తెలుగు కథలలో తెనాలి రామలింగని కథలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది.రాయల వారి ఆస్థానంలో తెనాలి రామలింగడు మాత్రమే చాలావరకు సమస్యలను పరిష్కరించారు.తన యుక్తులతో ఇతరుల కుటీలత్వాన్ని రాజుగారి దగ్గర బయటపెట్టాడు. రాయల వారి తల్లి జబ్బుతో బాధపడుతుంది. వైద్యుడు పరీక్షించి తన కోరికలు ఏవైనా ఉంటే తీర్చాలిసిందిగా ఆదేశించాడు.ఆమె తన ఆఖరి కోరికగా మామిడి పండ్లు తినాలని ఉంది అని అన్నది,కానీ అది మామిడి పండ్లు వచ్చే కాలం కాదు కాబట్టి అతనికి లభించలేదు ఆమె ఆ కోరికతో కాలం చేసింది.రాయలవారు బాధపడ్డాడు ఒక పండితుడిని కలిసి విషయం చెప్పాడు.ఆ పండితుడు దోషం జరిగింది పరిహారం చేయాలి అని చెప్పి బంగారు మామిడిపండ్లు పంచాలని చెప్పాడు.రాజుగారు తెచ్చి బంగారు మామిడిపండ్లను పంచాడు.చాలా వరకు ఆ పండ్లను పండితుడి సన్నిహితులు తీసుకున్నారు.విషయం తెలుసుకున్న తెనాలి రామలింగడు వాళ్ళ మోసాన్ని బయటపెట్టాలి అనుకున్నాడు.మా తల్లి గారు చనిపోతుండగా చివరి కోరికగా వాతలు పెట్టమని కోరింది.రాజుగారి దగ్గర మామిడిపండ్లు తీసుకున్న వారు అంతా ఒక వరసలో నిలుచుంటే వాతలు పెడతాను అని అన్నాడు రామలింగడు.దీనితో భయపడిన పండితులు చేసిన తప్పు ఒప్పుకున్నారు.ఇంకోసారి అలా చేయము అని ప్రాధేయపడ్డారు.ఇంటి పెద్దలు ఎల్లప్పుడూ అందరూ బాగుండాలని కోరుకుంటారు.కొంతమంది కావాలనే దోషం లేకున్నా ఉంది అని చెప్పి డబ్బులు దండుకుంటారు .జాగ్రత్తగా ఉండాలి.
ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా. అనగనగా ఒక ఊర...
Comments
Post a Comment