రామచంద్రయ్య కథ
అనగనగా ఒక ఊరిలో రామచంద్రయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను కట్టెలు కొట్టి డబ్బులు సంపాదించేవాడు .ఎంత చేసినా తినడానికిఈ తప్ప ఏమీ మిగలడం లేదు,అని పగలు రాత్రి కష్టపడి కట్టెలు కొట్టేవాడు అతనికి నిద్ర కూడా సరిగా ఉండేది కాదు.ఒకరోజు అతని కూతురికి ఆరోగ్యం బాగాలేదు అదే దిగులుతో ఎలాగైనా ఏ రోజు ఎక్కువ కట్టెలు కొట్టాలని నిర్ణయించుకున్నాడు.అలా కొడుతున్న సమయంలో గొడ్డలి చేయి జారీ నీటిలో పడిపోయింది.అందులో నుండి గంగా మాత బయటకువచ్చి బంగారు గొడ్డలి ఇచ్చింది.అమ్మ ఇది నాది కాదు అన్నాడు రామచంద్రయ్య, గంగామాత లోపలికి వెళ్లి వెండి గొడ్డలి తెచ్చింది.అమ్మా ఇదికూడా నాది కాదు ,నాది కేవలం ఇనుప గొడ్డలి అంతే అన్నాడు .గంగమాత మళ్ళీ లోపలికి వెళ్లి ఇనుప గొడ్డలి తెచ్చి ఇచ్చింది.హా ఇది నాదే అని తీసుకున్నాడు .అతను నిస్వార్థంగా ఉన్నందువల్ల గంగమాత సంతోషించి బంగారు మరియు వెండి గొడ్డలి కూడా ఇచ్చింది.రామచంద్రయ్య వద్దు అమ్మా నాకు అన్నాడు,అయినా ఆమె ఇచ్చింది,దానిని తీసుకొని ఇంటికి వెళ్లి భార్యకు ఇచ్చి జరిగిన విషయాన్ని చెప్పాడు. అనోటా ఈ నోటా అది ఎదురింటి రాజయ్యకు తెలిసింది.రాజయ్య కూడా ఎలాగైనా బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి తెచ్చుకోవాలని ఆయన కూడా కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు.అలా వెళ్లి కావాలనే గొడ్డలి నీళ్లలో పడేసాడు,గంగమాత ప్రత్యక్షమై బంగారు గొడ్డలి తెచ్చింది ,రాజయ్య ఇది నాదే అని అన్నాడు,గంగమాత ఒకసారి చూడు నిజంగా ఇది నీదేనా అని అడుగుతుంది.మళ్ళీ లోపలికి వెళ్లి వెండి గొడ్డలి తెచ్చింది,రాజయ్య ఇది కూడా నాదే నేనే పడేసుకున్న అన్నాడు.గంగమాత లోపలికి వెళ్లి ఇనుప గొడ్డలి తెచ్చింది రాజయ్య ఇది నాది కాదు అన్నాడు.ఆమె మూడు గొడ్డళ్ళను తీసుకొని వెళ్ళిపోయింది.అమ్మా అమ్మా అని పిలిచాడు అయినా గంగమాత రాలేదు.అందుకే ఎల్లవేళలా మన పని మనం చేయాలి ,ఎదుటివారిని చూసి ఈర్ష్య ,అసూయ చెందవద్దు. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే అది పులి ఐపొడు కదా!
Comments
Post a Comment