అనగనగా ఒక ఊరిలో సాంబయ్య అనే వ్యాపారి ఉండేవాడు.అతను వ్యాపారరీత్యా ఒక ఉరి నుండి ఇంకొక ఊరికి ప్రయాణం చేస్తూ ఉండేవాడు.ఒక పని మీద తన ప్రాణస్నేహితుడిని కలవడానికి దొంగలపురం అనే ఊరికి వెళ్ళాడు. ఆ ఊరిలో దొంగతనాలు ఎక్కువగా జరగడం వల్ల ఆ ఊరికి దొంగలపురం అనే పేరు వచ్చింది.తన స్నేహితుడిని కలిసి మాట్లాడేసరికి చాలా సమయం అయింది సాయంకాలం ఆ ఉరి నుండి బయలుదేరాడు ,తన స్నేహితుడు ఈ ఊర్లో దొంగలు ఎక్కువగా ఉంటారు నువ్వు నీ సొమ్ము జాగ్రత్తగా తీసుకెళ్లు అన్నాడు.చీకటి మరియు అడవిగుండా ప్రయాణం అవడం చేత సాంబయ్య మెల్లిగా నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి ఎవరో తనను వెంబడిస్తున్నారు అని చూసాడు .ఒక వ్యక్తి తనను దూరం నుంచి ఫాలో అవుతున్నాడు అతనికి భయం వేసింది.అలా నడుస్తూ ఉన్నాడు, కొంతసేపటికి ఒక చెరువు కనిపించింది అతనికి వెంటనే ఒక ఉపాయం తట్టింది.చెరువు దగ్గరకు వెళ్లి అయ్యయ్యో నా పెట్టె చెరువులో పడిపోయింది అని లబోదిబోమన్నాడు.అతనిని వెంబడిస్తున్న వ్యక్తి దగ్గరికి వచ్చి ఏమైంది ?అంటాడు నా పెట్టె పడిపోయింది అన్నాడు సాంబయ్య .దొంగ వెంటనే నేను తీసి ఇస్తా అని చెరువులోకి దూకాడు ,సాంబయ్య వెంటనే పొదల్లో ఉన్న పెట్టె తీసుకొని వెళ్ళిపోయాడు.అతను చెరువులో వెతుకుతూనే ఉన్నాడు. సాంబయ్య క్షేమంగా ఇల్లు చేరాడు.దొంగని తప్పించు కోవడానికి సమయానికి సరైన ఆలోచన చేసి సమయస్ఫూర్తి ప్రదర్శించాడు.సమయస్ఫూర్తి ఎప్పుడు మనను ఆపద నుండి కాపాడుతుంది.
ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా. అనగనగా ఒక ఊర...
Comments
Post a Comment