కలసి ఉంటే కలదు సుఖం

అనగనగా ఒక ఊరిలో రామయ్య, సీతమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి నలుగురు సంతానం.నలుగురు కొడుకులు,కొడళ్లతో ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది.ఆ ఊరిలో అందరూ మీరు ఎప్పుడు ఇలా ఎలా కలిసి వుంటారు అని అనుకుంటారు.ఒకరోజు వాళ్ల ఇంటికి ఒక అతిధి వచ్చాడు అతను వాళ్లలో వాళ్లకు ఎలాగైనా గొడవ పెట్టాలి అనుకుని వచ్చాడు.అత్త సీతమ్మ వంట పూర్తి చేసింది ,పెద్దకొడలికి ఆ కూర ఒక అయిదు నిముషాల తర్వాత కొంచెం ఉప్పు వేసి దించు అని చెప్పి ఆమె బయటకు వెళ్ళింది.పెద్దకొడలు సరే అన్నది ఇంతలో బట్టలు అరబెట్టేది వుందని రెండవ కోడలికి చెప్పి వెళ్ళింది,ఆమె కూడా సరే అన్నది అప్పుడే వాళ్ళ ఆయన పిలిచేసరికి వెళ్ళింది.మూడవ కోడలికి ఉప్పు వేసి దించమని చెప్పింది.ఆమెకు నీళ్లు పట్టేది ఉందని వెళ్తూ వెళ్తూ చిన్న కోడలికి చెప్పి వెళ్ళింది.చిన్న కోడలు సరే అని ఉప్పు వేసి దించింది.నీళ్లు పట్టి తిరిగి వచ్చిన మూడవ కోడలు ఉప్పు వేసి కలిపింది.భర్త దగ్గర నుండి వచ్చిన రెండవకోడలు చెల్లి ఉప్పు వేసిందో లేదో అని ఉప్పు వేసి కలిపింది.ఆ తర్వాత కొద్ది సేపటికి వచ్చిన పెద్ద కోడలు నా చెల్లి  ఉప్పు వేసిందో లేదో అని ఆమె కూడా ఉప్పు వేసింది.మధ్యాహ్నం భోజనానికి అతిధి ,నలుగురు కొడుకులతో రామయ్య కూర్చున్నాడు.సీతమ్మ కూర తీసుకొని వస్తూ ఉప్పు వేసిందో లేదో  పెద్దకొడలు అనుకోని ఆమె ఉప్పు వేసి కూర కలుపుకొని తీసుకొని వచ్చింది.సీతమ్మ అందరికి భోజనం వడ్డించింది అతిధి తిని ఈ భోజనంలో ఉప్పు ఎక్కువ అయింది అన్నాడు.రామయ్య మాత్రం ఎదో ఒక రోజు ఇలా జరుగుతుందిలే అని తినమన్నాడు .కొడుకులు అంతా తిన్నారు,ఒక్కరు కూడా కిక్కురుమనలేదు.ఆ అతిథికి ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ విషయం,రామయ్యను అడిగాడు"మీరు అందరూ ఇలా సంతోషంగా ఎలా వుండగలుగుతున్నారు ఆ కూరలో ఉప్పు ఎక్కువ అయిన కూడా ఒక్కరు కూడా చప్పుడు చేయలేదు,తండ్రి మాట ప్రకారం తిన్నారు అంటాడు.రామయ్య నవ్వుతూ అన్ని పనులు మహిళలే చేస్తారు మనం ఏమి చెయ్యము ఏదో ఒకరోజు అలా జరుగుతుంది అది కూడా వారు  కావాలని చేయరు కదా! అయినా కుటుంబం అంటే  ఒకరికొకరు అర్థం చేసుకోవాలి.అప్పుడే అంతా కలిసి ఉండడానికి ఆస్కారం ఉంటుంది.అందరూ కలిసి ఉంటే సంతోషంగా ఉంటుంది అంటాడు.




Comments

Popular posts from this blog

రామచిలుక కథ

చిన్న చేప కథ

అంతా మన మంచికే...