగాడు వచ్చాడు.ఈ చెట్టు మీద ఎక్కువ పావురాలు ఉన్నాయని వల విసిరి పట్టుకున్నాడు.పావురాలు ఎడుస్తున్నాయి, ఐతే చీమ ,ఎలుక,బాతు అన్ని కలిసి ప్లాన్ చేసాయి ,ఆ పావురాలను ఎలా అయినా విడిపించాలని వెంటనే అమలు చేసాయి. బాతు అరవడం మొదలు పెట్టింది వేటగాడు ఈ శబ్దం ఏంటి అని అటు వెళ్ళాడు,వెంటనే చీమ అతనిని కుట్టింది.అమ్మా నొప్పి అని విలవిల్లాడడు. ఎలుక పరుగున వెళ్లి వలను కొరికింది,పావురాలు అన్ని పారిపోయాయి.వేటగాడు వెంటనే అరవడం మొదలుపెట్టాడు .అన్ని ఎక్కడివి అక్కడకు వెళ్లిపోయాయి ఇంతలో చీమ చెరువులో పడిపోయింది పావురాలు ఒక ఆకును తుంచి నీటిలో వేసింది.చీమ ఆకుపైకి ఎక్కింది ,బాతు దానిని ఒడ్డుకు చేర్చింది.ఇలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవనం సాగించాయి.  మన చుట్టు పక్కల వారితో ఎల్లవేళలా స్నేహంతో ఉండాలి ఒకరికి మంచి చేస్తే మళ్ళీ అదే తిరిగి వస్తుంది.