అంతా మన మంచికే...
అనగనగా ఒక రాజ్యం ఉండేది, దానికి రాజు సులోచనడు.అంటే మంచి ఆలోచనలు కలిగినవాడు అని అర్థం .రాజు చాలా మంచివాడు కానీ ముక్కోపి వెంటనే కోపం వస్తుంది.ఆయనతో ఎవరు మాట్లాడిన చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడతారు. అతని దగ్గర రాజశేఖరుడు అనే మంత్రి ఉండేవాడు.అతను మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి.ఒకసారి రాజదర్బారులో పండితుల సేవ చేస్తుంటే పండ్లను కోసి ఇస్తుండగా వేలు తెగింది అక్కడ ఉన్నవారు అంత బాధపడ్డారు ఒక్క మంత్రి మాత్రం అంత మన మంచికే అన్నాడు.అసలే ముక్కోపి అయిన సులోచనడు ఎం ఆలోచించకుండా అతనిని బంధించాడు.ఒక వారం రోజుల తర్వాత వేటకు వెళ్ళాడు మంది మార్బలంతో చీకటి పడింది.తన వెంట వచ్చినవారు తప్పిపోయారు అలా వెళుతూ ఒక గూడెంకి చేరాడు.అక్కడ ఉన్నవాళ్లు ఇతనిని దొంగగా భావించి కట్టిపడేశారు.గూడెం పెద్ద వచ్చాడు అక్కడివారు అయ్యా ఇతను వేరే ప్రదేశం నుండి చొరబడ్డాడు అందుకే కట్టి పడేసాము అన్నారు.పెద్ద చూసి ఐతే ఇతనిని అమ్మవారికి బలి ఇవ్వండి అన్నాడు.ఇంకొక తలారీ వచ్చి రాజు సులోచనుడిని కింద నుండి మీద వరకు తేరిపారా చూసాడు .అతని వేలు తెగి ఉంది,ఇతను బలి ఇవ్వడానికి సరిపోదు అన్నాడు.హమ్మయ్య ప్రాణాలు నిలబడ్డాయి అని సంతోషించి వెంటనే రాజ్యానికి తిరిగి వచ్చాడు.వెంటనే బందీఖానకి వెళ్లి మంత్రి రాజశేఖరుడిని హత్తుకున్నాడు.ఆరోజు నువ్వు అంత మన మంచికే అంటే నాకు బోధపడలేదు,నన్ను క్షమించు అన్నాడు రాజు సులోచనడు. అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ వుంటారు ఏదయినా ఒక కారణం లేకుండా జరగదు,ప్రతిదీ ఒక కారణంతో జరుగుతుంది తొందరపడవద్దు.
Comments
Post a Comment