బుద్ది బలం

అనగనగా ఒక రాజ్యం .ఆ రాజ్యంలో శుభాసేనుడు అనే రాజు ఉండేవాడు .అతను చాలా మంచివాడు కవులు కళాకారులను ప్రోత్సహించేవాడు.ఒకరోజు రాజ్యంలో ఒక విచిత్రమైన చాటింపు వేయించాడు.రాజ్యంలో అందమైన చిత్రాన్నీ గియమని చెప్పాడు. రాజ్యంలోని కళాకారులు అంతా ఆలోచనలో పడ్డారు.ఏ బొమ్మ గీస్తే రాజుగారి బహుమతి లభిస్తుందో అని నెల రోజుల గడువు ముగిసింది.ఆ రోజు అన్ని చిత్రపటాలు తీసుకొని వచ్చి ప్రదర్శించడం మొదలు పెట్టారు,సాయంకాలం అయింది కానీ రాజగారికి మాత్రం ఒక్క చిత్రపటం కూడా నచ్చడం లేదు ,రాజు సభ నుండి నిష్క్రమించాడు. మరల గడువు పొడిగించాడు రాజు.కళాకారులు అంతా తలలు పట్టుకున్నారు ఇంకా ఏమి గీయాలి అని మదన పడుతున్నారు.పక్క ఊరి నుండి సుభద్రుడు అనే వ్యక్తి వచ్చాడు,అతను శుభాసేనుడు దగ్గరకు వచ్చి రాజా ఏ రాజ్యంలో అందమైన చిత్రాన్ని గీసాను అన్నాడు ప్రజలు అంతా ఆశ్చర్యంతో చూసారు.సుభద్రుడు తాను తెచ్చిన పటం పైన నుండి తెర తీసాడు చూస్తే అక్కడ అద్దం ఉంది అందులో రాజుగారి ముఖం కనిపించింది.సుభద్రుడు మాట్లాడుతూ రాజా ఈ రాజ్యంలో అందమైన చిత్రం మీదే అన్నాడు,దానికి రాజు సంతోషించి బహుమతి ఇచ్చాడు.అన్ని సార్లు ప్రతిభ పనికిరాదు కొన్ని సార్లు ప్రతిభ లేకున్నా బుద్ది బలంతో మనం ఎదుటి వారిని గెలవవచ్చు.







Comments

Popular posts from this blog

రామచిలుక కథ

చిన్న చేప కథ

అంతా మన మంచికే...